THE GREATEST OF ALL TIME (ది గోట్ ) Full Movie Explanation

Goat

హాయ్ ఫ్రెండ్స్ Welcome to www.FilmyWebstories.com సెప్టెంబర్ 5th  2024 లో రిలీజ్ అయినటువంటి ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ (THE GOAT) అనే  Action Drama Thriller మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం.

మూవీ స్టార్ట్ అవ్వగానే  ఉమర్ అనే ఒక టెర్రరిస్ట్ తన దగ్గర ఉన్న యురేనియం ఒరిజినలో కాదో చెక్ చేయించేందుకు ఒక సైంటిస్ట్ ని రప్పిస్తాడు. ఆ సైంటిస్ట్ ఉమర్ దగ్గర ఉన్న యురేనియం ని చెక్ చేసి నీ దగ్గర ఉన్నది ఫేక్ యురేనియం అని చెప్తాడు ఆ టైం లో అక్కడికి మేనన్   అనే వ్యక్తి వచ్చి నీ దగ్గర ఉన్న యురేనియం ఒరిజినలే కానీ ఈ సైంటిస్టే ఫేక్.  వీడి పేరు గాంధీ (Thalapathi Vijay)  అని అంటాడు నిజానికి గాంధీ కెప్టెన్ ప్రభాకర్ (old Hero) లాగా మాస్క్ వేసుకొని తన టీం మేట్స్ అయిన కళ్యాణ్ సునీల్ అజయ్ తో కలిసి ఉమర్ ని పట్టుకునేందుకు సైంటిస్ట్ లాగా వేషం వేసుకొని అక్కడికి వస్తాడు. వీళ్ళందరూ స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ లో ఉంటారు. ఈ స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ క్వాడ్ కి ఈ మేననే చీఫ్ అయితే మేనన్ పై ఆరోపణలు రావడంతో తనపై దేశద్రోహిగా ముద్ర వేసి తన కోసం దేశమంతా గాలిస్తుంటారు ఉమర్ ని చంపడానికి ట్రైన్ లోకి వచ్చిన గాంధీకి అక్కడ అనుకోకుండా ఇప్పుడు మేనన్ కూడా కనిపిస్తాడు. ఇక గాంధీ తన మాస్క్ తీసేసి ఉమర్ మనుషులతో ఫైట్ చేస్తాడు ఒక పక్క సునీల్ (Prashanth) అండ్ అజయ్ (Ajmal Ameer) బయట నుంచి ఫైరింగ్ జరుపుతూ ఉమర్ మనుషులపై దాడి చేస్తుంటారు మరో పక్క కళ్యాణ్ (Prabhu Deva) ఒక వెహికల్ ని నడుపుతూ కొన్ని టైం బాంబ్స్ ని ట్రైన్  కంపార్ట్మెంట్స్ కి స్టిక్ చేస్తాడు. ఉమర్ మనుషులతో ఫైట్ చేసిన తర్వాత ఇక గాంధీ మేనన్ ను  పట్టుకునేందుకు ట్రై చేస్తాడు. అయితే ట్రైన్ కంపార్ట్మెంట్స్ కి స్టిక్ చేసిన టైం బాంబ్స్ ఒక పక్క బ్లాస్ట్ అవుతూ ఉంటాయి అప్పుడు కళ్యాణ్ గాంధీతో మనకు ఎక్కువ టైం లేదు మనం వెంటనే ట్రైన్ లో నుంచి బయట పడాలని అంటాడు దాంతో గాంధీ వెంటనే యురేనియం ని తీసుకొని మేనన్నిట్రైన్ లోనే వదిలేసి బయటకు సేఫ్ గా వచ్చేస్తాడు. 

ILAYA THALAPATHY VIJAY

 గాంధీ బయటకు వచ్చిన వెంటనే ట్రైన్ అంతా పూర్తిగా బ్లాస్ట్ అయిపోతుంది కట్ చేస్తే ఢిల్లీలో సీన్ ఓపెన్ అవుతుంది గాంధీ భార్య పేరు అను (Sneha)  తను ప్రస్తుతం ప్రెగ్నెన్సీ తో ఉంటుంది. గాంధీకి ఒక కొడుకు కూడా ఉంటాడు వాడి పేరు జీవన్ గాంధీ ఒక సీక్రెట్ ఏజెంట్ అన్న విషయం అను కి తెలియదు. గాంధీ గురించి మాత్రమే కాదు గాంధీ టీం మేట్స్ అయిన కళ్యాణ్ అజయ్ సునీల్ వీళ్ళందరూ కూడా సీక్రెట్ ఏజెంట్స్ అన్న విషయం తమ తమ ఫ్యామిలీ మెంబర్స్ కి ఎవరికీ తెలియదు. వీరంతా ఇండియన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లో జాబ్ మాత్రమే చేస్తున్నారని అందరూ అనుకుంటారు. స్పెషల్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ కి నజీర్ బాస్ గా ఉంటాడు నజీర్ గాంధీ టీం తో ఉమర్ ని చంపేసి యురేనియం ని తీసుకొని రమ్మంటే మొత్తం ట్రైన్ నే పేల్చేసి వచ్చార. ఆ బ్లాస్ట్ కి కారణం మనమే అని కెన్యా గవర్నమెంట్ కి తెలిస్తే ఎలా అని అంటాడు. అయితే నజీర్ మాటల్ని వాళ్ళు అంతగా పట్టించుకోకుండా మాకు ఆ ట్రైన్ లో మేనన్ కూడా కనిపించాడు. తనే ఉమర్ కి ఈ యురేనియం డీల్ లో సహాయం చేసి ఉండొచ్చని చెప్తార. అప్పుడు కళ్యాణ్ నజీర్ తో ట్రైన్ బ్లాస్ట్ లో ఉమర్ అండ్ ఉమర్ మనుషులతో సహా మేనన్ కూడా చనిపోయాడని చెప్పి కెన్యా గవర్నమెంట్ రిలీజ్ చేసిన అఫీషియల్ రిపోర్ట్ ని నజీర్ కి చూపిస్తాడు. ఇక చనిపోయిన వాళ్ళ మీద ఏం ఇన్వెస్టిగేషన్ చేద్దాంలే ఎలాగో యురేనియం ని తీసుకొచ్చాం కదా అని వాళ్ళు ఆ టాపిక్ ని అక్కడితో క్లోజ్ చేసేస్తారు. 

 నజీర్ గాంధీ తో తరువాత  మిషన్ లో భాగంగా నువ్వు థాయిలాండ్ కి వెళ్లాల్సి ఉంటుందని అంటాడు అందుకు గాంధీ కూడా ఓకే చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో అను చెక్ అప్ కోసమని డాక్టర్ రాధికా దగ్గరికి వెళ్తుంది. ఈ రాధికా ఎవరంటే గాంధీ ఫ్రెండ్ అయిన సునీల్ యొక్క భార్య ఈ రాధిక గాంధీ సునీల్ అజయ్ కళ్యాణ్ నజీర్ వీళ్ళు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా చాలా క్లోజ్ గా ఫ్రెండ్లీ గా ఉంటుంటారు గాంధీ అనుని అండ్ జీవన్ ని కూడా తనతో పాటు థాయిలాండ్ కి తీసుకెళ్లాలని అనుకుంటాడు. గాంధీ అను తో మనం ముగ్గురం అలా జాలీగా థాయిలాండ్ కి వెకేషన్ కి వెళ్లి వచేద్దామని చెప్తాడు అందుకు అను కూడా హ్యాపీగా ఒప్పుకుంటుంది ఈ విషయం తెలిసి కళ్యాణ్ అండ్ సునీల్ గాంధీని పక్కకు తీసుకెళ్లి మిషన్ మీద వెళ్తూ ఫ్యామిలీని థాయిలాండ్ కి తీసుకెళ్లడం అవసరమా వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని అంటారు అప్పుడు గాంధీ కడుపుతో ఉన్న అనుని ఒంటరిగా వదిలేసి నేనెలా వేరే కంట్రీకి వెళ్ళగలను అని చెప్తాడు.  

కట్ చేస్తే థాయిలాండ్ లో  గాంధీ తన ఫ్యామిలీ తో ఫుల్ గా ఎంజాయ్ చేస్తూ ఉంటాడు డే అంతా ఫ్యామిలీ తో గడిపిన తర్వాత రాత్రి సమయంలో మిషన్ మొదలవుతుంది యాక్సెస్ కార్డ్ పబ్ లో ఉన్న ఒక అమ్మాయి దగ్గర ఉందని నజీర్ చెప్పడంతో గాంధీ అండ్ కళ్యాణ్ పబ్ లోకి ఎంటర్ అవుతారు ఇక వాళ్ళిద్దరూ ఆ అమ్మాయిని ఫైండ్ అవుట్ చేసి తన దగ్గరికి వెళ్తారు గాంధీ తెలివిగా ఆ అమ్మాయితో మాట్లాడుతూ తనకి తెలియకుండా తన దగ్గర ఉన్న యాక్సెస్ కార్డు ని తీసేసుకుంటాడు ఇక గాంధీ సీక్రెట్ రూమ్ దగ్గరికి వెళ్లి అక్కడున్న సెక్యూరిటీ అందరినీ కొట్టేసి సర్వర్ ని ఓపెన్ చేస్తాడు సర్వర్ ఓపెన్ అవ్వడం తో నజీర్ వెంటనే తన లాప్టాప్ లో ఆ సర్వర్ కి కనెక్ట్ అవుతాడు దాంతో వచ్చిన పని కంప్లీట్ అవుతుంది అయితే ఈ లోపే రిమైనింగ్ సెక్యూరిటీ అందరూ కూడా గాంధీ ఉన్న రూమ్ దగ్గరికి వచ్చేసి అంతా చుట్టుముడతారు అప్పుడు గాంధీ తెలివిగా పక్కనున్న పారాచూట్ బ్యాగ్ ని తగిలించుకొని అద్దాలని పగలగొట్టుకుంటూ బిల్డింగ్ లో నుంచి బయటకు దూకేసి సేఫ్ గా కిందకి ల్యాండ్ అవుతాడు. 

 మిషన్ కంప్లీట్ అవ్వడంతో మరుసటి రోజు ఉదయం గాంధీ తన ఫ్యామిలీ తో ఇండియా కి వచ్చేందుకు క్యాబ్ లోకి ఎక్కుతాడు అది గమనించిన కొంతమంది విలన్స్ గాంధీని కార్ లో ఫాలో అవుతారు విలన్స్ నుండి తప్పించుకునేందుకు గాంధీ చాలా ప్రయత్నిస్తాడు. కానీ తను ఎంతకో వాళ్ళ నుంచి బయట పడలేకపోతుంటాడు ఇలా కాదని గాంధీ అనుని జీవన్ ని సేఫ్ గా ఒకచోట దాచిపెట్టి తను వెళ్లి విలన్స్ ని చిత్తు చిత్తుగా కొడతాడు అయితే అదే సమయంలో అను కి బర్త్ పెయిన్స్ మొదలవుతాయి అప్పుడు అక్కడికి కళ్యాణ్ వచ్చి రిమైనింగ్ విలన్స్ తో ఫైట్ చేస్తుండగా గాంధీ వెంటనే అనుని ఆంబులెన్స్  లో హాస్పిటల్ కి తీసుకెళ్తాడు అను ఏడుస్తూ అసలు వీళ్ళంతా ఎవరు మనల్ని ఎందుకు చంపాలని చూస్తున్నారు జీవన్ కి ఏమైనా జరిగి ఉండుంటే మన పరిస్థితి ఎలా అని అంటుంది అప్పుడు ఇక గాంధీ తను ఒక సీక్రెట్ ఏజెంట్ అన్న నిజాన్ని అనుకు చెప్పేస్తాడు. 

ILAYA DALAPATHY VIJAY MASS ACTION-THRILLER MOVIE

ఇక డాక్టర్స్ అనుని ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్తారు పేపర్స్ పై సైన్ చేయాలని నర్స్ పిలవడంతో గాంధీ జీవన్ ని పక్కన కుర్చీలో కూర్చోబెట్టి తను కిందకి వెళ్తాడు అయితే తను పేపర్స్ పై సైన్ చేసి తిరిగి వచ్చి చూడగా అక్కడ జీవన్ ఉండడు ఇక కొడుకు కనిపించకపోవడంతో గాంధీ ఒక్కసారిగా భయపడిపోయి ఆ హాస్పిటల్ అంతా జీవన్ కోసం వెతుకుతాడు కానీ తనకు జీవన్ ఎక్కడా కనిపించడు. గాంధీ వెంటనే పోలీసుల దగ్గరికి వెళ్లి విషయం చెప్తాడు సునీల్ అండ్ కళ్యాణ్ గాంధీ దగ్గరికి రాగా జీవన్ కనిపించట్లేదు అని గాంధీ వాళ్ళతో అంటాడు పోలీసులు సిసి టీవీ ఫుటేజ్ చెక్ చేయగా జీవన్ ని ఒక ఆవిడ హాస్పిటల్ నుంచి బయటకు తీసుకెళ్లి ఒక వ్యాన్ లో తనని ఎక్కించుకొని వెళ్ళిపోయినట్టుగా రికార్డు అయి ఉంటుంది. వాళ్ళు అలా సిసి టీవీ ఫుటేజ్ ని చెక్ చేస్తుండగా సరిగ్గా అప్పుడే ఒక పోలీస్ కి యాక్సిడెంట్ గురించి విషయం చెబుతూ కాల్ వస్తుంది. ఇక గాంధీ కళ్యాణ్ సునీల్ పోలీసులతో కలిసి యాక్సిడెంట్ అయిన ప్లేస్ కి వెళ్తారు తీరా చూస్తే అక్కడ యాక్సిడెంట్ కి గురైన వ్యాన్ అండ్ సిసి టీవీ ఫుటేజ్ లో రికార్డు అయిన వ్యాన్ రెండు ఒకటే ఆ యాక్సిడెంట్ లో ఒక చిన్న పిల్లాడు కూడా పూర్తిగా కాలిపోయి చనిపోయి ఉంటాడు. 

 జీవన్ దగ్గర ఉండే బ్యాగ్ అండ్ టాయ్ ఆ చనిపోయిన పిల్లాడి దగ్గర కూడా ఉండడంతో చనిపోయింది జీవనే అని అర్థం చేసుకుని గాంధీ గుండె పగిలేలా ఏడుస్తాడు నెక్స్ట్ సీన్ లో గాంధీ వణికి పోతూ హాస్పిటల్ లో ఉన్న అను దగ్గరికి వస్తాడు అప్పుడు అను గాంధీతో నేను నువ్వు ఏం చేసినా కూడా ఒప్పుకుంటాను కదా మరి నువ్వు ఏజెంట్ అన్న విషయం నా దగ్గర ఎందుకు దాచావు నువ్వు అండ్ జీవన్ కోరుకున్నట్టుగానే మనకు ఒక అమ్మాయి పుట్టింది ఇకనైనా నువ్వు ఏ విషయం నా దగ్గర దాచొద్దని అను అంటుంది. అయితే గాంధీకి తనకి అమ్మాయి పుట్టిందని సంతోష పడాలో లేక తన కొడుకు చనిపోయాడని బాధపడాలో ఏమీ అర్థం కాక నన్ను క్షమించు అని అనుతో అంటూ బాగా ఏడుస్తుంటాడు. అసలు ఏం జరిగిందో తెలియక అను బాగా టెన్షన్ పడుతూ గాంధీ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావ్ అసలు జీవన్ ఎక్కడున్నాడని అడుగుతుంది. 

A VENKAT PRABHU HERO

 కట్ చేస్తే 16 సంవత్సరాల తర్వాత చెన్నైలో సీన్ ఓపెన్ అవుతుంది. ప్రస్తుతం అను అండ్ గాంధీ సెపరేట్ సపరేట్ గా ఉంటూ వేరే వేరే ఇళ్లల్లో నివసిస్తుంటారు అండ్ గాంధీ స్క్వాడ్ నుంచి బయటకు వచ్చేసి చెన్నై ఎయిర్పోర్ట్ లో జాబ్ చేస్తుంటాడు. గాంధీ అను మధ్య ప్రస్తుతం మాటలు ఉండవు కానీ గాంధీ స్క్వాడ్ నుంచి బయటకు రావడంతో జీవితకి గాంధీ డ్రైవర్ గా ఉండేందుకు అను ఒప్పుకుంటుంది. ఇక్కడ జీవిత అంటే అను గాంధీల కూతురు జీవిత ఎక్కడికి వెళ్ళాలన్న సరే గాంధీనే తనని కార్లో డ్రాప్ చేస్తూ పికప్ చేసుకుంటూ ఉంటాడ.  సునీల్ రాధికలకు కూడా ఒక కూతురు ఉంటుంది తన పేరు శ్రీనిధి (Meenakshi Chowdary).  శ్రీనిధి 21st బర్త్ డే సెలబ్రేషన్స్ కి సునీల్ తన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరిని ఇన్వైట్ చేస్తాడు అలా గాంధీ నజీర్ కళ్యాణ్ అజయ్ కూడా తమ ఫ్యామిలీస్ తో కలిసి పార్టీకి వెళ్తారు. అను గాంధీ ఇప్పుడు విడివిడిగా ఉంటున్నారని నజీర్ కి తెలిసి అసలు మీరు ఇలా ఎందుకు చేస్తున్నారు జీవన్ చనిపోవడంలో ఎవరి తప్పు లేదు కదా నేను వెళ్లి అను తో మాట్లాడనా అని అంటాడు. అప్పుడు గాంధీ వద్దు సార్ మా కొడుకుని కాపాడుకోలేకపోయామనే గిల్టీ ఫీలింగ్ తో మాకై మేము వేసుకున్న శిక్ష ఇదని నజీర్ తో చెప్తాడు. అప్పుడే కళ్యాణ్ ఒక విషయాన్ని వాళ్ళందరితో చెప్తాడు మాస్కోలో ఇండియన్ ఎంబసీ రీ ఓపెన్ చేయాలని అందరూ డిసైడ్ అయ్యారు .  

అయితే ఇండియన్ మినిస్టర్ అక్కడ కాస్త రాంగ్ గా మాట్లాడడంతో అక్కడ విషయం బాగా సెన్సిటివ్  మారింది దాంతో మాస్కో లోని ఒక గ్రూప్ ఇండియన్ ఎంబసీ ని ఓపెన్ చేయనీయకుండా బాగా ప్రొటెస్ట్ చేస్తున్నారు. నువ్వు ఒక వారం మాస్కో కి వెళ్లి అక్కడున్న ఇమిగ్రేషన్ ఆఫీసర్స్ తో కాస్త మాట్లాడి ప్రాబ్లం ని సాల్వ్ చేయొచ్చు కదా అని గాంధీ తో అంటాడు. నజీర్ గాంధీ తో నువ్వు ఒకసారి అక్కడికి వెళ్లి రావచ్చు కదా అని అడగడంతో ఇక గాంధీ మాస్కో కి వెళ్ళేందుకు ఒప్పుకుంటాడు. 

 కట్ చేస్తే గాంధీ మాస్కో లో ఇండియన్ ఎంబసీ కి చేరుకుంటాడు అయితే అప్పటికే నిరసన జ్వాలలు ఎక్కువ అవ్వడంతో నిరసన వ్యక్తం చేస్తున్న ఒక గ్రూప్ ఎంబసీ పైకి దాడికి దిగి అందరిపై అటాక్ చేస్తుంటారు. గాంధీ కూడా ఇక చూస్తూ ఉండలేక ఎంబసీ పై దాడి చేస్తున్న వ్యక్తుల్ని అడ్డుకుంటుంటాడు. అలా గాంధీ అబ్దుల్ అనే ఒకరిని పట్టుకొని కొట్టబోతుండగా ఒక పర్సన్ అక్కడికి సడన్ గా వచ్చి గాంధీకి అడ్డుపడతాడ. ఆ పర్సన్ చూడ్డానికి సేమ్ తనలాగే ఉండడంతో గాంధీ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. నిరసనకారులని అడ్డుకోవడానికి పోలీసులు కూడా ఎంబసీ కి రావడంతో అబ్దుల్ వెంటనే సంజయ్ ని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు. అయితే చూడ్డానికి తనలాగే ఉన్న పర్సన్ ని చూసినప్పటి నుంచి గాంధీకి జీవనే గుర్తొస్తుంటాడ. ఎంబసీ పై అటాక్ జరిగిందని విషయం తెలియగానే సునీల్ కూడా ఇండియా నుంచి బయలుదేరి మాస్కో కి వచ్చేసి గాంధీని మీట్ అవుతాడు అప్పుడు గాంధీ తనలాగే ఉన్న వ్యక్తి గురించి సునీల్ కి చెప్పడంతో సరే మనం రేపు ఉదయం ఆ గ్యాంగ్ ని కనిపెట్టి నీలా ఉన్న వ్యక్తి గురించి డీటెయిల్స్ కనుక్కుందామని సునీల్ అంటాడు. 

మరుసటి రోజు ఉదయం గాంధీ కార్లోకి ఎక్కుతుండగా గాంధీకి మళ్ళీ తనలాగా ఉన్న వ్యక్తి కనిపిస్తాడు ఇక గాంధీ సంజయ్ ని ఫాలో అవుతూ వెళ్ళగా సంజయ్ యొక్క బ్రిడ్జ్ దగ్గర ఆగి నువ్వు మా నాన్నవే కదా అని గాంధీతో అంటాడు. అది విన్న గాంధీ ఒక్కసారిగా ఏడుస్తూ జీవన్ కాళ్ళని పట్టుకొని జీవన్ నువ్వు బతికే ఉన్నావా నువ్వు చనిపోయావని మేమంతా అనుకున్నాం నువ్వు బతికే ఉండొచ్చని మేము ఒక్కసారి కూడా ఆలోచించలేదు నన్ను క్షమించు అని ఏడుస్తాడు. అయినా నువ్వు ఇక్కడ ఎలా అని గాంధీ అనగా ఎక్కడెక్కడో ఉన్నాను చివరికి ఇక్కడికి వచ్చి చేరానని అని జీవన్ అంటాడు సరే ఎలా అయితేనే మనం మళ్ళీ కలుసుకున్నాం. ఇక మనం ఇంటికి వెళ్ళిపోదామని గాంధీ అంటాడు అప్పుడు జీవన్ మీరు డేంజర్ లో ఉన్నారు నాన్న ఫాజిల్ గ్యాంగ్ చాలా డేంజర్. వాళ్ళు నన్ను మీతో రానివ్వరు అని జీవన్ చెప్తాడు కానీ గాంధీ మాత్రం తన కొడుకుని ఎలాగైనా సరే తనతో పాటు ఇంటికి తీసుకెళ్లాలని డిసైడ్ అవుతాడు సరిగ్గా అప్పుడే ఫాజిల్ గ్యాంగ్ గన్స్ తో గాంధీ పై అటాక్ చేస్తూ బైక్స్ పై వస్తుంటారు ఇక గాంధీ కూడా వెంటనే జీవన్ ని ఒక బైక్ పై ఎక్కించుకొని ఫాజిల్ గ్యాంగ్ నుంచి తప్పించుకుంటూ వాళ్ళపై గన్స్ తో అటాక్ చేస్తుంటాడు. గాంధీ సునీల్ కి కాల్ చేసి విషయం చెప్పడంతో సునీల్ వెంటనే ఒక ట్రక్ ని రెడీ చేసి గాంధీ వస్తున్న రూట్ లో పెడతాడు ఇక గాంధీ తను నడుపుతున్న బైక్ ని డైరెక్ట్ గా ఆ ట్రక్ లోకి ఎక్కించేస్తాడు అలా వాళ్ళు ఫాజిల్ గ్యాంగ్ నుంచి సక్సెస్ ఫుల్ గా తప్పించుకుంటారు. ఇక వాళ్ళు ముగ్గురు తిరిగి ఇండియాకి వచ్చేస్తారు గాంధీ జీవన్ ని తీసుకొని అను దగ్గరికి వెళ్ళగా జీవన్ ఇంకా బతికే ఉన్నాడని తెలిసి అను చాలా ఆనంద పడుతుంది.

THE GREATEST OF ALL TIME (GOAT)

 కట్ చేస్తే తమ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరూ ఇంటికి వచ్చి జీవన్ ని పలకరిస్తారు గాంధీ అను మధ్య ఉన్న మనస్పర్తలు కూడా తొలగిపోయి అందరూ హ్యాపీగా ఒక ఫ్యామిలీ లాగా ఉంటారు ఇంకా శ్రీనిధికి జీవన్ కి చిన్నప్పటి నుంచే మంచి స్నేహం ఉంటుంది. అలా ప్రస్తుతం వాళ్ళిద్దరూ కొన్ని రోజులు రోజులోనే రిలేషన్ లోకి ఎంటర్ అవుతారు. ఇంతకుముందు నేను జీవన్ ని సంజయ్ అనే పేరుతో కూడా పిలిచాను కదా ఆ పేరుతో ఎందుకు పిలిచానో స్టోరీలో పోను పోను మీకే రివీల్ అవుతుంది. ఒక రోజు రాత్రి నజీర్ ఢిల్లీ నుంచి బయలుదేరి అర్జెంట్ గా చెన్నైకి వచ్చి గాంధీకి కాల్ చేస్తాడు. నజీర్ గాంధీ తో మనం వెంటనే మీట్ అవ్వాలి మనం ఎప్పుడు కలుసుకునే రెగ్యులర్ ప్లేస్ కి వెంటనే వచ్చేసేయ్ అని హడావిడిగా చెప్తాడు. గాంధీ కూడా వెంటనే నజీర్ ని మీట్ అవ్వడానికి తన కార్లో బయలుదేరుతాడు అయితే ఎవరో ఒక గుర్తుతెలియని వ్యక్తి నజీర్ ని బైక్ మీద ఫాలో అవుతూ వచ్చి నజీర్ ఉన్న కార్లోకి బాంబ్ విసిరేస్తాడు. కానీ అది గమనించిన నజీర్ వెంటనే కార్లో నుంచి బయటపడి బాంబ్ బ్లాస్ట్ నుండి తప్పించుకుంటాడు. కానీ ఆ గుర్తుతెలియనివ్యక్తి మాత్రం నజీర్ ని అసలు వదిలిపెట్టకుండా తనని చంపాలని చేస్ చేస్తాడు.  ఆ చేస్ లో నజీర్ మొబైల్ పొరపాటున ఒకచోట కింద పడిపోతుంది. కొంతసేపటి తర్వాత షా అనే వ్యక్తి నజీర్ మొబైల్ ని తీసుకుంటాడు. 

 కట్ చేస్తే ఆ గుర్తుతెలియనివ్యక్తి  నజీర్ ని చంపాలని ట్రై చేస్తుండగా అక్కడికి కరెక్ట్ గా  గాంధీ వచ్చేస్తాడు. ఇక గాంధీకి ఆ గుర్తుతెలియనివ్యక్తి  కి మధ్య పెద్ద ఫైటే జరుగుతుంది. అయితే ఆ గుర్తుతెలియనివ్యక్తి ముఖానికి హెల్మెట్ ఉండడంతో అసలు ఆ వ్యక్తి ఎవరనే విషయం నజీర్ కి గాని గాంధీకి గాని తెలియదు. చివరికి ఆ గుర్తుతెలియనివ్యక్తి గాంధీని దాటి ఒక కత్తిని నజీర్ గొంతులో గుచ్చుతాడు దాంతో నజీర్ చనిపోతాడు. వచ్చిన పని కంప్లీట్ అవ్వడంతో ఆ గుర్తుతెలియనివ్యక్తి గాంధీ నుంచి తప్పించుకొని సేఫ్ గా బయట పడతాడు. యాక్చువల్ గా నజీర్ తన పర్సనల్ కంప్యూటర్ లోని ఒక డేటాని తన మొబైల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఆ డేటాని గాంధీకి చూపించాలని చెన్నైకి వస్తాడు తనని ఓడించి తన కళ్ళ ముందే నజీర్ ని చంపిన వాడిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని డిసైడ్ అయ్యి గాంధీ మళ్ళీ స్క్వాడ్ లోకి జాయిన్ అవుతాడు. 

కట్ చేస్తే జీవన్ షా (Vaibhav Reddy) దగ్గరికి వెళ్లి ఆ నజీర్ గాడి మొబైల్ ఎక్కడరా అని అడుగుతాడు అయితే షా నుంచి కూడా ఒక దొంగ ఆల్రెడీ నజీర్ మొబైల్ ని కొట్టేసి ఉండడంతో మొబైల్ మిస్ అయిందని షా జీవన్ తో చెప్తాడు. అసలు నజీర్ ని చంపిన ఆ గుర్తుతెలియనివ్యక్తి ఎవరో కాదు తనని చంపింది జీవనే. ఈ షా కూడా జీవన్ ఫ్రెండే మేనన్ జీవన్ కి కాల్ చేసి ఎలా ఉన్నావు సంజయ్ మన ప్లాన్ ఎలా సాగుతుందని అడుగుతాడు దానికి జీవన్ అలియాస్ సంజయ్ మన ప్లాన్ సూపర్ గా రన్ అవుతుంది నాన్న అని అంటాడు. 

A VENKAT PRABHU MAGIC 

 ఇప్పుడు కథ కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది యాక్చువల్ గా ఈ మూవీ స్టార్టింగ్ లో మేనన్ పై దేశద్రోహిగా ముద్ర పడిన తర్వాత మేనన్ తన ఫ్యామిలీని తీసుకొని ఒక సేఫ్ ప్లేస్ కి ట్రైన్ లో వెళ్తూ ఉంటాడు అయితే అదే ట్రైన్ ని గాంధీ తన టీం తో పూర్తిగా బ్లాస్ట్ చేసేస్తాడు కదా ఆ బ్లాస్టింగ్ లో మేనన్ ఫ్యామిలీ మొత్తం చనిపోతారు. తన ఫ్యామిలీ చావుకి కారణమైన గాంధీ పై ఎలాగైనా పగ తీర్చుకోవాలని అప్పటినుంచి మేనన్ గాంధీని ఫాలో అవ్వడం మొదలు పెడతాడు అలా మేనన్ థాయిలాండ్ లో ఒక ఆవిడ చేత జీవన్ ని కిడ్నాప్ చేయించి జీవన్ చనిపోయినట్లుగా యాక్సిడెంట్ ని క్రియేట్ చేస్తాడు. అది చూసి జీవన్ చనిపోయాడని గాంధీ నమ్ముతాడు తర్వాత మేనన్ వేరే వాళ్ళ ద్వారా జీవన్ కి చిత్ర హింసలు పెట్టించి తనకి భయం అంటే ఏంటో రుచి చూపిస్తాడు. కొన్నిరోజుల తర్వాత మేనన్ జీవన్ ని దత్త తీసుకొని తనని సొంత కొడుకులాగా ప్రేమగా పెంచుతూ తనకి సంజయ్ అనే పేరు పెడతాడు. 

 యాక్చువల్ గా మేనన్ జీవన్ ని ఒక పక్క ప్రేమగా పెంచుతూనే ఇంకో పక్క జీవన్ మనసులో తన ఫ్యామిలీని చంపిన వాళ్ళపై రివెంజ్ తీర్చుకునే విధంగా పగని కూడా పెంచుతాడు. సంజయ్ పెరిగి పెద్దవాడైన తర్వాత మేనన్ సంజయ్ తో మన ఫ్యామిలీని చంపింది ఎవరో ఇప్పుడే నాకు తెలిసిందే మన ఫ్యామిలీని చంపింది ఎవరో కాదు అది నీ కన్నతండ్రి గాంధీనే అని అంటాడు జీవన్ కి ఇప్పుడు తన కన్నతండ్రి గాంధీ మీద ఎటువంటి ప్రేమ ఉండదు కానీ పెంపుడు తండ్రి అయిన మేనన్ పై మాత్రం విపరీతమైన ప్రేమ ఉంటుంది. జీవన్ మేనన్ తో అసలు వాడి ముఖం ఎలా ఉంటుందో నాకు అసలు గుర్తులేదు. మన ఫ్యామిలీని చంపింది నా కన్న తండ్రి అయినా సరే నేను వాడిని చంపి తీరుతానని అంటాడ. దాంతో ఇన్నాళ్ళ నుంచి ఎదురు చూస్తున్న తన ప్లాన్ సక్సెస్ కాబోతుందని మేనన్ చాలా ఆనంద పడతాడు. అలా మేనన్ గాంధీని చంపేందుకు ఒక ప్లాన్ ప్రకారమే జీవన్ ని గాంధీ దగ్గరికి పంపిస్తాడు. 

 కట్ చేస్తే నజీర్ మొబైల్ ఆన్ అయిందని తెలియడంతో గాంధీ నజీర్ మొబైల్ కి కాల్ చేస్తాడు అయితే ఆ కాల్ ని బోస్ (Yogi Babu) అనే ఒక దొంగ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఈ బోసే షా దగ్గర నుంచి నజీర్ మొబైల్ ని దొంగతనం చేసి ఉంటాడు. తమ మొబైల్ ని తిరిగి ఇవ్వమని గాంధీ బోస్ ని అడగ్గా 50000 ఇస్తేనే మొబైల్ ఇస్తానని బోస్ అంటాడు. డబ్బులు ఇవ్వడానికి గాంధీ కూడా ఒప్పుకోవడం తో బోస్ ఒక అడ్రస్ ని చెప్పి అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చి మొబైల్ ని తీసుకెళ్లండి అని అంటాడు. ఇక గాంధీ అండ్ అజయ్ బోస్ చెప్పిన అడ్రస్ కి బయలుదేరుతారు అయితే ఈ విషయం తెలిసిన జీవన్ గాంధీ కంటే ముందుగా బోస్ దగ్గరికి వెళ్లి నజీర్ మొబైల్ ని తీసుకోవాలని డిసైడ్ అవుతాడ. కానీ ఈ లోపే గాంధీ అండ్ అజయ్ బోస్ ఉన్న ప్లేస్ కి వచ్చి బోస్ కోసం గాంధీ  ఒకవైపు అజయ్ ఒకవైపు వెతుకుతూ ఉంటారు. చివరికి బోస్ అజయ్ కి కనిపించడంతో అజయ్ తన దగ్గర ఉన్న నజీర్ మొబైల్ ని తీసుకుంటాడు అయితే అక్కడ అజయ్ కి జీవన్ కనిపించడంతో నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావ్ జీవన్ అని అడుగుతాడు అప్పుడు జీవన్ మొబైల్ కోసం వచ్చా అంకుల్ అని చెప్పి తను అజయ్ ని విపరీతంగా కొట్టి చంపేసి మొబైల్ ని తీసుకొని అక్కడి నుంచి పారిపోతాడు. 

 కట్ చేస్తే అజయ్ కూడా చనిపోవడంతో గాంధీ చాలా బాధపడతాడు గాంధీ సునీల్ అండ్ కళ్యాణ్ తో జీవన్ మాస్కో నుంచి ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇలానే జరుగుతుంది జీవన్ ని మాస్కో తీసుకెళ్లేందుకే  ఆ ఫాజిల్ గ్యాంగ్ వాళ్ళు ఈ విధంగా చేస్తున్నారేమో అని డౌట్ పడతాడు. సరిగ్గా అప్పుడే వేరే ఐడెంటిటీ తో ఇండియాలోకి ఎంటర్ అవుతున్న అబ్దుల్ ని ఫేస్ ఐడెంటిఫై  ద్వారా హార్బర్ పోలీసులు పట్టుకుంటారు. గాంధీకి ఈ విషయం తెలియడంతో తను వెంటనే కార్ ని హార్బర్ కి పోనీయమని సునీల్ కి చెప్తాడు. యాక్చువల్ గా అబ్దుల్ జీవన్ ని మాస్కో తీసుకెళ్లడానికి ఇండియాకి వచ్చాడేమో అని గాంధీ అనుకుంటాడు అబ్దుల్ తో పాటే మేనన్ అండ్ మేనన్ గ్యాంగ్ కూడా ఉంటారు కాకపోతే వాళ్ళంతా వేరే వేరే వేషాల్లో ఉండడంతో తను మేనన్ అన్న విషయాన్ని ఎవరూ కనిపెట్టలేకపోతారు. ఈ అబ్దుల్ కూడా మేనన్ గ్యాంగ్ లోని మెంబరే అబ్దుల్ ని హార్బర్ పోలీసులు పట్టుకున్నారని తెలిసి జీవన్ చాలా టెన్షన్ పడతాడు. అబ్దుల్ దగ్గరికి గాంధీ వెళ్తే గాంధీ మేనన్ ని ఖచ్చితంగా ఫైండ్ అవుట్ చేస్తాడని జీవన్ చాలా టెన్షన్ పడతాడు. 

 కట్ చేస్తే జీవన్ శ్రీనిధిని కిడ్నాప్ చేసి హార్బర్ లో పట్టుకున్న మా వాళ్ళని వదలకపోతే మీ కూతుర్ని చంపేస్తా అని జీవన్ ఒక గుర్తుతెలియనివ్యక్తి లాగా సునీల్ కి కాల్ చేస్తాడు. దాంతో సునీల్ ఒక్కసారిగా భయపడిపోయి తన కూతుర్ని కాపాడుకోవడం కోసం హార్బర్ లోని వాళ్ళందరిని వదిలేద్దామని గాంధీతో ఏడుస్తూ ఉంటాడు. కానీ గాంధీ మాత్రం హార్బర్ లోని వాళ్ళని వదిలేసిన కూడా వాడు శ్రీనిధిని ప్రాణాలతో వదులుతాడని గ్యారెంటీ ఏముంది కాబట్టి మనం హార్బర్ లోని వాళ్ళని వదలకుండా శ్రీనిధి ఎక్కడ ఉందో ట్రాక్ చేసి తనని కాపాడదామని అంటాడ. అలా వాళ్ళిద్దరి మధ్య వాగ్వాదం జరుగుతూ ఉండగా కళ్యాణ్ హార్బర్ పోలీసులకు కాల్ చేసి అబ్దుల్ ని తన మనుషుల్ని వదిలేయండి అని అంటాడు. పోలీసులు వాళ్ళని వదిలేయడంతో జీవన్ చాలా రిలీఫ్ గా ఫీల్ అవుతాడు కానీ శ్రీనిధి ప్రాణం తో ఉంటే తన గురించిన నిజాన్ని అందరికీ చెప్పేస్తుందన్న అనుమానంతో జీవన్ శ్రీనిధి గొంతు కోసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఈలోగా గాంధీ సునీల్ కళ్యాణ్ శ్రీనిధి ఎక్కడ ఉందో ట్రాక్ చేసి తను ఉన్న  ప్లేస్ కి వచ్చేస్తారు అయినా కూడా శ్రీనిధి ఎక్కడా కనిపించకపోవడంతో సునీల్ గాంధీ ఒకవైపు అండ్ కళ్యాణ్ మరోవైపు వెళ్లి తన కోసం వెతుకుతుంటారు అలా చివరికి శ్రీనిధి కళ్యాణ్ కి కనిపిస్తుంది కొన ప్రాణంతో ఉన్న శ్రీనిధి జీవనే తనని చంపాలని చూసాడని కళ్యాణ్ కి తను చెప్పేస్తుంది. అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే కొన ప్రాణంతో ఉన్న శ్రీనిధికి కళ్యాణ్ ఊపిరాడకుండా చేసి చంపేస్తాడు

ఇప్పుడు కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తుంది. ఈ కళ్యాణ్ మొదటి నుంచి ఎవరికీ తెలియకుండా మేనన్ కి హెల్ప్ చేస్తుంటాడు కళ్యాణ్ మేనన్ తో ఆ రోజు ట్రైన్ లో మీ ఫ్యామిలీ ఉందని నాకు ముందే తెలిసుంటే ఈ ఆపరేషన్ కి నేను ఒప్పుకొని ఉండేవాడిని కాదు అయినా నువ్వు చనిపోయావని చెప్పి ఒక ఫేక్ రిపోర్ట్ ని కూడా అందరికీ చూపించి వాళ్ళని నమ్మించానని కళ్యాణ్ అంటాడు. ఇండియన్ ఎంబసీ మీద వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నారని కళ్యాణ్ గాంధీని మాస్కోకు పంపిస్తాడు కదా అది కూడా మేనన్ చెప్పడం వల్లే కళ్యాణ్ చేస్తాడు. ఒకరోజు మేనన్ బ్రతికే ఉన్నాడని నజీర్ కి తెలియడంతో నజీర్ ఆ విషయాన్ని  గాంధీకి చెప్పేందుకు సాక్షాదారాలు  అన్నీ మొబైల్ కి ట్రాన్స్ఫర్ చేసుకొని చెన్నైకి బయలుదేరుతాడు ఈ విషయాన్ని జీవన్ కి కళ్యాణ్ చెప్పడంతోనే జీవన్ వెళ్లి నజీర్ ని చంపేస్తాడు. అలా వాళ్ళు మేనన్  బ్రతికున్న విషయాన్ని గాంధీకి తెలియకుండా చేస్తారు. ఇక ఫ్లాష్ బ్యాక్ లో నుంచి ప్రెసెంట్ కి వస్తే  శ్రీనిధి డెడ్ బాడీని తీసుకొని కళ్యాణ్ తనకేమీ తెలియదు అన్నట్టుగా సునీల్ గాంధీ దగ్గరికి వస్తాడు. తన కూతురు చనిపోయిందని తెలిసి సునీల్ చాలా ఏడుస్తాడు గాంధీ అబ్దుల్ ని రెడ్ అలర్ట్ లో పెట్టాడని జీవన్ అబ్దుల్ ని కూడా చంపేస్తాడు.

 కట్ చేస్తే ఒకచోట బోస్ కి షా కనిపించడంతో బోస్, గాంధీకి కాల్ చేసి నేను ఎవరి దగ్గర నుంచి అయితే నజీర్ మొబైల్ ని దొంగతనం చేశానో వాడు కనిపించాడని చెప్తాడు దాంతో ఇక గాంధీ వెంటనే తన టీం తో బోస్ దగ్గరికి రాగా బోస్ వాళ్ళకి షా ని చూపిస్తాడు. ఇక అప్పటినుంచి గాంధీ టీం షా ని ఫాలో అవుతూ తనని ఫాలో చేస్తూ ఉంటారు. తరువాత సీన్ లో హార్బర్ లో రికార్డు అయిన సిసి టీవీ ఫుటేజ్ ని గాంధీ చెక్ చేయగా ఆ ఫుటేజ్ లో తనకి మేనన్ కనిపిస్తాడు మేనన్ బ్రతికే ఉన్నాడని తెలిసి గాంధీ చాలా ఆశ్చర్య పోతాడు ఇన్నాళ్ళు చనిపోయినట్టుగా నటించి ఇప్పుడు ఇండియాకి వచ్చాడంటే కచ్చితంగా ఏదో పెద్దగా ప్లాన్ చేస్తున్నారని గాంధీ అనుకుంటాడు.

 కట్ చేస్తే షాని ఫాలో అవుతున్న గాంధీ అండ్ తన టీం కి జీవన్ షా ని మీట్ అవ్వడం కనిపిస్తుంది ఇక గాంధీకి జీవన్ మీద ఫుల్ క్లారిటీ వచ్చి జీవన్ ని అరెస్ట్ చేస్తాడు షా మాత్రం వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతాడు సునీల్ జీవన్ తో మీనన్ కు నీకు సంబంధం ఏంటి ఎందుకని ఇన్ని హత్యలు చేసావ్ మీరు ఇంకా ఏమేమి ప్లాన్ చేశారని గట్టిగా అడుగుతాడు కానీ జీవన్ మాత్రం వాటికి సమాధానం చెప్పకుండా సునీల్ చేతిలో ఉన్న గన్ ని తీసుకొని తనని షూట్ చేసి చంపేస్తాడు అది చూసిన గాంధీ ఒక్కసారిగా కోపంతో జీవన్ ని చావగొట్టడం మొదలు పెడతాడు అయితే సరిగ్గా అప్పుడే మేనన్ అను దగ్గరికి వెళ్లి గాంధీకి కాల్ చేస్తాడు నువ్వు నా కొడుకుని వదలకపోతే నేను నీ భార్యని చంపేస్తా నువ్వు సంజయ్ ని అలియాస్ జీవన్ ని సేఫ్ గా నా దగ్గరికి తీసుకొని రా అని మేనన్ గాంధీని బ్లాక్ మెయిల్ చేస్తాడు.  దాంతో ఇక చేసేదేం లేక గాంధీ జీవన్ ని తీసుకొని మేనన్ దగ్గరికి వెళ్తుంటాడు కట్ చేస్తే అను అండ్ గాంధీని ఒకచోట బంధించి ఉంటారు మేనన్ గాంధీతో నాపై దేశద్రోహాన్ని ముద్ర వేసి నన్ను దేశం నుంచి పారిపోయేలా చేశారు నీ వల్ల నా ఫ్యామిలీ మొత్తం చనిపోయారు నేను అనుభవించిన బాధని అవమానాన్ని నీ ఫ్యామిలీ కూడా ఇప్పుడు అనుభవించాలి ఈరోజు రాత్రికి క్రికెట్ స్టేడియం లో జరగబోతున్న సెమీ ఫైనల్ మ్యాచ్ లో బాంబ్ పేలబోతుంది ఆ బాంబ్ బ్లాస్టింగ్ చేసింది నువ్వు మీ ఫ్యామిలీ అని అందరూ నమ్మేలాగా చేయబోతున్నాం.

ఆల్రెడీ జీవన్ స్టేడియం లోకి ఎంటర్ అయ్యాడు వన్స్ బాంబ్ గాని బ్లాస్ట్ అయిందంటే నీపై దేశద్రోహి అని ముద్ర పడుతుందని  మీనన్ అంటాడు చెన్నైలో ఎక్కడో ఒకచోట బాంబ్ పెట్టబోతున్నారని షానీ ఫాలో అయినప్పుడే గాంధీకి తెలుస్తుంది. అయితే అది ఎక్కడ పెడతారనే విషయం మాత్రం గాంధీకి తెలియదు అది తెలుసుకోవడం కోసమనే గాంధీ ఇలా మీనన్ కి దొరికిపోయినట్లుగా నటిస్తాడు అండ్ ఆ రోజు ట్రైన్ లో మీనన్ ఫ్యామిలీ ఉన్నట్టు కూడా గాంధీకి తెలియదు క్రికెట్ స్టేడియం లో బాంబ్ పెట్టారని తెలియడంతో ఇక గాంధీ టీం అంతా ఒక్కసారిగా పై నుంచి కిందికి దూకి మీనన్ మనుషుల్ని షూట్ చేసి చంపేస్తారు. 

కట్ చేస్తే మీనన్ ని కలిసేందుకు కళ్యాణ్ ఒక చోటికి రాగా అక్కడ తనకి సునీల్ కనిపిస్తాడు అప్పుడు కళ్యాణ్ అరే సునీల్ నువ్వు ఎలా బ్రతికున్నావురా అని అడుగుతాడు అప్పుడు సునీల్ మేనన్ మాత్రమే చచ్చి బతికి రావాలా నేను వస్తే ఒప్పుకోవా అని అంటాడు అంటే ఇంతకు ముందు సునీల్ గన్ లో ఉన్న బుల్లెట్స్ ఒరిజినల్ కాదన్నమాట అవి ఒరిజినల్ కాకపోవడం వల్లనే సునీల్ బతికిపోతాడు అసలు విషయం ఏంటంటే గాంధీకి శ్రీనిధి డెత్ పై అనుమానం వచ్చి పోస్ట్ మార్టం చేయించగా శ్రీనిధి చనిపోవడానికి కారణం ఊపిరాడకపోవడం అని బయట పడుతుంది శ్రీనిధి దగ్గరికి మొదటగా వెళ్ళింది కళ్యాణే కదా కాబట్టి కళ్యాణే శ్రీనిధిని చంపేసి ఉంటాడని అనుమానిస్తాడు. ఇంతకుముందు కళ్యాణ్ హార్బర్ పోలీసులకి కాల్ చేసి అబ్దుల్ ని అబ్దుల్ మనుషుల్ని వదిలిపెట్టమని చెప్తాడు కదా అసలు మాస్కో నుంచి వచ్చిన అబ్దుల్ పేరు గాంధీకి తప్ప ఎవరికీ తెలియదు కానీ కళ్యాణ్ కి అబ్దుల్ పేరు ఎలా తెలిసిందని గాంధీకి అప్పుడే డౌట్ వస్తుంది అలా గాంధీకి కళ్యాణ్ పై వచ్చిన డౌట్ శ్రీనిధి పోస్ట్ మార్టం ద్వారా నిజమవుతుంది ఇక తన కూతురిని చంపినందుకు సునీల్ కళ్యాణ్ ని గన్ తో షూట్ చేసి చంపేస్తాడు. 

 కట్ చేస్తే జీవన్ తన మనుషులతో స్టేడియం లోని సెక్యూరిటీ రూమ్ లోకి వెళ్లి అక్కడున్న అందరినీ షూట్ చేసి చంపేస్తాడు గాంధీ బామర్ది బిర్యానీ తీసుకొని ఇంతకు ముందే సెక్యూరిటీ రూమ్ లోకి వచ్చి ఉంటాడు కానీ జీవన్ సెక్యూరిటీ రూమ్ లో ఉన్న అందరినీ చంపేస్తుండడంతో గాంధీ బామర్ది జీవన్ కి కనిపించకుండా అదే రూమ్ లో దాక్కొని ఉంటాడు జీవన్ తన మనుషులతో ఫస్ట్ లెఫ్ట్ సైడ్ గ్యాలరీని పేల్చేద్దాం. దాంతో రైట్ సైడ్ గ్యాలరీ లో ఉన్న మనుషులందరూ పరుగులు తీసుకుంటూ స్టేడియం లో నుంచి బయటకు పరుగులు తీస్తారు  అప్పుడు మనం వాళ్ళలో కలిసిపోయి స్టేడియం నుంచి సేఫ్ గా బయట పడదామని అంటాడు సరిగ్గా అప్పుడే గాంధీ అక్కడికి మేనన్ ను తీసుకొని జీవన్ ఉన్న గ్యాలరీకి ఆపోజిట్ సైడ్ గ్యాలరీ లోకి వస్తాడు గాంధీ జీవన్ తో నువ్వు బాంబ్ బ్లాస్ట్ చేసావంటే నేను మేనన్ని చంపేస్తానని బెదిరిస్తాడు దాంతో జీవన్ బాంబ్ బ్లాస్ట్ చేయడం ఆపేస్తాడు కానీ మేనన్ మాత్రం నాకేం జరిగినా పర్లేదు బాంబ్ మాత్రం బ్లాస్ట్ చేయని చెప్పడంతో ఇక జీవన్ గాంధీ మీద ఉన్న కోపంతో బాంబ్ బ్లాస్ట్ చేయాలని డిసైడ్ అవుతాడు తీరా చూస్తే అక్కడ బాంబ్ రిమోట్ ఉండదు. ఆ రిమోట్ ని గాంధీ బామర్ది జీవన్ కి తెలియకుండా అక్కడి నుంచి తీసుకొని బయటకు పారిపోయి ఉంటాడు. ఇప్పుడు ఆ విషయం జీవన్ కి తెలియడంతో జీవన్ మనుషులు గాంధీ బామర్ది కోసం వెతకడం మొదలు పెడతారు అయితే ఆ స్టేడియం లో గాంధీ బామర్దికి జీవిత కనిపిస్తుంది. స్టేడియం లో సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంటుంది తనను  ఫాలో అవుతున్న జీవన్ మనుషుల్ని డైవర్ట్ చేసేందుకు గాంధీ బామర్ది జీవిత కి బాంబ్ రిమోట్ ని ఇచ్చి ఇది మీ నాన్నకి ఇవ్వు తను ఇక్కడే ఉన్నాడని అంటాడు. 

 కట్ చేస్తే జీవిత చేతిలో బాంబ్ రిమోట్ ఉండడాన్ని సెక్యూరిటీ వాళ్ళు చూసి గాంధీ కూతురు బాంబ్ రిమోట్ ని పట్టుకొని స్టేడియం లో తిరుగుతుందని అందరికీ సర్క్యులేట్ చేస్తారు అలా జీవిత దగ్గర బాంబ్ రిమోట్ ఉందన్న విషయం జీవన్ కి కూడా తెలియడంతో ఇక జీవన్ జీవిత వెంటపడతాడు గాంధీ మేనన్ ని బంధించేందుకు వాష్ రూమ్ లోకి వెళ్ళగా అక్కడ తనకి శివకార్తికేయన్ కనిపిస్తాడు అప్పుడు గాంధీ శివకార్తికేయన్ తో స్టేడియం లో బాంబ్ పెట్టారు ఆ గ్యాంగ్ కి హెడ్ వీడే నేను వచ్చే వరకు వీడు ఎక్కడికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి గాంధీ గన్ ని శివకార్తికేయన్ కి ఇస్తాడు అందుకు శివకార్తికేయన్ కూడా ఒప్పుకుంటాడు. 

జీవన్ నుంచి తప్పించుకుంటూ జీవిత స్టేడియం రూఫ్ టాప్ మీదకి చేరుకుంటుంది జీవిత దగ్గర ఉన్న బాంబ్ రిమోట్ ని తీసుకునేందుకు జీవన్,  జీవన్ బాంబ్ బ్లాస్ట్ చేయకుండా ఆపేందుకు గాంధీ కూడా స్టేడియం రూఫ్ టాప్ మీదకి చేరుకుంటాడు ఇక గాంధీ జీవన్ కి మధ్య ఫైట్ జరుగుతుంది ఆ ఫైట్ లో గాంధీ పై చేయి సాధించి బాంబ్ రిమోట్ ని ఆఫ్ చేస్తాడు కానీ జీవన్ మాత్రం జీవిత ని  పట్టుకొని బాంబ్ రిమోట్ ని నాకు ఇచ్చేసేయ్ లేదంటే జీవిత ని చంపేస్తా అని గాంధీని బెదిరిస్తాడు. అప్పుడు గాంధీ అసలు ఆ మేనన్ నీకు ఏం చెప్పి మా మీదకి పంపాడో  ఎలా నిన్ను మార్చాడో నాకే అర్థం కావడం లేదు మనమంతా ఒకే ఫ్యామిలీ రా నీ చెల్లిని నువ్వే చంపేస్తావేంటి అని చెప్పి జీవన్ ని మంచిగా మార్చాలని ప్రయత్నిస్తాడు కానీ జీవన్ మాత్రం గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ అసలు ఎవర్రా ఇది అని జీవిత ని అంటాడు వీడెంతకీ మారేలా లేడని ఇక గాంధీ చివరికి జీవన్ కి గన్ తో హెడ్ షాట్ కొడతాడు దాంతో జీవన్ చనిపోయి స్టేడియం మీద నుంచి కింద పడిపోతాడు ఇక్కడితో మూవీ సమాప్తం. ….

::::: THE END :::::

FOR MORE MOVIE STORIES WEB SERIES REVIEWS Please visit our Website: www.Filmywebstories.com

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

en_USEnglish
Scroll to Top