సరిపోదా శనివారం (SARIPODHA SANIVAARAM) Full Movie Explanation

Natural Star Nani Saripodhaa Sanivaaram Movie Poster Hd

హాయ్ ఫ్రెండ్స్ Welcome to FilmyWebstories.com August 29 2024 లో రిలీజ్ అయినటువంటి సరిపోదా శనివారం అనే యాక్షన్ డ్రామా మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం.

మూవీ స్టార్ట్ అవ్వగానే సూర్య (నాని)  చిన్నప్పటి స్టోరీ చూపిస్తారు. సూర్య మదర్ ఛాయాదేవికి (అభిరామి) తీవ్రమైన అనారోగ్యం ఉండడం వల్ల ఆమె మరో రెండు నెలల్లో చనిపోబోతుంది. తను చనిపోయే లోపు తన కూతురు భద్ర కి ఇంటి పనులు నేర్పించాలని, సూర్యకి చిన్నప్పటి నుంచి చాలా కోపం ఎక్కువగా ఉంటుంది దాన్ని ఎలా అయినా సరే కంట్రోల్ చేయాలని ఆమె డిసైడ్ అవుతుంది ఛాయాదేవికి ఒక అన్నయ్య ఉంటాడు అతను ప్రతి రోజు తాగి వచ్చి అతని భార్య ని కొడుతుంటే కేసు పెట్టించి సొంత అన్నయ్యని కూడా జైలుకు పంపిస్తుంది అతను తిరిగి వచ్చే లోపు అతని భార్య ని కూతురు కళ్యాణిని వేరే ఊరికి పంపించేస్తుంది కళ్యాణి అంటే సూర్యకి చాలా ఇష్టం కానీ కళ్యాణి మాత్రం సూర్య అంటే అసలు ఇష్టం ఉండదు. 

 సూర్య తన కోపంతో ప్రతి ఒక్కరితో గొడవ పడుతుంటాడు.  అందుకే కళ్యాణికి సూర్య అంటే అసలు ఇష్టం ఉండదు ఛాయాదేవి సూర్యతో ప్రతి విషయానికి కోప్పడితే నీ కోపానికి విలువ ఏముంటుంది ప్రతి రోజు కోప్పడకుండా వారానికి ఒక్క రోజు నీ కోపాన్ని చూపించు అని తన దగ్గర ప్రామిస్ తీసుకుంటుంది కానీ అది ఏ రోజు ఇంకా డిసైడ్ చేయదు ఒకరోజు సూర్య తన అమ్మ ఒడిలో పడుకొని ఉండగా ఆమె సూర్యతో అసలు నిజమైన కోపం అంటే ఏంటో తెలుసా సూర్య అని అంటుంది కానీ సూర్య మాత్రం అప్పటికే నిద్రపోయి ఉంటాడు సో వాళ్ళ అమ్మ చెప్పిన ఆఖరి మాటలు సూర్య వినకుండానే పడుకుంటాడు. మరుసటి రోజు ఉదయం ఛాయాదేవి చనిపోతుంది ఛాయాదేవి అన్నయ్య అక్కడికి వచ్చి నా భార్య, కూతురు ఎక్కడ ఉన్నారో చెప్పకుండా చనిపోయావా అని ఆమెను బూతులు తిట్టి ఆమె శవం మీదకి చెప్పు విసురుతాడు అప్పుడు ఆమె చీర కొంగు సూర్య చేతి మీద పడుతుంది ఇక ఈ రోజేనేమో నేను కోపం చూపించాల్సిన రోజు అని సూర్య అనుకుని వెళ్లి తన మామయ్యని కర్రతో గట్టిగా కొడతాడు ఆ రోజే శనివారం కట్ చేస్తే కొన్ని సంవత్సరాలు గడిచిపోతాయి సూర్య ప్రస్తుతం ఎల్.ఐ.సి లో వర్క్ చేస్తుంటాడు ఛాయాదేవి చనిపోయిన తర్వాత సూర్య తండ్రి శంకరే(సాయికుమార్ )  సూర్యని భద్రని పెంచుతాడు ఇక్కడ భద్ర అంటే సూర్య యొక్క అక్క ఇప్పటికీ సూర్య వాళ్ళ అమ్మ చెప్పిన మాటనే ఫాలో అవుతూ ఉంటాడు ఆదివారం నుండి శుక్రవారం వరకు ఎంత కోపం వచ్చినా కంట్రోల్ చేసుకుంటూ తనకి కోపం తెప్పించిన వాళ్ళ పేర్లు ఒక బుక్ లో రాసుకుంటాడు. 

 శనివారం లోపు అలా రాసుకున్న వాళ్ళ మీద ఎవరి మీద అయినా కోపం తగ్గిపోతే వాళ్ళని వదిలేస్తాడు కానీ శనివారానికి కూడా కోపం అలానే ఉంటే వాడిని మాత్రం అసలు వదలడు కట్ చేస్తే నారాయణ ప్రభువు దగ్గర ఫాజిల్ అనే వ్యక్తి పని చేస్తుంటాడు ఈ నారాయణ పెద్ద రౌడీ లాంటోడు. గడియారాన్ని 10 నిమిషాలు ఫాస్ట్ పెట్టాడని నారాయణ ఫాజిల్ ని బాగా కొడతాడు ఆ విషయం సూర్యకు తెలియడంతో సూర్యకి బాగా కోపం వస్తుంది. ఇక సూర్య ఫాజిల్ ని తీసుకొని డైరెక్ట్ గా నారాయణ దగ్గరికి వెళ్లి వాడు 10 నిమిషాలు ఫాస్ట్ గా పెట్టడానికి కారణం చెప్పిస్తాడు నిజానికి ఫాజిల్ యొక్క నాన్న ట్రైన్ ఎక్కడానికి 10 నిమిషాలు ముందుగా వెళ్ళకపోవడంతో అతను ఆ రోజు చనిపోతాడు తన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ ఇంకెవరి లైఫ్ లో జరగకూడదని ఫాజిల్ కి ఎప్పుడు గడియారం కనిపించినా దాన్ని 10 నిమిషాలు ముందుగా పెడతాడు కానీ అలా ముందుగా పెట్టాడని తెలియక నారాయణ ఒక పనికి 10 నిమిషాలు ముందుగా వెళ్తాడు. నారాయణ 10 నిమిషాలు ముందే రావడంతో అక్కడి వాళ్ళందరూ కూడా నారాయణకి ఏం పని లేదా అని పని లేని వాళ్ళలా చూస్తారు. దానికి కారణమైన ఫాజిల్ పై కోపం వచ్చి ఈ 10 నిమిషాలు ఎందుకు ముందుగా పెట్టావురా అని ఫాజిల్ ని కొడతాడు ఫాజిల్ చెప్పిన కారణం విన్నాక కూడా ఏంట్రా ఇప్పుడు నేను నీకు క్షమాపణ చెప్పాలా అని నారాయణ ఫాజిల్ అండ్ సూర్యని ఇద్దరిని కొడతాడు.  ఆ రోజు శనివారం కాదు కాబట్టి సూర్య కూడా సైలెంట్ గా వెళ్ళిపోతాడు. శనివారం వచ్చి నారాయణని అతని మనుషులందరినీ బాగా కొడతాడు అప్పుడు నారాయణ సూర్య తో మొన్న ఎందుకు కొట్టలేదు ఈ రోజు ఎందుకు వచ్చి కొడుతున్నావ్ అని అడుగుతాడు అప్పుడు సూర్య నేను శనివారమే కొడతానని రివీల్ చేస్తాడు. 

 ఇక ఆ రోజు నుంచి సండే టు ఫ్రైడే సూర్యని కొట్టడానికి నారాయణ మనుషులు సూర్య మీద అతని ఫ్యామిలీ మీద అటాక్ చేస్తుంటారు బట్ ఆ రోజుల్లో సూర్య తప్పించుకోవడం శనివారం వెళ్లి మళ్ళీ నారాయణ మనుషుల్ని కొట్టడం ఇవన్నీ రిపీట్ గా జరుగుతుంటాయి కానీ ఒక శనివారం మాత్రం సూర్య నారాయణుని నైట్ 12 దాటే లోపు కొట్టలేకపోతాడు శనివారం ఎవరినైనా కొట్టాలని ఫిక్స్ అయ్యి ఆ రోజు వాళ్ళని కొట్టలేకపోతే ఇంక వాళ్ళని కొట్టడం వాళ్ళ అమ్మకి ఇష్టం లేదేమో అని సూర్య వాళ్ళని వదిలేస్తాడు. 

 చిన్నప్పటి నుండి సూర్యకి కళ్యాణి అంటే చాలా ఇష్టం కానీ వాళ్ళు  ప్ప్రస్తుతం ఎక్కడున్నారో కూడా సూర్యకి అసలు తెలియదు కానీ సూర్య మాత్రం కళ్యాణినే లవ్ చేస్తూ ఉంటాడు, సూర్యకి కళ్యాణి మీద ఉన్న లవ్ పోవాలని సూర్య ఫాదర్ అండ్ సూర్య అక్క భద్ర ఒక అమ్మాయిని  తెచ్చి తనే కళ్యాణి అని పెళ్లి కూడా అయిపోయిందని నాటకం ఆడిస్తారు కట్ చేస్తే సూర్య అక్కకి మ్యారేజ్ అవుతుంది పెళ్లిలో వాళ్ళ అమ్మ చీర కట్టుకోవాలని భద్ర అనుకుంటుంది ఆ విషయంలో పెళ్లి కొడుకు ఫాదర్ సూర్య మదర్ గురించి తప్పుగా మాట్లాడతాడు ఆ మాటల్ని సూర్య వింటాడు పెళ్లి ఫ్రైడే రాత్రి జరుగుతుంది పెళ్లి అయిపోయిన మరు క్షణం అంటే శనివారం  పెళ్లిలోనే సూర్య వెళ్లి పెళ్లి కొడుకు తండ్రి ని కొడతాడు ఇక సూర్య తండ్రి  పెళ్లి కొడుకుతండ్రి ని చాలా బతిమిలాడి సారీ చెప్తాడు భద్ర సూర్య తో ఆల్రెడీ నీకు చెప్పా కదా ఈ విషయంలో కూల్ గా ఉండు ఆయన్ని ఏం చేయకు అని కానీ నువ్వు నా ఫ్యూచర్ గురించి కూడా ఆలోచించకుండా నీ కోపానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చావు ఇకపై నీ లైఫ్ నీది నా లైఫ్ నాది నాతో మాట్లాడొద్దని సూర్యతో మాట్లాడటం మానేస్తుంది. 

 కట్ చేస్తే సీన్ దయ దగ్గర ఓపెన్ అవుతుంది దయ అండ్ కూర్మ ఇద్దరు బ్రదర్స్ దయ ఒక దయ లేని సిఐ అండ్ కూర్మ ఒక కార్పొరేటర్ అండ్ పొలిటికల్ గా చాలా

పేరున్న వ్యక్తి. ఈ అన్నదమ్ములు ఇద్దరికీ అసలు పడదు.  దయ పేరు మీద ఉన్న ఒక ల్యాండ్ 45 కోట్ల వాల్యూ చేస్తుంటుంది కానీ అది అమ్మాలంటే మాత్రం దానికి కూర్మ  సంతకం కావాలి కానీ కూర్మ  మాత్రం సంతకం పెట్టడు ఆ సంతకం ఎలాగైనా పెట్టించుకొని ల్యాండ్ అమ్ముకోవాలని కూర్మాకి కావాల్సిన వాడైన గోవర్ధన్ ని కిడ్నాప్ చేసి దయ వాడిని టార్చర్ చేస్తుంటాడు అలా టార్చర్ చేస్తున్న వీడియోని దయ కూర్మా కి పంపిస్తాడు కానీ నెట్ సిగ్నల్ లేకపోవడంతో ఆ వీడియో డౌన్లోడ్ అవ్వదు.  దాంతో గోవర్ధన్ మా అన్నకి అంత ఇంపార్టెంట్ కాదేమోలే అని దయ గోవర్ధన్ ని పంపించేస్తాడు కానీ గోవర్ధన్ ని వదిలేసిన మరుక్షణమే కూర్మ దయాకి కాల్ చేసి గోవర్ధన్ ని ఏం చేయొద్దు వాడిని వదిలేసేయ్ నేను సైన్ పెడతానని అంటాడు కానీ దయ ఆల్రెడీ గోవర్ధన్ ని వదిలేసాడు కదా ఇంకేం యూస్ ఉంటుంది. 

 దయ కి బాగా కోపం వచ్చి సోకులపాలెం వెళ్లి రాజు అనే ఒకడిని పట్టుకొని వాడిని పిచ్చి పిచ్చిగా కొడుతూ స్టేషన్ కి తెస్తాడు స్టేషన్ లో కొత్త కానిస్టేబుల్ గా జాయిన్ అవ్వాలని వచ్చిన చారులత అదంతా చూసి ఎందుకు సార్ అతన్ని అలా కొడుతున్నాడని హెడ్ కానిస్టేబుల్ అయిన కమలాకర్ (శుభలేఖ సుధాకర్) ని అడుగుతుంది అప్పుడు కమలాకర్ అసలు దయ ఎందుకు రాజుని అంత కోపంగా కొడుతున్నాడో చెప్తాడు స్టూవర్టుపురం లాగానే సోకులపాలెంలో కూడా ఒకప్పుడు అంతా దొంగలే కాని ఎన్నో ఏళ్ల క్రితమే వాళ్ళు అన్ని మానేసి ఇప్పుడు మంచిగా బతుకుతూ ఉంటారు కానీ ఒకప్పుడు వాళ్ళ పూర్వీకులందరూ దొంగలు అవ్వడంతో వీళ్ళ పైన కూడా దొంగలనే ముద్ర పడిపోతుంది

వీళ్ళకి ఎక్కడా పని దొరకదు ఒకవేళ ఎక్కడికన్నా పనికి  వెళ్ళాలన్న కూడా దానికి సిఐ సంతకం కావాలి సిఐ కి ఒక ల్యాండ్ ఉంటుంది దాని మీద తన అన్న అయిన కూర్మా కోర్టులో కేసు వేస్తాడు ఆ తర్వాత సోకులపాలెం వాళ్ళ సపోర్ట్ తో కూర్మా  కార్పొరేటర్ గా గెలిచి తన పలుకుబడి ని ఉపయోగించి కోర్టులో కేసు కూడా గెలుస్తాడు ఇప్పుడు దయ ఆ ల్యాండ్ అమ్మాలి అంటే దానికి ఖచ్చితంగా కూర్మా సంతకం ఉండాలని కోర్టు తీర్పు ఇస్తుంది.  ఆ ల్యాండ్ కి మంచి మంచి డీల్స్ అన్నీ వస్తుంటాయి కానీ దయ ఏం చేయలేకపోతాడు అసలు సోకులపాలెం వాళ్ళు ఓట్లు వేసి తన అన్నని కార్పొరేటర్ గా గెలిపించడం వల్ల ఇదంతా అయిందని తన అన్న మీద ఎప్పుడు కోపం వచ్చినా సరే వెళ్లి ఆ సోకులపాలెం వాళ్ళ మీద తన కోపాన్ని తీర్చుకుంటూ ఉంటాడు ఇదంతా విన్న చారులత వాళ్ళకు ఎలా అయినా కొంచెం హెల్ప్ చేయాలని అనుకుంటుంది అసలు ఈ చారులత  ఎవరో కాదు సూర్య మరదలైన కళ్యాణినే.  చిన్నప్పుడే వాళ్ళు వేరే ఊరు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ పేర్లను మార్చేసుకుంటారు దయ రాజు అనే వాడిని నాలుగు రోజులుగా ఫుడ్ ఏం పెట్టకుండా బాగా కొడుతూ హింసిస్తూ ఉంటాడు వాడి మీద జాలివేసి చారు సోకులపాలెంలో ఉన్న రాజు ఇంటికి వెళ్లి ఫుడ్ తెచ్చి రాజుకి ఇస్తుంది.  ఒక పోలీస్ మనతో ఇంత మర్యాదగా సహాయంగా ఉందని వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. 

 కట్ చేస్తే దయ ఒక రోజు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్తాడు. దయ కార్ రివర్స్ తీస్తుండగా వేరే లేడీ కార్ కి డాష్ ఇస్తాడు అప్పుడు ఆమె దయని సెన్స్ లేదా అని తిట్టడంతో దయ కి బాగా కోపం వచ్చి కార్ తో మళ్ళీ మళ్ళీ ఆమె కారుని డాష్ ఇస్తూనే ఉంటాడు అక్కడే ఉన్న సూర్య కి దయ అలా చేయడంతో దయ మీద కోపం వస్తుంటది కానీ తన కోపాన్ని శనివారం మాత్రమే చూపించగలడు కదా. తన బైక్ లో ఉన్న పెట్రోల్ ని ఒక బాటిల్ లో నింపి దాన్ని కార్ కింద పోసి కార్ ఆపండి సార్ పెట్రోల్ లీక్ అవుతుందని చెప్తాడు సూర్య అలా చేయడం చారులతో గమనిస్తుంది కానీ మిగతా వాళ్ళు ఎవరు కూడా గమనించరు ఇక దయ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాసేపటి తర్వాత చారు తిరిగి హాస్పిటల్ దగ్గరికి వచ్చి నువ్వు ఆమెను కాపాడినందుకు చాలా థాంక్స్ అని చెప్తుంది సూర్య బైక్ లో పెట్రోల్ అయిపోవడంతో చారునే పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్దామని సహాయం చేస్తుంది.  అలా వాళ్ళిద్దరూ కాసేపు సరదాగా టైం స్పెండ్ చేస్తూ పెట్రోల్ తెచ్చుకుంటారు కట్ చేస్తే ఆ రోజు రాత్రి ఇంటి దగ్గరికి వచ్చిన సూర్య దయ పేరుని తన బుక్ లో రాసుకోబోతాడు కానీ చారుతో గడిపిన క్షణాలు పదే పదే సూర్యకి గుర్తొస్తుండడంతో వెళ్లి ఆ విషయం అంతా వాళ్ళ నాన్నకి చెప్తాడు దానికి వాళ్ళ నాన్న నీ కోపం కన్నా ఇంకొక ఎమోషన్ నిన్ను డామినేట్ చేస్తుందంటే అది ప్రేమేమో అని అంటాడు. 

 కట్ చేస్తే సూర్య అండ్ చారు ఫుల్ గా కాల్స్ అండ్ మెసేజెస్ మాట్లాడుకుంటూ బాగా క్లోజ్ అవుతుంటారు ఆరు రోజులు సూర్య కూల్ గా ఉంటాడు కదా ఆ కూల్ ఆటిట్యూడ్ వల్ల చారుకి సూర్య మీద ఇష్టం వస్తుంది అండ్ సోకులపాలెం వాళ్ళందరికీ కూడా సూర్య తో ఎల్ఐసి పాలసీస్ కూడా చేపిస్తుంది.  ఒకరోజు చారు రాజుకి ఫుడ్ పెట్టడం ఎస్ఐ..ఐ సుధా చూసి చారుని కొడతాడు ఆ విషయం సూర్య కి తెలిసి ఒక శనివారం సుధాకి ముసుగేసి కొడతాడు ఎస్ఐ నే కాదు చారుని ఇబ్బంది పెట్టిన ఇంకొంత మందిని కూడా సూర్య శనివారం కొడుతుంటాడు అలా కొట్టించుకున్న వాళ్ళు మరియు  ఎస్.ఐ ఇద్దరు దెబ్బలతో కనిపించడంతో చారుకి బాగా డౌట్ వచ్చి ఎంక్వయిరీ చేస్తుంది. ఎవడో తనని ఫాలో అవుతూ తనని ఇబ్బంది పెట్టే వాళ్ళందరిని కూడా  కొడుతున్నాడని చారుకి అర్థమై ఆ విషయాన్ని సూర్యతో చెప్తుంది. సూర్యనే తన చిన్నప్పటి బావ అని చారుకి తెలియదు ఇద్దరు వేరు వేరు అనుకుంటారు ఎందుకంటే తన చిన్నప్పటి బావ పేరు కూడా సూర్యనే కదా కట్ చేస్తే సూర్య అండ్ చారు ఇద్దరు లవ్ లో పడిపోతారు కొన్ని రోజులు అలా గడిచిపోతాయి ఒక రోజు చారు మదర్ ఆ సూర్యని ఇంటికి పిలువు అని చెప్పడంతో చారు సూర్యని ఇంటికి రమ్మంటుంది.   అదే రోజు గోవర్ధన్ కూర్మా ని కన్విన్స్ చేసి దయకి ల్యాండ్ ఇచ్చేయమని చెప్తాడు.  కూర్మా కూడా ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తా ఇంటికి రా అని దయాని పిలిపిస్తాడు ఇక దయ ఎస్ఐ సుధతో కలిసి కూర్మా  ఇంటికి వెళ్తాడు చారు కూడా తన డ్యూటీ పైన  అక్కడికి వెళ్తుంది మరోవైపు శంకర్ సూర్య తో నీ శనివారం  కాన్సెప్ట్ ఆ అమ్మాయికి నువ్వే చెప్పు లేకపోతే తనని నువ్వే మోసం చేసినట్టు అవుతుందని అంటాడు.  సూర్య కూడా నిజం చెప్పానని చారు కి కాల్ చేస్తాడు ఇద్దరు కొంచెం సేపు అయిన తర్వాత ఒక ప్లేస్ లో కలవాలని అనుకుంటారు సూర్య కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉందని నారాయణ్ కి తెలుస్తుంది శనివారం నాడు వాడు కొడతాడనే విషయం గర్ల్ ఫ్రెండ్ కి తెలియకుండా మేనేజ్ చేస్తున్నాడు. 

శనివారం రోజు వాడి గర్ల్ ఫ్రెండ్ ముందే వాడిని కొట్టిన కూడా వాడు ఏం చేయడు వాడి గర్ల్ ఫ్రెండ్ ముందే వాడిని కొట్టండి అని తన మనుషుల్ని నారాయణ పంపిస్తాడు కట్ చేస్తే డాక్యుమెంట్స్ మీద సైన్ కోసం వచ్చిన దయాని కూర్మా చాలా సేపు వెయిట్ చేపిస్తూ సిసి టీవీ లో చూస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటాడు అంతేగాని సంతకం మాత్రం పెట్టడు తనని కావాలనే కోర్మ వెయిట్ చేస్తున్నాడని దయ కి అర్థమై కోపంతో అక్కడి నుంచి బయటకు వచ్చి డైరెక్ట్ గా సోకులపాలెంలో కారు ఆపుతాడు . 

సోకులపాలెం వచ్చిన దయ ఒక ముసలి వాడిని దారుణంగా కొడుతుంటాడు అప్పుడే రాజు ఇంటి ముందు కూర్మా యొక్క ఫ్లెక్స్ బొమ్మలు కనిపించడంతో ఇంకా కోపం ఎక్కువైపోయి రాజు మీద బాగా అటాక్ చేసి బాగా కొడుతుంటాడు రాజుని కొట్టొద్దని అతని వైఫ్ అండ్ పాప అడ్డం పడతారు కానీ మధ్యలో అడ్డం వచ్చిన వాళ్ళని కూడా దయ అకారణంగా కొడతాడు అప్పుడు రాజు యొక్క కూతురు మెడకి బాగా గాయం అవుతుంది ఆ టైం లో సూర్య చారుకి కాల్ చేస్తూ ఉంటాడు చారు కాల్ లిఫ్ట్ చేయడంతో అక్కడ జరిగేదంతా సూర్యకి అర్థమైపోతుంది ఇక వెంటనే అక్కడికి స్టార్ట్ అవుతాడు ఎవరైనా సరే రాజు ఫ్యామిలీకి హెల్ప్ చేశారంటే మీ అందరికీ ఇదే గతి పడుతుందని దయ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 

 దయ మీద ఉన్న భయంతో ఎవరు హెల్ప్ చేయడానికి ముందుకు రారు కానీ కాసేపటి తర్వాత సూర్య అక్కడికి వచ్చి వాళ్ళని హాస్పిటల్ లో జాయిన్ చేస్తాడు ఆ రాత్రి చారు హాస్పిటల్ కి వచ్చి రాజు భార్యని కన్విన్స్ చేసి దయ మీద కంప్లైంట్ ఇవ్వచ్చుగా అని అడుగుతుంది కానీ ఆమెకు దయ మీద ఉన్న భయంతోటి కంప్లైంట్ ఇవ్వదు చారు బాగా బాధపడుతూ సూర్యతో ఇలా అంటుంది నన్ను కదిలించారని ఒకడు శనివారం శనివారం కొంతమందిని కొట్టాడు కదా వాడు గాని ఈ క్షణం నాకు కనిపిస్తే వాడిని ఒకే ఒక్క ఫేవర్ అడగాలని ఉందని అంటుంది.  అదే టైం లో నారాయణ మనుషులు సూర్య మీద అటాక్ చేస్తారు కానీ అది శనివారం కదా హీరో అందరిని ఫుల్ గా కొట్టేస్తాడు అది చూసిన చారు షాక్ అయిపోతుంది సూర్య చారుతో నా కోపాన్ని ఒక్క శనివారం మాత్రమే చూపిస్తానని మా అమ్మకి మాట ఇచ్చాను అండ్ ఆ సోకులపాలెం వాళ్ళ గురించి నువ్వు ఏం అడగాలనుకున్నావో నాకు తెలియదు బట్ ఇకపై వాళ్ళ సమస్య నాది అని అంటాడు. 

 ఇక సూర్య ఇంటికి వెళ్లి దయ పేరుని తన బుక్ లో రాసుకుంటాడు సూర్య గురించిన నిజం తెలిసిన తర్వాత చారు షాక్ లోనే ఉంటుంది కానీ సూర్యని అర్థం చేసుకుంటుంది చారు సూర్యని కలిసి ఈ శనివారం నువ్వు ఏం చేస్తావ్ వెళ్లి దయని కొడతావా అలా చేస్తే సోకులపాలెం వాళ్ళ సమస్య తీరుతుందా తీరదు కదా వాళ్ళలో మార్పు రావాలని అంటుంది కట్ చేస్తే ల్యాండ్ పేపర్స్ మీద ఇక కూర్మా సంతకం పెట్టడని దయాకి అర్థమైపోతుంది. దయ కూర్మా ని చంపాలని ప్లాన్ వేసుకుంటాడు ఆ విషయం చారుకి తెలిసి మనం ఈ విషయాన్ని కూర్మా కి చెప్పేద్దాం ఇక దయ గురించి కూర్మా చూసుకుంటాడని సూర్యతో అంటుంది దానికి సూర్య దయ పోతే ఇంకొకడు వస్తాడు అప్పుడు కూడా వాళ్ళు ఇలానే భయపడుతూ ఉంటారు. వీళ్ళు మారాలి అంటే వీళ్ళలో ఒకడు ధైర్యంగా ముందుకు వచ్చాడని వాళ్ళలో నమ్మకం కలిగించాలని అంటాడు అదే రోజు రాత్రి సూర్య మాస్క్ కట్టుకొని సోకులపాలెంలోనికి వెళ్లి నేను మీలో ఒకడిని నా సహనం నశించింది నేను ఈ శనివారం దయాకి ఎదురు తిరుగుతా అని ఒక గోడ మీద రాస్తాడు తెల్లవారిన తర్వాత సోకులపాలెం వాళ్ళందరూ అది చదివి ఎవడ్రా వీడు అని ఆలోచిస్తారు . కూర్మా యొక్క డైలీ రొటీన్ లో ఉదయం 10 గంటలకి గుడికి రాత్రి 11 గంటలకి పబ్ కి వెళ్తాడు.  గుడి దగ్గర అయితే సెక్యూరిటీ తక్కువ ఉంటుంది కానీ పబ్ లో మాత్రం సెక్యూరిటీ ఎక్కువగా ఉంటుంది సో గురువారం ఉదయం 10 గంటలకి గుడిలో కూర్మా ని చంపేయాలని దయ ప్లాన్ వేసుకుంటాడు కానీ సూర్య శనివారం తప్ప మిగిలిన రోజుల్లో సైలెంట్ గా ఉంటాడు కదా సో ఎలాగైనా సరే

గురువారం వాళ్ళు వేసుకున్న ప్లాన్ ని శనివారం వచ్చేలా చేయాలని అనుకుంటాడు గురువారం మార్నింగ్ సూర్య కూర్మా ని కలిసి వాళ్ళ ఎల్ఐసి కంపెనీ 25th యానివర్సరీ కి చీఫ్ గెస్ట్ గా రమ్మని మంచి పొలిటికల్ స్పీచ్ ని రెడీ చేస్తాడు అలా సూర్య కూర్మా ని గుడికి వెళ్లకుండా ఆపడంతో గురువారం దయా వేసుకొని ప్లాన్ ఫెయిల్ అయిపోతుంది శుక్రవారం కూర్మా యానివర్సరీ కి అటెండ్ అవుతాడు ఆదివారం లోపు ల్యాండ్ తన సొంతం కాకపోతే దయ పెద్ద డీల్ ని మిస్ అవుతాడు. ఎలాగైనా శనివారం కూర్మా  ని చంపాలని దయ ఫిక్స్ అవుతాడు.

 మరోవైపు నారాయణ చనిపోతాడు సూర్య పెట్టిన మెంటల్ ప్రెజర్ వల్లే నారాయణ చనిపోయాడని కాళీ (నారాయణ కొడుకు) కి  తెలిసి ఇక సూర్యని చంపాలని ఫిక్స్ అవుతాడు శనివారం ఉదయం 10 గంటలకి కూర్మా  గుడి కి వస్తాడుకూర్మా ని చంపాలని దయ కూడా గుడి కి స్టార్ట్ అవుతాడు దయ కార్ ని డ్రైవ్ చేసేది చారునే దయ స్టార్ట్ అయ్యాడని చారు సూర్యకి మెసేజ్ చేస్తది ఇక సూర్య ఇంటి నుండి స్టార్ట్ అవ్వబోతుండగా సూర్య దయని కొట్టడానికి వెళ్తున్నాడని సూర్య తండ్రి  కి తెలిసి సూర్య ఫ్రెండ్ కి కాల్ చేసి అసలు ఆ దయ ఎవడని అడగ్గా వాడు ఒక సైకో సీ.ఐ  అని తెలుస్తుంది.  ఇక ఏం చేయాలో తెలియక సూర్య ఫ్రెండ్ ఇచ్చిన ఐడియా తో శంకర్ పాలలో నిద్రమాత్రలు వేసి అవి సూర్యకి తాగమని ఇస్తాడు.  ఆ పాలను తాగిన సూర్య మత్తుగా పడిపోతాడు మరోవైపు చారు సూర్యని కాంటాక్ట్ అవ్వాలని కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తుంటది సూర్య ఎంతకీ రెస్పాండ్ అవ్వకపోవడంతో చారు కార్ ని ఒక అరటిపండ్ల బండికి గుద్దుతుంది.  కార్ ఆగిపోయి ఇక  స్టార్ట్ అవ్వదు మరోవైపు ఎస్ఐ దయ కి కాల్ చేసి మీ అన్నయ్య ఇప్పుడే వచ్చాడు వెంటనే వెళ్ళిపోతాడు త్వరగా రండి అని ఫోన్ చేస్తూ ఉంటాడు దయ వెంటనే ఆటో ఎక్కి గుడి దగ్గరికి వెళ్తాడు కానీ దయ రావడానికి రెండు నిమిషాల ముందే కోర్మా టెంపుల్ నుంచి వెళ్ళిపోతాడు అలా లేట్ అవ్వాలనే చారు కార్ ని డాష్ ఇస్తుంది.  ఇక గుడిలో కూర్మా  మిస్ అవ్వడంతో ఖచ్చితంగా రాత్రి  11 గంటలకి పబ్ లో కూర్మా ని చంపాలని దయ ఫిక్స్ అవుతాడు. 

 కట్ చేస్తే కాళీ  సూర్యని చంపాలని సూర్య గురించి తన మనుషుల్ని ఎల్ఐసి ఆఫీస్ కి పంపిస్తాడు వాళ్ళని చూసిన సూర్య ఫ్రెండ్ వెంటనే శంకరం కి కాల్ చేసి నారాయణ చనిపోయాడు కాళీ సూర్యని చంపాలని  చూస్తున్నాడని చెప్తాడు.  వాళ్ళు ఇంటికి వస్తారని శంకరం తెలివిగా డోర్స్ అన్ని లాక్ చేసేసి ఇంట్లో ఎవరూ లేనట్టు క్రియేట్ చేస్తాడు కాళీ ఇంటికి వచ్చి చూస్తే తాళం వేసి ఉంటుంది. తన మనుషులను కొంతమందిని అక్కడే ఉండమని చెప్పి సూర్యని మిగిలిన ప్లేస్ లో వెతకాలని కాళీ వెళ్ళిపోతాడు కట్ చేస్తే భద్ర తొమ్మిదవ నెల ప్రెగ్నెంట్ గా ఉంటుంది కానీ ఆ విషయాన్ని మాత్రం సూర్యకి గాని తన నాన్నకి గాని చెప్పదు కనీసం తన నాన్నకైనా ప్రెగ్నెన్సీ విషయం గురించి చెప్పాలని భద్ర అదే రోజు ఇంటికి బయలుదేరుతుంది . 

అప్పుడు కాళీ  మనుషులందరూ కూడా పక్కనే టీ షాప్ లో ఉండి భద్ర వెళ్లడం చూస్తారు ఇంటికి తాళం వేయడంతో భద్ర వెంటనే శంకరం కి కాల్ చేస్తుంది బయట కాళీ  మనుషులు ఎవరూ లేరని తెలిసిన శంకరం వెంటనే వెనక డోర్ నుండి భద్రాని ఇంట్లోకి రమ్మంటాడు ఇక భద్ర ఇంట్లోకి రావడంతో తను ప్రెగ్నెంట్ అని అప్పుడు తెలుస్తుంది శంకరం కి నీ తమ్ముడి మీద ఉన్న కోపంతో నాకు కూడా ఈ విషయం చెప్పవా అని భద్రాని శంకరం అరుస్తుంటాడు కట్ చేస్తే కాళీ  మనుషులు కిటికీ అద్దాలు పగలగొట్టి అందరూ ఇంట్లోనే ఉన్నారని తెలుసుకొని డోర్స్ పగలగొట్టి మరి భద్ర మీద శంకరం మీద అటాక్ చేస్తుంటారు ఇక సూర్య ఆ టైం లో మత్తు నుండి మేల్కొని వాళ్ళందరినీ కొట్టి భద్రని హాస్పిటల్ లో జాయిన్ చేస్తారు అప్పటికే టైం రాత్రి 11:40 అయి ఉంటుంది ఇంకో 20 నిమిషాల్లో శనివారం అయిపోతుంది సో సూర్య వెంటనే పబ్బుకి  వెళ్తాడు అప్పటికే దయ కూర్మాని చంపాలని గన్ తో రెడీగా ఉంటాడు. 

 కానీ సూర్య తన మొహానికి ఒక మాస్క్ కట్టుకొని వచ్చి దయని కొట్టాలని చూస్తాడు అప్పుడు టైం 12 అయిపోవడంతో ఇక ఏం చేయలేక సూర్య వెనక్కి వెళ్ళిపోతాడు వీడేంటి కొట్టాలని వచ్చి టైం చూసి వెంటనే వెళ్ళిపోతున్నాడని దయ కి డౌట్ వస్తుంది తిరిగి వెళ్తున్న సూర్య కి ఫాజిల్ పబ్ లో పని చేయడం కనిపిస్తుంది ఫాజిల్ ఎప్పుడైనా సరే తనకు గడియారం కనిపిస్తే 10 నిమిషాలు ఫాస్ట్ గా పెడతాడు కదా సో టైం 11:50  అయిందని సూర్య కి అర్థమై వెళ్లి వెంటనే దయ మీద అటాక్ చేస్తాడు గన్ ఫైర్ అవ్వడంతో తనని చంపాలని చూస్తున్నారని కూర్మాకి అర్థమై పబ్ నుండి పారిపోతాడు ఇక సూర్య కి దయ కి ఫైట్ జరుగుతుంది సూర్య దయని బాగా కొట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సూర్య మొహానికి మాస్క్ ఉండడంతో తనని కొట్టింది ఎవరో దయ కి అసలు తెలియదు ఆ ఫైట్ అంతటిని పబ్ లో పనిచేసే సోకులపాలెంలో ఉండే వ్యక్తి గమనించి మనలో ఒకడు నిజంగానే దయని కొట్టాడని వెళ్లి అందరికీ విషయాన్ని చెప్తాడు ఆ ఒక్క ఇన్సిడెంట్ వల్ల అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. 

 కట్ చేస్తే సీన్ హాస్పిటల్ లో ఓపెన్ అవుతుంది భద్ర శంకరంతో ఇలా గొడవలు జరిగి పుట్టబోయే బిడ్డకి ఏదైనా అవుతుందని  నేను ఇన్ని రోజులు ఈ విషయాన్ని మీకు చెప్పలేదు పుట్టబోయేది అమ్మనే అనుకుంటున్నారు కదా. ఆ అమ్మ కోసం అయినా సరే ఈ శనివారం కూడా గొడవలు పడే కాన్సెప్ట్ ని వదిలేసి గొడవలకు పూర్తిగా దూరం అయితేనే నేను ఇంటికి వస్తానని భద్ర అంటుంది.  సూర్య తన అక్క కోసం ఇంకా గొడవలకు దూరంగా ఉండాలని ఫిక్స్ అవుతాడు మరోవైపు కూర్మా  దయని వెతికి తీసుకురమ్మని తన మనుషులకు చెప్తాడు సూర్యకి నారాయణ శ్రద్ధాంజలి పోస్టర్స్ కనిపించి వెళ్లి నివాలి అర్పిస్తాడు సూర్య అలా రావడంతో కాళీ  కూడా పగని మర్చిపోయి కూల్ అయిపోతాడు 

కట్ చేస్తే కూర్మా మనుషులు దయని వెతికి పట్టుకొని తెస్తారు కానీ ఇక్కడ జోక్ ఏంటంటే వేరే ఎవడో తనని చంపాలని చూస్తే దయ తనని కాపాడాడని కూర్మా అనుకొని నీకు నీ ల్యాండ్ ఇచ్చేస్తా నువ్వు నాతో ఉండు తమ్ముడు కానీ నన్ను చంపాలని చూసిన వాడిని నిన్ను కొట్టిన వాడిని మాత్రం అసలు వదలద్దని అంటాడు.  కూర్మాకి అసలు విషయం తెలియదని దయ ఫుల్ ఫ్రీ అయిపోతాడు ఇక దయ సేఫ్ గా స్టేషన్ కి వెళ్లి రాజుని వదిలేస్తాడు దయ అలా సేఫ్ గా స్టేషన్ కి రావడంతో చారు దయని చూసి వెంటనే సూర్యకి కాల్ చేసి మనం అనుకున్నది ఏదీ అవ్వలేదు దయ కూర్మా  ఇద్దరు కలిసిపోయి ఇప్పుడు నీ గురించి వెతుకుతున్నారని అంటుంది ఇక దయ అసలు తనని కొట్టిన వాడు ఎవడు వాడి గడియారం చూసి ఎందుకు ఆగిపోయాడు అని ఆలోచించడం స్టార్ట్ చేసి ఎంక్వయిరీ చేస్తే ఆ గడియారం 10 నిమిషాలు ఫాస్ట్ గా ఉందని తెలుస్తుంది ఎంతైనా క్రిమినల్ బ్రెయిన్ ఉన్న పోలీస్ కదా ఈజీగా డీకోడ్ చేసేసి వాడెవడో శనివారం మాత్రమే కొట్టేలా ఉన్నాడు ఏ ఏ స్టేషన్స్ లో శనివారం కొట్టిన కంప్లైంట్స్ ఉన్నాయో చూడమని ఎస్ఐ..ఐ సుధాని పంపిస్తాడు ఎక్కడ ఏ కంప్లైంట్స్ రావు కానీ అదే టైం లో శనివారం తనని ఎవడో కొట్టాడని కంప్లైంట్ ఇవ్వడానికి సూర్య దయా పని చేసే స్టేషన్ కే వస్తాడు. ఒక వేల దయ చేసే ఎంక్వయిరీలో సూర్య గురించి నిజం తెలిస్తే వాళ్ళ అక్కకి ప్రాబ్లం అని దయ నుండి తప్పించుకోవాలని సూర్య అలా చేస్తాడు. దయ కి ఫస్ట్ సూర్య మీద కొంచెం డౌట్ వస్తుంది వీడే ఆ రోజు కొట్టి మళ్ళీ వీడే కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాడా అని అనుకుంటాడు.  వెంటనే దయ సూర్యని లాక్కెళ్లి సెల్ లో వేసి కొట్టబోతాడు కానీ సూర్య మాత్రం ఏం మాట్లాడకుండా సార్ కొట్టొద్దు సార్ అని అరుస్తాడు. సూర్య ఇంత పిరికిగా ఉండడంతో వీడు నన్ను కొట్టిఉండడు  అని దయ డౌట్ క్లియర్ అయిపోతుంది. 

 దయ సూర్యని నిన్ను కొట్టిన వాడిని గుర్తుపడతావా అని అడుగుతాడు దానికి సూర్య వాడు ముసుగు వేసుకుని ఉన్నాడు సార్ వాడు కళ్ళు చూస్తే గుర్తుపడతానని అంటాడు ఇక దయ సూర్య డీటెయిల్స్ తీసుకోమని చారుకి చెప్తాడు కానీ ఇక్కడ సూర్య అండ్ చారు ఇద్దరు లవర్స్ అని మాత్రం దయ కి తెలియదు కట్ చేస్తే దయ కొంతమంది అనుమానితుల్ని  స్టేషన్ కి తెచ్చి సూర్య కి కాల్ చేయమని చారుకి చెప్తాడు చారు సూర్య నేమ్ ని బాటిల్ క్యాప్ అని సేవ్ చేసి ఉంటుంది అలా సేవ్ చేసి ఉండడాన్ని దయ చూస్తాడు ఇక దయ సూర్యని పిలిచి అనుమానితుల్ని  చూపిస్తే వాళ్ళు ఎవరూ కాదని సూర్య చెప్తాడు. 

 కట్ చేస్తే యాక్చువల్ గా కూర్మా మీద అటాక్ జరిగిన శనివారం తను ఢిల్లీలో ఉండాలి కానీ సూర్య కూర్మా ని 25 వ  యానివర్సరీ కి గెస్ట్ గా తీసుకెళ్లడంతో కూర్మా  ఢిల్లీ వెళ్ళే ప్లాన్ క్యాన్సిల్ అవుతుంది సో ఆ సూర్యానే నన్ను చంపాలని చూసినట్టు ఉన్నాడని కూర్మాకి డౌట్ వచ్చి సూర్యని బంధిస్తాడు మరోవైపు వాడు ఎవడో తెలిసిందని సుధా దయకి ఒక ఫోటో చూపిస్తాడు ఇక దయ వాడి కోసం వెళ్తుంటే కూర్మా దయకి కాల్ చేసి అటాక్ చేసిన వాడు దొరికాడు ఫాస్ట్ గా రమ్మని పిలుస్తాడు దయ అక్కడికి వెళ్లి చూస్తే అతను ఎవరో కాదు సూర్యని వాళ్ళు బంధించి ఉంటారు ఇక దయ సూర్యని విడిపించి వీడే మనకి అటాక్ చేసిన వాడిని చూపించాల్సింది నీ మీద అటాక్ చేసింది వీడు కాదు నీ మీద అటాక్ చేసింది సోకులపాలెం లోని ఒకడు అని అంటాడు ఇంతకు ముందు సుధా దయకి ఒక ఫోటో చూపిస్తాడు కదా ఆ ఫోటోలో ఏముంటుందంటే సోకులపాలెం వాళ్ళందరికీ ధైర్యం రావాలని సూర్య ఒకరోజు రాత్రి వెళ్లి గోడ మీద రాస్తాడు కదా నా సహనం నశించింది మీలో ఒకడిగా నేను దయకి ఎదురు తిరుగుతున్నానని ఆ మేటర్ ఉన్న ఫోటోని సుధా చూపిస్తాడు. 

ఆ అటాక్ చేసింది కచ్చితంగా సోకులపాలెం వాడే అని దయ అనుకుంటాడు ఇక దయ సూర్యని తీసుకొని సోకులపాలెంలోనికి వెళ్లి అందరిని పిచ్చి పిచ్చిగా కొడుతుంటాడు కానీ వాళ్ళలో ఎవరూ కూడా అటాక్ చేసిన వాడు కాదు అని సూర్య చెప్తాడు కొంతమంది బయట ఊర్లకు పనికి వెళ్లారని తెలిసి టు డేస్ లో వాళ్ళు తిరిగి రావాలని దయ అందరికీ వార్నింగ్ ఇస్తాడు కట్ చేస్తే సూర్య జరిగిందంతా కూడా వాళ్ళ నాన్నకి చెప్తాడు అప్పుడు శంకరం సూర్య పరిస్థితిని ని అర్థం చేసుకుని నువ్వు వాళ్ళలో ధైర్యం నింపాలని ఈ పని స్టార్ట్ చేసావ్ దాన్ని మధ్యలోనే ఆపేస్తే ఎలా మరి నిజమైన కోపం అంటే నీ కోపం వల్ల నలుగురు భయపడడం కాదు నలుగురికి ధైర్యం రావడం ఈ మాటలే మీ అమ్మ నీకు చివరగా చెప్పాలనుకుందేమో అని అంటాడు. 

 కట్ చేస్తే సూర్య చారు తో కలిసి సోకులపాలెం  వెళ్లి ఆ శనివారం రోజు మీలో ఒకడు దయ ని  కొట్టాడు.  ఆ కొట్టిన వాడికి భయం ఉండాలి మీరందరూ భయపడాల్సిన అవసరం లేదు మీరు కాస్త ధైర్యంగా ఉండండి ఎలాగైనా సరే వాడిని మనం పట్టించేద్దామని అంటాడు కానీ వాడిని పట్టిస్తే దయ వాడిని చంపేస్తాడు వాడి వల్ల మాలో కాస్త ధైర్యం వచ్చింది వాడు మా కోసం ఒక అడుగు ముందుకు వేసాడు మేము కూడా వాడి కోసం ఒక అడుగు ముందుకు వేస్తామని రాజన్న అంటాడు ఆ మాటలకి వీళ్ళలో కాస్త మార్పు వచ్చిందని సూర్య అండ్ చారు హ్యాపీగా ఫీల్ అవుతారు కట్ చేస్తే కూర్మా  దయ దగ్గరికి వెళ్లి అసలు నా మీద అటాక్ జరగబోతుందని నీకెలా తెలుసు నువ్వు ఎలా అక్కడికి వచ్చావు అని అడుగుతాడు. 

 దానికి దయ నిన్ను ఎప్పుడూ నేను గమనిస్తూ నిన్నుకాపాడుకుంటూనే ఉంటున్నాను అని చెప్తాడు ఆ మాటలకి కూర్మా కాస్త ఎమోషనల్ అయ్యి దయని హగ్ చేసుకొని వెళ్ళిపోతాడు అప్పుడు దయ కి ఒక డౌట్ వస్తుంది.  అసలు మనం పబ్ కి వెళ్లి కూర్మా  మీద అటాక్ చేస్తామని గుడి లో  ప్లాన్ మిస్ అయ్యే వరకు మనం కూడా డిసైడ్ అవ్వలేదు అలాంటిది పబ్ లో మనం అటాక్ చేస్తున్నామని వేరే వాడికి ఎలా తెలిసిందని ఆలోచిస్తాడు ఆ రోజు టెంపుల్ కి లేట్ అయింది చారు వల్ల మన ప్లాన్ గురించి చారుకి కూడా తెలుసు తనే లీక్ చేసి ఉంటుందని డౌట్ వస్తుంది.  తను సూర్య పేరుని తన సెల్ లో బాటిల్ క్యాప్ అని సేవ్ చేసుకుని ఉంటుంది సో వీళ్ళిద్దరి మధ్య ఏదో లింక్ ఉందని దయ కి డౌట్ వచ్చి తనని కొట్టింది కూడా సూర్యనే అని డౌట్ పడతాడు ఇక ఫైనల్ గా వీళ్ళిద్దరూ కలిసే ఇదంతా చేస్తున్నారని దయ ఫిక్స్ అవుతాడు అప్పుడే అక్కడికి కూర్మా రావడంతో దయ కూర్మా దగ్గరికి వెళ్లి ఆ సూర్య గాడే ఇదంతా చేశాడని చెప్తాడు కానీ కూర్మా అప్పటికే పబ్ లో ఉన్న సిసి టీవీ ని చెక్ చేయడంతో తనని చంపాలని చూసింది దయనే అని తెలుసుకుంటాడు. కూర్మా  దయని షూట్ చేయాలని గన్ తీస్తాడు కానీ దయ కూర్మాని షూట్ చేసి చంపేసి ఆ సూర్యనే శనివారం అటాక్ చేశాడని వాడే అన్నని  చంపేసి వెళ్ళాడని గోవర్ధన్ కి మిగిలిన అందరినీ నమ్మిస్తాడు. 

 కట్ చేస్తే దయ చారు ఇంటికి వెళ్లి తనని కొడుతూ సూర్యకి కాల్ చేసి నా నాకంతా తెలిసిపోయింది రా నీ గర్ల్ ఫ్రెండ్ ఇంటికి రారా అని అంటాడు. సూర్య చారు ఇంటికి వెళ్తాడు అయితే అక్కడ సూర్యకి చారు అమ్మ కనిపిస్తుంది ఆమె తన అత్తయ్య అని చారునే తన మరదలు కళ్యాణి అని సూర్యకి అప్పుడే తెలుస్తుంది మళ్ళీ దయ సూర్యకి కాల్ చేసి సోకులపాలెంలో ఉన్న రారా అని అంటాడు సూర్య సోకులపాలెం వెళ్ళేసరికి దయ చారుని కొట్టి కింద పడేసి ఉంటాడు ఆ రోజు కూడా శనివారమే కానీ దయ సూర్యని ఎంత కొడుతున్నా కూడా ఆ రోజు శనివారమే అయినా కూడా సూర్య దయ మీద చెయ్యి చేసుకోడు అప్పటికే చారుకి బాగా బ్లీడింగ్ అవుతుంటుంది  దయా సూర్య తో తనని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అంటే ఈ సోకులపాలెం వాళ్ళకి నువ్వేదో ధైర్యం ఇచ్చావు కదా ఒక్కడైనా తలుపు తీసి బయటికి వస్తే చారుని నేనే హాస్పిటల్ కి తీసుకెళ్తా వాళ్ళని బయటికి పిలువు  అని అంటాడు ఇక సూర్య వెళ్లి రాజన్నని మిగిలిన వాళ్ళందరినీ ప్లీజ్ బయటికి రండి అని బతిమిలాడుతాడు కానీ దయా  మీద ఉన్న భయంతో ఎవరు బయటికి రారు. 

 ఇక దయా అందరినీ బయటికి పిలిచి వీడే ఆ శనివారం గాడని  అందరికీ చెప్పి మళ్ళీ సూర్యని కొడుతుంటాడు ఆ టైం లో శంకర్ అక్కడికి వస్తాడు శంకర్ దయ తో సూర్య యొక్క శనివారం  కాన్సెప్ట్ గురించి పూర్తిగా చెప్తాడు. సూర్య అక్క కూడా సూర్య పరిస్థితి ని అర్థం చేసుకుని వెళ్లి సోకులపాలెం వాళ్ళని కాపాడమని చెప్పి  ఉంటుంది అయినా కూడా సూర్య ఎందుకు దెబ్బలు తింటున్నాడో తెలుసా ఈ సోకులపాలెంలో ఒక్కడైనా సరే ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయాలని సూర్య ఎదురు చూస్తున్నాడు వీళ్ళలో ఒక్కడు ముందుకు అడుగు వేసినా సరే నీ పని అయిపోతుందని  శంకర్ దయా తో అంటాడు .  సూర్యలో ఉన్న ఆ కోపం బయటికి రావాలంటే ఒక్కడైనా ముందుకు రావాలా సరే అని దయ ఒక పాపని లాక్కొచ్చి ఆ పాపని తొక్కి చంపితే ఒక్కడైనా ముందుకు వస్తాడని ఆ పాపని తొక్కబోతాడు కానీ సూర్య మాత్రం దయా కాలిని ఆపుతుంటాడు కానీ దయా ని కొట్టడు.  కాసేపటికి రాజన్న ధైర్యం తెచ్చుకొని మోకాళ్ళ మీద నుండి పైకి లేచి వచ్చి దయని కొడతాడు ఇక  ఇది చాలు అని సూర్య దయాని బాగా కొడతాడు ఇక సోకులపాలెం వాళ్ళు సూర్య అందరూ కలిసి దయా  మీద అతని మనుషుల మీద బాగా అటాక్ చేసి దయాని బాగా కొడతారు చివరికి దయ కూర్మాని చంపాలని చూసిన ఆ సిసిటీవీ ఫుటేజ్ ని సూర్య గోవర్ధన్ కి చూపించడంతో ఇక గోవర్ధన్ దయాని చంపేస్తాడు ఇక్కడితో మూవీ  అయిపోతుంది.

                                                                                              :::::శుభం :::::

FOR MORE MOVIE STORIES WEBSERIES STORIES Please visit our Website: Filmywebstories.com

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

teTelugu
Scroll to Top