Jr NTR దేవర పార్ట్-1 (DEVARA part-1) Full Movie Explanation

Devara2

హాయ్ ఫ్రెండ్స్ Welcome to FilmyWebstories.com సెప్టెంబర్ 27 2024 లో రిలీజ్ అయినటువంటి దేవర అనే Mass Action Thriller మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం.

మూవీ స్టార్ట్ అవ్వగానే కథ అంతా 1980 సంవత్సరం లో జరుగుతుంది. కట్ చేస్తే ముంబై పోలీస్ హెడ్ క్వార్టర్ లో సెంట్రల్ హోమ్ మినిస్టర్ అండ్ రా చీఫ్ ఇద్దరు దయ అండ్ యతి అనే ఇద్దరు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ గురించి అత్యవసర మీటింగ్ ని ఏర్పాటు చేస్తారు. దయ అనే వ్యక్తి పెద్దవాడు యతి అనే వ్యక్తి చిన్నవాడు,  దయ ఎక్కడ ఉన్నాడో ఎవరికీ తెలియదు. యతినే ఇండియాలో ఉన్న పనులను ఆపరేట్ చేస్తుంటాడు.  వీళ్ళిద్దరూ కలిసి ఇండియా జరగబోయే వరల్డ్ కప్ ఈవెంట్ మీద పెద్ద అటాక్ చేయాలనే ప్లాన్ లో ఉన్నారని సెంట్రల్ హోమ్ మినిస్టర్ ఐపిఎస్ ఆఫీసర్స్ కి చెప్పి ఎలాగైనా సరే యతి ని పట్టుకోమని చెప్తాడు గత మూడు సంవత్సరాలుగా శివ అనే ఆఫీసర్ యతి కేసు ని డీల్ చేస్తూ మూడు సార్లు యతిని పట్టుకుంటాడు. కానీ పొలిటిషియన్స్ ఒత్తిడి వల్ల యతిని వదిలేయాల్సి వస్తుంది. కాని ఈసారి మాత్రం సెంట్రల్ హోమ్ మినిస్టర్ శివకి ఫుల్ పవర్స్ ఇచ్చి యతిని ఎలాగైనా పట్టుకోమని చెప్తాడు ఇక శివ తన టీం తో కలిసి యతి గ్యాంగ్ మెంబర్ అయిన రానే అనే వాడిని ట్రాప్ చేసి పట్టుకుంటారు .

వాడిని బాగా టార్చర్ చేయడంతో వాడు యతి గురించి సమాచారం ఇస్తాడు. ఆంధ్ర తమిళనాడు సరిహద్దు లో ఉన్న రత్నగిరి అనే ఊరిలో ఉండే మురుగ అనే వ్యక్తి దగ్గరికి యతి వెళ్ళాడని మూడు నెలలు గా అతని గురించి ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ తెలియదని శివకి తెలుస్తుంది.  ఇక శివ తన టీం తో కలిసి రత్నగిరికి వెళ్తాడు శివ రత్నగిరి లోని డిఎస్పి తులసిని కలిసి తను పోలీస్ ఆఫీసర్ అనే విషయం చెప్పకుండా నా పేరు డాని నేను ముంబై స్మగ్లర్ ని సముద్రం నుండి నా సరుకుని దించాలి ఆ పని మురుగ మాత్రమే చేయగలడని తెలిసి ఇక్కడిదాకా వచ్చాం.  కానీ తీరా చూస్తే మురుగ చనిపోయాడని అంటున్నారు.  మీరు మురుగకి హెల్ప్ చేసినట్టు నాకు కూడా నా సరుకుని సముద్రం నుంచి తీసుకొని రావడంలో హెల్ప్ చేయండి అని అడుగుతాడు.  దానికి డిఎస్పి సముద్రం నుండి సరుకుని బయటకు తెచ్చేది మేము కాదు ఆ కొండ మీద నాలుగు ఊర్లు ఉన్నాయి ఆ నాలుగు ఊర్లను కలిపి ఎర్ర సముద్రం అని అంటారు. అక్కడ భైరా అనే వ్యక్తి ఉంటాడు వెళ్లి అతన్ని కలవండి మీరు పోలీస్ ఆఫీసర్స్ అని నాకు బాగా తెలుసు నేను కూడా పోలీసు వాడినే కాకపోతే ఎర్ర సముద్రం వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్తాడు. 

 శివ తన టీం తో బైరా దగ్గరికి వెళ్లి నా సరుకు తీసుకొని వస్తే ఎంత డబ్బు కావాలన్నా ఇస్తా ఈ పని మీరు మాత్రమే చేయగలని ఇక్కడిదాకా వచ్చామని అంటాడు బైరా మనిషి మాత్రం మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళిపోండి అని అంటుంటాడు. ఇక శివకి బాగా కోపం వచ్చి ఏందిరా మేము మీ దగ్గరికి వచ్చి అడుగుతున్నామని అలుసా ప్రపంచానికే దూరంగా బతుకుతున్నారు అందరినీ చంపేసిన ఎవడు అడిగే దిక్కు లేదన్నట్టు మాట్లాడతాడు.  ఆ మాటలకి బైరా కి బాగా కోపం వచ్చి శివని అతని టీం ని కొట్టి వెళ్ళిపోండి అని వార్నింగ్ ఇస్తాడు. ఖచ్చితంగా వీళ్ళకి యతి ఎక్కడున్నాడో తెలుసు ఎలాగైనా యతి గురించి ఇన్ఫర్మేషన్ లాగాలని శివ ఫిక్స్ అవుతాడు. శివ బీచ్ దగ్గర ఉండగా సింగప్ప శివతో మాట్లాడతాడు శివ సింగప్పతో చూస్తే పెద్దోడిలా ఉన్నావ్ నువ్వైనా మీ వాళ్ళకి చెప్పు నా సరుకు తెస్తే చాలా డబ్బు ఇస్తానని అంటాడు అప్పుడు సింగప్ప ఒక బోట్ లో శివని సముద్రంలోనికి తీసుకెళ్లి శివ డైమండ్ రింగ్ ని సముద్రంలో వేస్తాడు. శివ తన రింగ్ కోసం వెంటనే సముద్రంలోకి దూకుతాడు రింగ్ కోసం వెతుకుతున్న శివకి సముద్రం అడుగున అస్తిపంజరాలు గుట్టలు గుట్టలుగా కనిపించడంతో శివకి భయం వేసి వెంటనే బోట్ ఎక్కుతాడు. అప్పుడు సింగప్ప శివతో నీకు రింగ్ దొరికిందా లేదా భయం దొరికిందా నీకు కలిగిన భయమే మా వాళ్ళకి కూడా ఉంది. అందుకే ఎవరొచ్చి ఎంత డబ్బు ఇస్తానన్నా కూడా సముద్రంలోకి మాత్రం దిగటం లేదని చెప్తాడ. అప్పుడు శివ అసలు ఆ అస్తిపంజరాలు ఎవరివి వాళ్ళని ఎవరు చంపారు ఇక్కడ ఏం జరిగిందని అడుగుతాడు. 

ఇక సింగప్ప శివకి దేవర కథ చెప్పడం స్టార్ట్ చేస్తాడు కొన్ని వందల సంవత్సరాల క్రితం ప్రస్తుతం దేవర వాళ్ళు  ఉంటున్న కొండల వెనక ఒక రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి కాపలాగా రాజు భయమే తెలియని ఒక సైన్యాన్ని తయారు చేస్తాడు.  కాలక్రమేన రాజులు రాజ్యాలు మాయమైపోతాయి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని దోచుకుంటున్న సమయం అది దేశం కోసం ప్రాణాలైనా ఇచ్చే ఈ జాతి వాళ్ళు సముద్ర మార్గం గుండా బ్రిటిష్ వాళ్ళు దోచుకెళ్తున్న సంపదని వీరోచితంగా పోరాడి ఆ సంపదని తిరిగి దేశ ప్రజలకే అందించేవారు.  స్వతంత్రం వచ్చిన తర్వాత గవర్నమెంట్ కి వీళ్ళతో పెద్దగా అవసరం ఉండేది కాదు. అందుకే వీళ్ళకి పని లేక ఆకలితో అలమటించే వాళ్ళు వీళ్ళకి తెలిసిందల్లా సముద్రంలో పోరాడడమే. కొంతమంది వీళ్ళని ఉపయోగించుకోవాలని డబ్బు ఆశ చూపిస్తారు మురుగ అనే వ్యక్తి దేవరా బైరాల దగ్గరికి వచ్చి మీకు కావాల్సినంత డబ్బులు ఇస్తా సముద్రం నుండి నా సరుకు దొంగలించి తీసుకురండి అని డీల్ ఇస్తాడు.  కానీ ఆ సరుకు ఏంటనే విషయం మాత్రం నన్ను ఎప్పటికీ అడగకూడదని చెప్తాడు ప్రజలు అసలే సరైన పని లేక ఆహారం లేక ఉన్నారని తప్పని తెలిసినా కూడా ఇక ఏం చేయలేక మురుగా ఇచ్చే పనులని అందరూ చేస్తూ ఉంటారు అలా కొన్ని సంవత్సరాలుగా దేవరా బైరా వాళ్ళ మనుషులతోటి సముద్రంలో వచ్చే కార్గో షిప్స్ లోకి దొంగతనంగా వెళ్లడం మురుగా చెప్పిన కంటైనర్ నెంబర్ చూసి అందులో ఉన్న సరుగుని దొంగతనం చేసి మురుగా దగ్గరికి తీసుకొని రావడం చేస్తుంటారు కొండపైన ఉన్న నాలుగు ఊర్లకి దేవర (NTR) బైరా (SAIF అలీఖాన్)  కుంజర (KALAIYARASAN) రాయప్ప (SRIKANTH)  ఒక్కొక్కరు ఒక్కొక్క ఊరికి నాయకులుగా ఉంటారు. కట్ చేస్తే ప్రతి రోజు దేవర తన కొడుకు వరకి వాళ్ళ పూర్వీకులు చేసిన యుద్ధాల గురించి మంచి పనుల గురించి కథలు కథలుగా చెప్తుండేవాడు ఒకరోజు వర ఎప్పుడూ వాళ్ళ గురించే చెప్తావేంటి నీ గురించి నీ కథ వినాలని ఉంది చెప్పు నాన్న అని అంటాడు. 

 అప్పుడు దేవర మన పూర్వీకుల్లాగా గర్వంగా చెప్పుకోవడానికి నేను అంత గొప్ప పనులు చేయలేదురా ఏమి  చెప్పుకోలేని చీకటి కథలు ఉన్నాయని బాధపడతాడు ప్రస్తుతం వరా వయసు 12 సంవత్సరాలు ఉంటాయి. దేవర వైఫ్ కూడా ప్రెగ్నెంట్ గా ఉంటుంది కట్ చేస్తే ఆయుధ పూజ దేవర పూర్వీకులు సంవత్సరానికి ఒకసారి ఒక పోటీ

నిర్వహిస్తూ ఉంటారు ఆ పోటీలో నాలుగు ఊర్ల నుండి ఒక్కొక్కరు వచ్చి పోటీ పడతారు. పోటీలో ఎవరైతే గెలుస్తారో వాళ్ళ ఊరికి ఆ సంవత్సరం పూర్వీకుల ఆయుధాలు వెళ్తాయి. వీళ్ళంతా ఆ ఆయుధాలనే దైవంగా భావిస్తూ ఉంటారు. ఆ ఆయుధాలు ఎవరి ఊర్లో ఉంటే ఆ ఊరికి మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకం. చాలా ఏళ్లుగా ఆయుధాలు దేవరావు ఊర్లోనే ఉంటాయి ప్రతిసారి ఆయుధ పూజ ఉత్సవం ముగిసిన తర్వాత పోటీ జరుగుతుంది ఈసారి మాత్రం ఆయుధ పూజలో పోటీ వద్దని ఉన్నదే నాలుగు ఊర్లు సంవత్సరానికి ఒక ఊరు ఆయుధాలు తీసుకుందాం. ఇప్పటివరకు రాయప్ప ఊరికి ఒక్కసారి కూడా ఆయుధాలు వెళ్ళలేదు రాయప్ప ఊరి ప్రజలకి పడవలు నడపడం తప్ప యుద్ధం చేయడం తెలియదు కాబట్టి ఈ సంవత్సరం రాయప్ప వాళ్ళకి మనం ఆయుధాలను ఇద్దామని దేవరా అంటాడు కానీ బైరా కి కుంజరాకి అది ఇష్టం ఉండదు నీకు అంతగా వాళ్ళకి ఆయుధాలు ఇవ్వాలి అనిపిస్తే పోటీలో గెలిచి రాయప్పకి ఆయుధాలు పంపు అని అంటారు. దీంతో ఇక పోటీ మొదలవుతుంది ఫైట్ లో భాగంగా రెండు ఊర్ల వాళ్ళు ఓడిపోతారు ఇక మిగిలి ఉన్న ఊరు దేవరాది మాత్రమే దేవరా తన ఊరి తరపున బరిలోకి దిగి బైరా తో పోటీ పడతాడు.  ఇద్దరు ఎక్కడా తగ్గకుండా ఫైట్ చేసుకుంటూనే ఉంటారు రాత్రి మొదలైన వాళ్ళ ఫైట్ అనేది తెల్లవారే వరకు జరుగుతూనే ఉంటుంది చివరికి దేవర గెలిచి ఆ పూర్వీకుల ఆయుధాలని రాయప్ప ఊరికి పంపిస్తాడు. 

 కట్ చేస్తే ఒకచోట బస్సు మీద బాంబులతో మిషన్ గన్స్ తో దాడి చేసి బుస్సు బ్లాస్ట్ చేస్తారు. అందులో  దేవర ఊరి నుండి చదువుకోవడానికి బయటికి వెళ్ళిన ఒక పిల్లవాడు చనిపోతాడు ఊరంతా సముద్రపు దొంగల్లా ఉన్నా కూడా తర్వాత తరమైనా సరే మారాలని దేవర కూడా ఆ పిల్లవాడికి డబ్బు విషయంలో హెల్ప్ చేస్తుంటాడు ఆ పిల్లవాడు చనిపోవడంతో దేవర చాలా బాధపడతాడు. మురుగ అండ్ డిఎస్పి తులసి దేవర వాళ్ళ దగ్గరికి వచ్చి రెండు రోజుల్లో సరుకు రాబోతుంది.  సముద్రంలోనికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి అని చెప్తారు.  ఇకపై మాకు డబ్బు ఎక్కువ ఇవ్వాలని బైరా అనడంతో మురుగ దానికి కూడా సరే అని అంటాడు. కానీ దేవర మాత్రం కొన్ని రోజులు ఈ పని మనం ఆపుదాం కోస్టల్ గార్డ్స్ చాలా అలర్ట్ గా ఉంటున్నారు రెండు నెలల క్రితం మనం దొంగతనానికి వెళ్ళినప్పుడే మనల్ని పట్టుకునేంత పని జరిగింది తెలుసు కదా అని అంటాడు.  అప్పుడు బైరా ప్రమాదం ఉందని తెలిసే ఈ పని చేస్తున్నాం కొత్తగా వద్దు అంటావేంటని అంటాడు.  దానికి దేవర మనలో ఒకడికి ఏదైనా అయితే మిగిలిన వాళ్ళందరం కూడా ఆ కుటుంబానికి అండగా ఉంటాం.  కానీ అందరం ఒకేసారి దొరికిపోతే మన కుటుంబాలకి ఎవరు అండగా ఉంటారని అంటాడు కానీ బైరా కుంజర మాత్రం దేవర చెప్పే మాటలు పట్టించుకోకుండా సరుకు తేవాలని డిసైడ్ అవుతారు.  అప్పుడు రాయప్ప దేవరతో నువ్వు చెప్పినా కూడా వాళ్ళు ఆగట్లేదు ఆగరు కూడా అదే నువ్వు కూడా మాతో వస్తే క్షేమంగా అందరం పని పూర్తిచేసుకొని రావచ్చని అంటాడు. 

 ఇక దేవర కూడా కన్విన్స్ అయ్యి వాళ్ళతో వెళ్తాడు అందరూ సరుకు షిప్ నుండి దొంగలించి తిరిగి వస్తుంటారు. కానీ ఈసారి మాత్రం కోస్టల్ గార్డ్స్ దేవర వాళ్ళందరినీ సరుకుతో సహా పట్టేసుకుని షిప్ లో బంధిస్తారు.  ఆ కోస్టల్ గార్డ్ దేవర అతని మనుషుల తోటి ఒకప్పుడు మీ పూర్వీకులు దేశం కోసం పోరాడిన వీరులు కానీ మీరేమో ఇలా చేస్తున్నారు మీరు తీసుకెళ్లే సరుకు ఏంటో మీకైనా తెలుసా అది ఎవరి చేతుల్లో పడుతుందో తెలుసా మీరు తీసుకెళ్లే సరుకు ఏంటో చూడండి అని ఆ బాక్స్ లను ఓపెన్ చేస్తాడు ఆ బాక్స్ లో బాంబ్స్ గన్స్ గ్రానేడ్స్ ఉంటాయి వీటి వల్ల ఎంతో మంది అమాయకుల ప్రాణాలు పోతున్నాయి.  మీ ఊరి పిల్లాడు బస్ బ్లాస్ట్ లో చనిపోయాడు అని మీరు అనుకుంటున్నారు కదా నిజానికి బస్సు మీద కొంతమంది దొంగలు గన్స్ తో, బాంబులతో అటాక్ చేసి వాళ్ళు చేసిన ఫైరింగ్ లో ఆ పిల్లవాడు చనిపోయాడు రెండు నెలల క్రితం మీరు షిప్ నుంచి దొంగతనం చేసిన ఆయుధాలు ఆ దొంగలకి చేరడం వల్లే ఇదంతా జరిగిందని చెప్తాడు. అది విన్న దేవరకి చాలా బాధేస్తుంది. అలాగే వాళ్ళు తీసుకెళ్తున్న సరుకు మారణ ఆయుధాలు అని కూడా దేవరకి అప్పుడే తెలుస్తుంది ఆ కోస్టల్ గార్డ్ దేవర అండ్ బైరా మనుషులు అందరితోటి మీ పూర్వీకులు చాలా గొప్పవారు వాళ్ళు ఎన్నో మంచి పనులు చేశారు.  ఎన్నో వీరగాధలు వాళ్ళ గురించి మేము విన్నాం అలాంటి వాళ్లకు పుట్టిన మీరు ఇలా చేస్తున్నారంటే వాళ్ళ కథలు అయినా  అబద్ధమై ఉండాలి లేదా మీరు వాళ్ళకి పుట్టి ఉండలేదేమో అని అంటాడు.  ఆ మాటకి దేవరికి బాగా కోపం వచ్చి మీ మాటలు జాగ్రత్త సార్ అని అంటాడు అప్పుడే కోస్టల్ గాడ్ కి తనకు ఒక కూతురు పుట్టిందని ఇన్ఫర్మేషన్ వస్తుంది. అప్పుడు కోస్టల్ గార్డ్ వాళ్ళందరి ముందే ఇలాంటి రాక్షసులు ఉన్న భూమి మీదకి మరొక ప్రాణం వచ్చినా కూడా వీళ్ళకి బలి అవ్వాల్సిందే అన్నట్టు మాట్లాడతాడు. ఆ మాటలకి దేవరా చాలా బాధపడతాడు కానీ బైరా మాత్రం ఓపిక పట్టలేక కోస్టల్ గార్డ్ మీద అటాక్ చేస్తాడు ఇక మిగిలిన వాళ్ళు కూడా కోస్టల్ గాడ్స్ అందరిని చంపడం స్టార్ట్ చేస్తారు. కానీ దేవరా  మాత్రం తన మనుషుల్ని కొడుతూ కోస్టల్ గాడ్స్ ని రక్షించాలని ట్రై చేస్తుంటాడు. బైరా అక్కడున్న మెయిన్ కోస్టల్ గార్డ్ ని చంపాలని చూడగా దేవర బైరా మెడ మీద కత్తి పెట్టడంతో ఇక బైరా ఆగిపోయి సరుకుతో ఒడ్డుకు బయలుదేరుతాడు. మా వల్ల ఇంకా ఏ అమాయక ప్రాణం కూడా పోదని దేవర ఆ కోస్టల్ గార్డ్ కి మాట ఇస్తాడు. 

 కట్ చేస్తే బైరా సరుకుతో మురుగా దగ్గరికి వస్తాడు అక్కడికి దేవర కూడా వచ్చి ఇంకొక్కసారి ఈ పని మాతో చేయించడానికి మీరు గాని కొండెక్కితే తిరిగి ప్రాణాలతో కొండ దిగి వెళ్లరని వార్నింగ్ ఇస్తాడు. కానీ కుంజర మాత్రం ఎవరు ఏం చెప్పినా సరే ఈ పని మాత్రం ఆగదని మురుగాతో అంటాడు. అప్పుడు దేవరకి కుంజర మీద కోపం వచ్చి కుంజరని కొట్టి వీపు మీద ఎక్స్ మార్క్ వేసి మన అవసరం కోసం చెడు పని అని తెలిసినా కూడా ఇది చేస్తున్నాం. అనుకున్నాకాని ఈ చెడు మనందరి రక్తంలో ఇంకిపోయింది ఇకపై అందరూ మారాల్సిందే అని సరుకు వున్న బాక్స్ లని లోయలోకి తోసేస్తాడు ఈ పని వదిలేసి అందరూ చేపలు పట్టి బతుకుదామని దేవర చెప్తాడు. కొంతమంది దానికి ఒప్పుకొని చేపల వేటకు వెళ్తారు కాని  బైరా మరియు కుంజర మనుషులు మాత్రం దేవర మాట వినకుండా సరుకు కోసం సముద్రంలోకి వెళ్తుండేవారు. అలా వెళ్ళిన ప్రతి ఒక్కడికి దేవర భయం అంటే ఏంటో చూపించేవాడు ఆ భయంతో ఎవరు సరుకు కోసం వెళ్ళాలని సాహసం కూడా చేసేవారు కాదు.  

కట్ చేస్తే కొంతకాలం గడిచిపోతుంది రాయప్పకి పద్మ అనే చెల్లి ఉంటుంది ఆమెకి కళ్ళు కనిపించవు ఆమెకి ఎలాగైనా సరే పెళ్లి చేయాలని రాయప్ప బాగా కష్టపడుతుంటాడు ఆ కష్టం చూడలేక పద్మ చనిపోవాలని సముద్రంలోకి వెళ్తుంది. కానీ పద్మని బైరా గమనించి తనని కాపాడి రాయప్ప దగ్గరికి తీసుకెళ్తాడు. తన చెల్లి చనిపోవాలని చూసిందని రాయప్పకు తెలిసి చాలా బాధపడతాడు. బైరా రాయప్పతో నీ ఇంట్లో కష్టం ఉందంటే అది నా కష్టం కూడా నీ చెల్లికి నా తమ్ముడితో పెళ్లి చేద్దామని అంటాడు ఆ మాటలకి రాయప్ప చాలా సంతోషపడి పెళ్లికి ఒప్పుకుంటాడ.  కానీ అసలు బైరా ప్లాన్ ఏంటంటే అదే పెళ్లికి దేవర కూడా వస్తాడు కాబట్టి దేవరని అక్కడ చంపేయాలని ఇలా పెళ్లి అనే పథకం వేస్తాడు. పద్మ  బైరా తమ్ముడి పెళ్లి కి దేవర కూడా వస్తాడు.  కుంజర అండ్ బైరా వాళ్ళు దేవరని మందు తాగేలా చేస్తారు.  దేవర భైరా తో నేను చేసిన పని మనందరి మంచి కోసమే అర్థం చేసుకో అని అంటాడు. దానికి బైరా నువ్వు ఉన్నంతవరకు ఈ కొండ మీద నీ మాటే చెల్లుతుంది దేవరా అని అంటాడు. మరోవైపు దేవరని చంపడానికి బైరా ప్లాన్ చేసి మనుషుల్ని తెప్పించాడని రాయప్పకు తెలిసి మన దేవర ఇలా చేయొద్దు నా ప్రాణం ఉన్నంతవరకు దేవరకి ఏమి  కానివ్వనని అంటాడు దానికి బైరా ఒకవేళ ఇప్పుడు నీ చెల్లి పెళ్లి ఆగిపోతే నీ చెల్లి బతుకుద్దా ఆలోచించు, నీ చెల్లి ప్రాణమా దేవర ప్రాణమా డిసైడ్ చేస్కో అని చెప్పి నువ్వే వెళ్లి దొంగతనానికి సముద్రంలోకి వెళ్తున్నారని దేవరకుచెప్పాలి అని అంటాడు.  ఆ మాట విన్న రాయప్పకి ఏం చేయాలో తెలియక చాలా బాధపడతాడు. రాయప్పకి అదంతా చేయడం ఇష్టం లేకపోయినా సరే తన చెల్లి కోసం వాళ్ళు చెప్పింది చేస్తాడు. సరుకు కోసం సముద్రంలోకి వెళ్తున్నారని రాయప్ప చెప్పడంతో తాగిన మైకంలో ఉన్న దేవర తీరానికి వెళ్తాడు. 

 అక్కడ సుమారు 50 మంది వరకు దేవర మీద అటాక్ చేయడానికి వస్తారు.  కానీ దేవర అందరినీ చంపేస్తాడు వాళ్ళతో పాటు కుంజరను కూడా చంపేస్తాడు తెల్లవారిన తర్వాత ఊరి వాళ్ళందరూ వెళ్లి గుట్టలు గుట్టలుగా పడి ఉన్న శవాలను చూసి బాగా భయపడిపోతారు.  అక్కడే ఉన్న రాయి మీద దేవర ఇలా రాసి ఉంటాడు దేవుడైనా దెయ్యమైనా మన కంటికి కనిపించదు కాబట్టి మనం వాటికి భయపడుతున్నాం నేను మీ మధ్యలోనే ఉండడం వల్ల మీరు నాకు సరిగ్గా భయపడట్లేదు ఇకపై నేను ఆ దేవుడి లాగే మీ కంటికి కనిపించకుండా ఉంటాను ఎవడైనా సరే భయాన్ని మరిచి సముద్రంలోనికి వస్తే అలా వచ్చిన ప్రతి ఒక్కడి ధైర్యాన్ని చంపేసే భయాన్ని అవుతా ఇకపై నేను సముద్రంలోనే ఉంటాను సముద్రానికి కావలిగా ఉంటానని రాసి పెడతాడు. ఇక అప్పటినుంచి దేవర ఊర్లోకి రాడు దేవరని ఊరికి రప్పించాలని బైరా చాలా ప్రయత్నం చేస్తాడు ఎన్నో పనులు చేస్తాడు కాని దేవర మాత్రం ఊర్లోకి రాడు. ప్రతి సంవత్సరం జరిగే ఆయుధ పూజలో భైరా కావాలని దేవర ఊరి వాళ్ళని చాలా దారుణంగా కొట్టేవాడు కనీసం దేవర ఆ ఉత్సవానికి వచ్చి తన ఊరి పరువైనా కాపాడుకుంటాడని బైరా అలా చేస్తుండేవాడు కానీ దేవర మాత్రం ఊర్లోకి అడుగు పెట్టేవాడే కాదు. 

 కట్ చేస్తే 12 సంవత్సరాలు గడిచిపోతాయి బైరా ఊర్లో ఉన్న 12 , 13 సంవత్సరాల పిల్లల్ని చేరదీసి భయమే తెలియని ఒక సైన్యంగా మారుస్తాడు వాళ్ళందరికీ దేవరని చంపేయాలనే కసిని నూరిపోస్తాడు.  కుంజర కొడుకు కూడా పెద్దవాడైపోయి ఎలాగైనా సరే దేవరని చంపాలనే కసితో ఉంటాడు ఊరు మారాలని దేవర వెళ్ళిపోయినప్పటి నుంచి ఏదో ఒక రోజు తిరిగి రాడా అని దేవర తల్లి, భార్య ఎదురు చూస్తూ ఉంటారు. ప్రస్తుతం దేవర భార్య డెలివరీ అయ్యి తనకు ఒక కూతురు కూడా పుట్టి ఉంటుంది వరా పెద్దవాడైపోయి ఉంటాడు. దేవర వస్తాడని ఎదురు చూస్తున్న తన ఫ్యామిలీ మెంబర్స్ ని వరా ఎప్పుడూ అరుస్తూనే ఉంటాడు. దేవర పంతం పట్టి బయటికి వెళ్ళిపోయాడు ఇంకా రాడు అతని కోసం ఎదురు చూడడం మానేయండి అని అరుస్తూనే ఉంటాడు. వరా చూడడానికి దేవర లాగే ఉన్నా కూడా దేవరకు ఉన్న ధైర్యం వరాకి వుండదు.  దేవర ఊరి నుండి వెళ్ళినప్పటి నుంచి పూర్వీకుల ఆయుధాలు బైరా ఊరిలోనే ఉంటాయి దేవర వెళ్ళిపోయిన తర్వాత బైరా ఆయుధ పూజ పోటీలో దేవర ఊరి వాళ్ళని దారుణంగా కొట్టి ఓడించడం చేస్తాడు. దేవర ఊరి వాళ్ళు కూడా ఆ పోటీలో పాల్గొనే ధైర్యం కూడా చేయలేకపోతారు. 

 కొన్ని సంవత్సరాల తర్వాత ఆ పోటీలో బైరాకి ఎదురు నిలబడేవాడు ఒక్కడు కూడా మిగలడు వరా ఊరి వాళ్ళందరూ కూడా ఆ ఆయుధాలు మన ఊరికి వస్తే బాగుండని అనుకుంటున్నారని వరాకి తెలుస్తుంది ఇక వరా రాయప్పతో కలిసి బైరా దగ్గరికి వెళ్లి ఈసారి ఆయుధాలు మా ఊరికి ఇవ్వండని బతిమిలాడుతాడు. అప్పుడు బైరా వరా తో సముద్ర తీరానికి వెళ్లి మన ఊర్లో మగాళ్ళు ఎవరూ లేరని గట్టిగా అరువు మీ నాన్న ఆ మాట విని పోటీలోకి వస్తాడని కోప్పడి వెళ్తాడు. తరువాత ఆయుధ పూజ ఉత్సవం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా పోటీ లేనట్టేనా అని అంటారు అప్పుడు వరా నేను పోటీలోకి దిగుతానని అంటాడు.  వరా  పిరికి వాడు కదా కాబట్టి పోటీలో గెలవాలంటే ఏదో ఒక ప్లాన్ వేయాలి కాబట్టి పోటీలో పాల్గొనే వాళ్ళు తాగే డ్రింక్ లో మత్తు మందు కలుపుతాడు ఆ మత్తు మందు వల్ల ప్రత్యర్థులు వీక్ అయిపోతారు. అప్పుడు వరా మిగిలిన ఊరి వాళ్ళందరినీ ఓడించేసి ఆయుధాలను తన ఊరికి తెచ్చుకుంటాడు. మరుసటి రోజు వరా మత్తు మందు కలిపి గెలిచాడని బైరా కి తెలిసి వరా ని ఏదో ఒకటి చేయాలని రాయప్పని పిలుస్తాడు . అప్పుడు రాయప్ప భైరా తో కేవలం మత్తు మందు కలపడం వల్లే వాళ్ళు ఓడిపోయారు అని అనుకుంటే పోటీలో దిగిన వాళ్ళు మరుసటి రోజు ఉదయానికి లేవాలి. కానీ ఒక్కడు కూడా మంచం మీద నుండి లేవలేదు నిన్న పోటీలో మీకు వరా లో ఉన్న పిరికితనం మాత్రమే కనిపించింది.  కానీ వాడిలో దేవరకు ఉన్నంత ధైర్యం ఉంది వాడు కొట్టిన దెబ్బల పవర్ వల్లే ఎవ్వడు కూడా ఇంకా మంచం మీద నుంచి లేవలేదు.  వాడికి వాడి బలం ఏంటో తెలియదు ఆల్రెడీ సముద్రం మీద ఒక దేవర ఉన్నాడు ఈ వరా ని పిరికి వాడిగానే ఉంచితేనే మీకు మంచిది.  వీడికి ఉన్న ధైర్యాన్ని గాని మీరు నిద్ర లేపితే ఊర్లో కూడా మరొక దేవర తయారవుతాడని రాయప్ప చెప్తాడు. 

 కట్ చేస్తే బైరా పెంచిన సైన్యం అందరూ కూడా ఎప్పుడెప్పుడు బైరా వాళ్ళని సముద్రంలోకి పంపుతాడా ఎప్పుడెప్పుడు దేవరని చంపేయాలా అని ఎదురు చూస్తూ ఉంటారు కానీ వాళ్ళలో ఒకడు బైరా తో ఈ విధంగా అంటాడు కోస్టల్ గార్డ్స్ మనోళ్ళకి మంచి జాబ్స్ మంచి జీతం ఇస్తామని అంటున్నారు. ఆ పనిలో గాని జాయిన్ అయితే అసలు సముద్రంలోకి వెళ్లే పనే ఉండదు దేవరకు అసలు మనం ఎదురయ్యే సమస్య ఉండదని అంటాడు అప్పుడు బైరా ఇంతకాలం మిమ్మల్ని సైన్యంగా పెంచింది ఇంత వాళ్ళని చేసింది పనికి వెళ్ళడానికా దేవర కోసం అని చెప్పి వీడిలో ఏంటి దేవర బుద్ధి కనిపిస్తుందని బైరా మిగిలిన వాళ్ళందరితో అంటాడు ఇక వాళ్ళందరూ కూడా జాబ్స్ గురించి మాట్లాడిన వాడిని చంపేస్తారు.  బైరా మురుగా ని పిలిచి సరుకు కోసం వెళ్తాం నా మనుషులు సిద్ధంగా ఉన్నారని అంటాడు.  అప్పుడు మురుగా మరి దేవర సంగతి ఏంటి దేవర ఉన్నంతవరకు కూడా నేను రిస్క్ చేసి నా సరుకును పోగొట్టుకోలేను. ముందు దేవరని చంపి ఆ తర్వాత నన్ను పిలువమని  అంటాడు దీంతో దేవరని ఎలాగైనా బయటికి రప్పించాలని బైరా అసలు దేవరనే లేడు దేవర చనిపోయాడు అనే పుకార్లు పుట్టిస్తాడు.  నాలుగు ఊర్ల  ప్రజలు కూడా అదే నమ్ముతారు.  అదే మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళు అలా మాట్లాడుకోవడం దేవర తల్లి విని దిగులతో మంచం పడుతుంది. ఖచ్చితంగా  తన తల్లి ని చూడడానికి దేవర వస్తాడని అలా వచ్చిన దేవరని చంపేయాలని బైరా ప్లాన్ చేసి మూడు రోజులుగా అక్కడే ఎదురు చూస్తుంటాడు. 

కట్ చేస్తే ఒక రాత్రి దేవర వచ్చి తన అమ్మని కలుస్తాడు ఇక బైరా తన మనుషులతో దేవరని పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ దేవర మాత్రం వాళ్ళని కొట్టి తప్పించుకొని పారిపోతాడు దేవర తప్పించుకున్నాడని  బైరా చాలా డిసప్పాయింట్ అవుతాడు.  మురుగా అలాగే  డిఎస్పి తులసి,  బైరా దగ్గరికి వచ్చి ఎదురు తిరిగి చంపేసే దేవర నీ నుండి తప్పించుకొని పారిపోయాడు అంటే దేవరలో ఉన్న పవర్ తగ్గిపోయింది. సముద్రంలోకి వెళ్లి సరుకు తీసుకొని రండి అడ్డు వస్తే దేవర ని కూడా చంపేయండి అని అంటారు.  చాలా ఏళ్ల తర్వాత ఇక సముద్రంలోకి వెళ్ళబోతున్నామని అందరూ రెడీ అవుతుంటారు కానీ ఎవరో భైరా చెయ్యిని విరిచేస్తారు.  కానీ అలా విరిచేసింది ఎవరో కాదు కుంజర కొడుకే అని భైరాకి తెలుస్తుంది భైరా వాడిని పట్టుకొని ఎందుకురా ఇలా చేసావ్ నేను నిన్ను కన్న కొడుకు కంటే ఎక్కువగా చూసుకుంటున్నాను కదా అని అంటాడు.  అప్పుడు కుంజర కొడుకు భైరాతో ఈ విధంగా అంటాడు మా నాన్నని చంపినప్పటి నుంచి దేవరని చంపాలనే నేను కసితోటి పెరుగుతున్నాను. నువ్వు మాతో సముద్రంలోకి వస్తే దేవర చావు నీకు దక్కుతుంది అందుకే నేను ఇలా చేశాను ఈ ఒక్కసారి నాకు అవకాశాన్ని ఇవ్వు మా అందరి దగ్గర గన్స్ ఉన్నాయి ఎలాగైనా దేవరని చంపి వస్తామని అంటాడు.  అది విన్న బైరా కూడా కూల్ అవుతాడు. 

 కట్ చేస్తే దేవర కూతురు అడవిలోకి గోరింటాకు కోసం వెళ్లి వస్తుంటుంది అప్పుడు భైరా మనుషులు ఆమెను ఆపి మీ నాన్నని మేము చంపేస్తాం నిన్ను మీ అమ్మని మేము వాడుకుంటాం మీ అన్న ఉన్నా కూడా వాడు ఏం చేయలేడని చాలా హేళనగా మాట్లాడతారు. దేవర కూతురు ఏడ్చుకుంటూ వెళ్లి ఆ విషయాన్ని వాళ్ళ అమ్మతో చెప్తుంది ఆ మాటల్ని విన్న వరా చాలా బాధపడతాడు ఇంట్లో కనీసం  ఒక మగాన్ని నేను ఉన్నాను అని  నాతో చెప్పుకుంటే నేను ఏదైనా చేస్తాననే నమ్మకం కూడా వీళ్ళకి లేదా అని వరా చాలా బాధపడతాడు.  ఇక వరా తన చెల్లిని ఏడిపించిన వాళ్ళ దగ్గరికి వెళ్లి మందు తాగి వాళ్ళందరినీ బాగా కొడతాడు. మరుసటి రోజు పొద్దున సింగప్ప వరాని పిలిచి రాత్రి నువ్వు కొట్టిన వాళ్ళలో ఒకడు చనిపోయాడు అని చెప్తాడు.  వరా ఊరి వాళ్ళు భైరా  వాళ్ళు నిన్ను కొట్టడానికి వస్తే మేమంతా నీ వెనకే ఉంటామని అంటారు కానీ వరాకి మాత్రం బాగా భయం వేసి నేనేదో తాగిన మైకల్లో కొట్టాను నాకు ఈ గొడవలు అవేమి వద్దు నేను వెళ్లి భైరా ని బతిమిలాడుకుంటానని చెప్పి వరా భైరా దగ్గరికి వెళ్లి నేను మీ వాడిని కావాలని చంపానంటే మీరు నమ్ముతారా పోటీలో కూడా గెలవలేక మత్తు మంది కలిపి అందరితోటి పోటీ చేసి నేను గెలిచాను నేను దేవరా కొడుకునే అయి ఉండొచ్చు కానీ నేను మీ వైపే ఉంటున్నాను నేను మీ వాడినే అని నువ్వే అందరికీ చెప్పు బైరా అని బతిమిలాడుతాడు.  అప్పుడు బైరా సరే మనోళ్ళందరూ సరుకు కోసం సముద్రంలోకి వెళ్తున్నారు వాళ్ళతో నువ్వు కూడా వెళ్ళు అప్పుడే నువ్వు మాలో ఒకడిగా క్షేమంగా ఉంటావని అంటాడు.  ఇక వరా ఆలోచనలో పడిపోతాడు నిజానికి వరా కొట్టినప్పుడు ఎవరు చావరు బైరానే ఒకరిని చంపి వరాని భయపడేలా చేసి వరా తన దగ్గరికి వచ్చేలా చేస్తాడు. 

 ఎందుకంటే తన మనుషులతో పాటు వరా కూడా సముద్రంలోకి వెళ్తే వరాని చూసిన దేవర ఒక్క క్షణమైనా సరే ఏమరపాటుకి గురవుతాడు ఆ టైం లో దేవరని వాళ్ళు చంపేయొచ్చని ప్లాన్ చేస్తాడు బైరా అనుకున్నట్టుగానే వరా కూడా సముద్రంలోకి వెళ్తాడు.  సరుకు దొంగలించి అందరూ తిరిగి వచ్చేటప్పుడు ఒకచోట ఎందుకో వాళ్ళకి అనుమానం వచ్చి పడవలు అన్ని ఆపేసి దేవర నీటిలో నుంచి వస్తున్నాడేమో అని గన్స్ తో షూట్ చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఆ నీళ్లలో నుంచి ఒక సొరచేప బయటకు దూకుతుంది.  వచ్చింది దేవర కాదని వాళ్ళకి అర్థమవుతుంది అదే టైం లో వరా ఉన్న బోట్ లో మంటలు రావడంతో ఆ ఆ బోట్ లో వాళ్ళు నీళ్ళ లోకి  దూకుతారు ఇక వెంటనే దేవర ఆ నీళ్ళలో పడిన వాళ్ళని గాయపరుస్తూ వాళ్ళ వీపు మీద ఎక్స్ మార్క్ వేస్తుంటాడు. వరా సముద్రంలోకి వెళ్ళాడని దేవర భార్య కి తెలిసి ఆమె సింగప్ప దగ్గరికి వెళ్లి బైరా మాటలు విని వరా కూడా సముద్రంలోనికి వెళ్ళాడు. వాడికి ఏమైనా జరుగుతుందేమో అని చాలా భయంగా ఉంది తప్పు చేస్తే కొడుకైనా సరే దేవర వదలడని మీకు తెలుసు కదా ఎలాగైనా వాడిని కాపాడండి అని సింగప్పని అడుగుతుంది. 

 కానీ సింగప్ప అతని మనుషులు మాత్రం సైలెంట్ గా ఉంటారు అప్పుడు ఆమె ఏంటి మీరు కూడా భైరా  తో కలిసిపోయి తప్పుడు పనులు చేస్తున్నారా ఎందుకు సైలెంట్ గా ఉన్నారు ఒకవేళ మీరు కూడా భైరా తో కలిసి తప్పుడు పనులు చేస్తుంటే దేవర మిమ్మల్ని కూడా వదలడని అంటుంది. అప్పుడు సింగప్ప నీ భర్త దేవర చనిపోయి చాలా కాలం అయిందమ్మా ఇన్ని సంవత్సరాలు సముద్రం మీద దేవరగా ఉన్నది నీ కొడుకు వరానే అని నిజం చెప్తాడు. మరోవైపు వర దేవర లాగా అందరినీ అటాక్ చేస్తూ వాళ్ళ వీపుల మీద ఎక్స్ మార్క్స్ వేస్తాడు ఆ తర్వాత వాళ్ళందరినీ బోట్లో వేసుకొని ఒడ్డుకు లాక్కొస్తాడు వాళ్ళలో ఎవ్వరూ కూడా స్పృహలో ఉండరు అదే సమయంలో సింగప్ప అక్కడికి తన మనుషులతో వస్తాడు అప్పుడు వరా సింగప్పతో ఒకప్పుడు మా నాన్న చంపిన శవాలను చూసి ఒక తరం మొత్తం మారింది ఇప్పుడు ఈపడవని చూసి మరో తరం మారదా అని అంటాడు. 

వీళ్ళందరితో పాటు నేను కూడా సముద్రంలోనికి వెళ్ళాను సముద్రంలోకి వెళ్ళింది కన్న కొడుకైనా సరే దేవర ఎవరిని వదలడనే భయం నిలవాలంటే నా వీపు మీద కూడా ఎక్స్ మార్క్ వెయ్యి అని వరా సింగప్పకి కత్తి ఇస్తాడు కానీ నేను మాత్రం నీ ఒంట్లోకి కత్తి దించలేనురా అని సింగప్ప పక్కకు వెళ్ళిపోతాడు ఊరి మంచి కోసం నా ఒంట్లో కత్తి దిగినా సరే నాకు ఇష్టమేనని దేవర కత్తిని బోట్ నుండి బయటకు వచ్చేలా గుచ్చి తన వీపు మీద ఎక్స్ మార్క్ వేసుకొని కింద పడిపోతాడు ఈ కథ అంతా సింగప్ప శివ కి చెప్తాడు.  అప్పుడు శివ సింగప్పని అసలు దేవరని చంపే మగాడు ఎవడు అసలు దేవరని చంపింది ఎవరని అడుగుతాడు. దేవర బీచ్ లో కుంజరని మిగిలిన వాళ్ళందరినీ కూడా చంపేస్తాడు అప్పుడు చిన్న పిల్లాడిగా ఉన్న వరానే దేవరని పొడిచి చంపేస్తాడు అసలు వరా దేవరని ఎందుకు చంపాడు అనేదే సస్పెన్స్ అండ్ ఇంతకుముందు దేవర వాళ్ళ అమ్మని కలవడానికి వచ్చాడని చెప్పాను కదా అప్పుడు వరానే దేవర లాగా రెడీ అయ్యి వాళ్ళ అమ్మని చూడడానికి వస్తాడు శివ వెతుక్కుంటూ వచ్చిన ఆ దయ యతి ఎవరు మురుగా ని చంపింది ఎవరు? మురుగా అసలు ఎలా చనిపోయాడు సముద్ర గర్భం లో ఉన్న అస్తిపంజరాలన్నీ ఎవరివి, వాళ్ళు ఎలా చనిపోయారు వరా తన తండ్రి దేవరని చంపడానికి గల కారణాలు ఏంటనేవి మనకు సెకండ్ పార్ట్ లోనే తెలుస్తాయి. 

                                                                                                     :::::శుభం :::::

FOR MORE MOVIE STORIES WEBSERIES STORIES Please visit our Website: Filmywebstories.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

en_USEnglish
Scroll to Top