సత్యం సుందరం (Satyam Sundaram) Full Movie Explanation

Satyam Sundaram 2024 Movie

హాయ్ ఫ్రెండ్స్ Welcome to FilmyWebstories.com సెప్టెంబర్ 28 2024 లో రిలీజ్ అయినటువంటి సత్యం సుందరం అనే ఫీల్ గుడ్ డ్రామా మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం.

మూవీ స్టార్ట్ అవ్వగానే మన హీరో సత్యని (అరవింద స్వామి) చూపిస్తారు సత్య ఫ్యామిలీ సడన్ గా వాళ్ళు ఉంటున్న ఊరిని వదిలేయాల్సి వస్తుంది సొంత మనుషులే సత్య వాళ్ళ నాన్న ని మోసం చేసి ఆస్తి మొత్తం కొట్టేస్తారు.  సో ఇప్పుడు వాళ్ళు ఉంటున్న ఇంటితో సహా అన్నీ ఇచ్చేసి ఊరు వదిలేసి వెళ్ళడానికి రెడీగా ఉంటారు మళ్ళీ ఈ ఊరికి వస్తానో లేదో అని సత్య అనుకొని తన సైకిల్ ని తీసుకొని ఊరంతా తిరుగుతూ నచ్చిన ప్రదేశాలకి వెళ్లి చివరి సారిగా వాటిని చూసుకొని చాలా ఎమోషనల్ అయ్యి ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో వాళ్ళ బాబాయ్ కూతురు కనిపిస్తుంది తనంటే సత్యకి చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి సొంత చెల్లి లాగా చూసుకుంటాడు ఇప్పుడు సడన్ గా వదిలేసి వెళ్ళాలంటే సత్యకి చాలా బాధేస్తుంది ఇక వాళ్ళ ఇంటికి లాక్ వేసి బయటికి వచ్చేస్తారు. అన్నీ ప్యాక్ చేసుకుంటారు కానీ సత్య తన సైకిల్ ని తీసుకెళ్లకుండా ఎవరికైనా ఇచ్చేయమని చెప్తాడు .  కట్ చేస్తే చాలా సంవత్సరాలు గడిచాక సత్యని చూపిస్తారు. ఇప్పుడు సత్యకి మ్యారేజ్ అయిపోయి ఒక పాప కూడా ఉంటుంది మనోడు ఫ్యామిలీ తో చాలా హ్యాపీగా ఉంటాడు

అతని భార్య చాలా సపోర్టివ్ గా ఉంటూ సత్యని బాగా చూసుకుంటుంది సత్య పిల్లలకి క్రికెట్ కోచింగ్ ఇస్తూ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉంటాడు సత్య లైఫ్ లో అన్ని బాగానే ఉంటాయి కానీ సత్య ఇన్ని సంవత్సరాలు కష్టపడినా కూడా సొంత ఇల్లు కొనుక్కోలేకపోతాడు సత్యకి పక్షులన్న జంతువులన్న చాలా ఇష్టం వాటిని తన ఇంట్లోనే పెంచుకుంటాడు అలా ఒక రోజు సత్య తను పుట్టిన ఊరికి వెళ్లాల్సి వస్తుంది. సత్య బాబాయ్ కూతురి పెళ్లి అని చెప్పేసి మనోడికి శుభలేఖ వస్తుంది. తనంటే సత్య కి చాలా ప్రాణం కాబట్టి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తాడు అప్పుడు అతని వైఫ్ వచ్చి వెళ్ళమని చెప్తుంది చూడండి మీకు కూడా ఒక కూతురు ఉంది కదా ఇప్పుడు మీరు ఆ పెళ్లికి వెళ్తేనే వాళ్ళు కూడా మన కూతురు పెళ్లికి వస్తారు చెప్పేది అర్థమవుతుందా అందుకే వెళ్ళండి అని చెప్తుంది సరే వెళ్తున్నా అని చెప్పి వాళ్ళ నాన్న  దగ్గరికి వెళ్లి నాన్న నేను చెల్లి పెళ్లికి వెళ్తున్నా మన ఇంట్లో నుండి ఎవరో ఒకరు వెళ్ళాలి కదా అందుకే  నేనే వెళ్తున్నా అని చెప్తాడు.  ఇంత తొందరగా ఎందుకు వెళ్తున్నావ్ మధ్యాహ్నం వెళ్లొచ్చు కదరా అని అడిగితే అంటే అది ముందే వెళ్తే ఊరు మొత్తం చూడొచ్చు కదా అందుకే వెళ్తున్నానని చెప్పి ట్రైన్ ఎక్కేసి వాళ్ళ ఊరికి స్టార్ట్ అవుతాడు. 

 మనోడు చాలా సంవత్సరాల తర్వాత సొంత గడ్డ మీద అడుగు పెడతాడు చిన్నప్పటికి ఇప్పటికి చాలా మారిపోవటం చూసి కొంచెం డిసప్పాయింట్ అవుతాడు కానీ వాళ్ళ ఊర్లో ఉన్న టెంపుల్ ఎలిఫెంట్ అలాగే ఉంటాయి కనీసం వీటినైనా చూశానని హ్యాపీగా ఉంటాడు అప్పుడే తన వైఫ్ కాల్ చేస్తుంది సత్య తనతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తూ చూడవే మనం ఉంటున్న ఇంటిని మనమే కొనేసి ఇస్తే ఎలా ఉంటుంది ఓనర్ తో మాట్లాడి ఇల్లు కొందాం అనుకుంటున్నాను అని చెప్తాడు అది వినగానే తను చాలా సంతోషిస్తుంది.

 ఆ తర్వాత సత్య తన చెల్లెలి రిసెప్షన్ కి వెళ్తాడు సత్యని గుర్తుపట్టి చాలా మంది వచ్చి పలకరిస్తూ ఉంటారు వాళ్ళని చూడగానే సత్యకి చాలా మెమరీస్ గుర్తుకొచ్చి ఎమోషనల్ అవుతాడు అప్పుడే ఒక వ్యక్తి వచ్చి సత్య కళ్ళు మూసి నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం అని కొన్ని క్లూస్ ఇస్తాడు అయినా కూడా సత్యకి అతను ఎవరో గుర్తుకు రాదు.  అప్పుడు అతను నేను మీ అమ్మ తరపున బంధువుని అని చెప్తాడు అయినా కూడా సత్య గుర్తుపట్టడు ఇక లాభం లేదనుకుని అతను సత్య ముందుకు వచ్చి ఫేస్ చూపిస్తాడు  వీడే మన సుందరం (కార్తీ) . 

సుందర్ ని చూసి సత్య ఎవడు వీడు నా వెంట పడ్డాడు అని అనుకుంటాడు అప్పుడు సుందర్ సత్యని బావ బావ అని పిలుస్తూ ఎప్పుడైనా నన్ను గుర్తుపట్టారా అని అడిగితే హా! గుర్తొచ్చింది అని అబద్ధం చెప్తాడు హమ్మయ్య ఇప్పుడైనా గుర్తుపట్టారు కదా అదే నాకు సంతోషం అని సుందర్ చాలా హ్యాపీగా ఉంటాడు అప్పుడు సత్య టాయిలెట్ కి వెళ్ళాలి బాత్రూమ్ ఎక్కడ ఉన్నాయని సుందర్ ని అడిగితే చూడు బావ నీ కోసమే నేను మార్నింగ్ నుండి బాత్రూమ్ కి కూడా వెళ్ళలేదు నాకు కూడా వస్తుంది పదా ఇద్దరం కలిసి పోసుకుందాం అని చెప్పి తీసుకెళ్తాడు బాత్రూమ్ కి వెళ్ళాక సుందర్ చిన్న జ్ఞాపకాన్ని మళ్ళీ గుర్తుకు చేస్తాడు అయినా కూడా సత్యకి ఏమీ గుర్తుకు రాదు పాపం వీడేమో పిచ్చోడిలా ప్రతి క్షణం ఏదో ఒకటి గుర్తుకు చేస్తూనే ఉంటాడు సత్య వాడి మాటలు పట్టించుకోకుండా సైలెంట్ గా వాళ్ళ మామ దగ్గరికి వెళ్ళిపోతాడు అతను సత్యని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఏరా సత్య ఎన్ని సంవత్సరాలు అయింది రా నిన్ను చూసి అమ్మ నాన్న బాగున్నారా అని అడిగితే హా మామ అందరూ బాగున్నారని చెప్తాడు సరే సరే మిమ్మల్ని మోసం చేసి మీ ఆస్తిని లాక్కున్న

వాళ్ళు ఈ పెళ్లికి వచ్చారు వాళ్ళు కనిపిస్తే పట్టించుకోకు సరేనా అని చెప్తే సరే మామ వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకులే గాని ఇందాక నాతో పాటు తిరిగిన వ్యక్తి ఎవరు అని సుందర్ గురించి అడుగుతాడు ముసలాయన సుందర్ గురించి చెప్పకుండా ఏదో వాగుతూ ఉంటాడు. 

 అప్పుడే సుందర్ వచ్చి వాళ్ళతో కూర్చొని ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడు సత్య నేను ఈరోజు రాత్రి  వెళ్ళిపోతున్నా నన్ను బస్సు ఎక్కిస్తావా అని సుందర్ ని అడిగితే సరే బావ నేను ఉన్నాను కదా నేను చూసుకుంటానులే అని చెప్తాడు.  ఆ తర్వాత సత్య వెళ్లి తన చెల్లిని కలుస్తాడు తను సత్యని చూసి చాలా ఎమోషనల్ అవుతుంది ఇక సత్య తన కోసం ప్రేమగా తెచ్చిన గిఫ్ట్ ని ఇస్తాడు తను అక్కడే ఓపెన్ చేసి చూస్తుంది అందులో గాజులు కాళ్ళ పట్టీలు ఉంటాయి వాటిని ఇప్పుడే పెట్టమని సత్యని అడుగుతుంది సత్య తనకి పెడుతూ ప్రేమతో కన్నీళ్లు వచ్చేస్తాయి ఆ తర్వాత అందరూ  కలిసి తినడానికి వెళ్తారు అక్కడే సత్యకి వాళ్ళ ఇంటిని లాక్కున్న మనుషులు కనిపిస్తారు వాళ్ళని చూసి తినడం ఆపేసి వెళ్ళిపోదాం అనుకుంటాడు కానీ సుందర్ వెళ్ళనివ్వకుండా సత్యని కూల్ చేయడానికి చాలా ట్రై చేస్తాడు. అయినా కూడా సత్యకి కోపం తగ్గదు అప్పుడు సుందర్ సత్యని ఫోన్ నెంబర్ ఇవ్వమని అడుగుతాడు సరే తీసుకో అని చెప్పి రాంగ్ నెంబర్ చెప్తాడు అలాగే తన నెంబర్ కూడా రాసి సత్యకి ఇచ్చేస్తాడు ఆ తర్వాత బాగా తినేసి బయటికి వచ్చి సత్య తన వైఫ్ కి కాల్ చేసి నేను ఇంటికి కి బయలుదేరుతున్నా అని చెప్తాడు అవునా ఇప్పుడే వచ్చేస్తున్నారా మీ మాటలు వింటుంటే చాలా హ్యాపీగా ఉన్నట్టున్నారు ఇంకా రెండు మూడు రోజులు అక్కడే ఉండొచ్చు కదా అని తనంటే వామ్మో నేను ఉండను వచ్చేస్తున్నా అని చెప్తున్నప్పుడు ఫోన్ లో సుందర్ మాటలు వినిపిస్తాయి అతను ఎవరో సత్య అంత గట్టిగా మాట్లాడుతున్నారు అని తన వైఫ్ అడిగితే వాడెవడో నాకు కూడా తెలియదు ఎప్పుడు చూసినా బావ బావ అంటూ నా వెంటే తిరుగుతున్నాడు వాడికి నేను ఎవరో తెలుసంట కానీ వాడెవడో నాకు తెలియదు వాడికి నిజం చెప్తే ఏమైపోతాడు అని అబద్ధం చెప్పాను అయినా ఇప్పుడు ఇంటికి వచ్చేస్తున్న కదా వాడు ఎవడైతే నాకేంటిలే అని చెప్తాడు అప్పుడే అక్కడికి సుందర్ వచ్చి ఎవరి బావ ఫోన్ లో అక్క మాట్లాడేది నాకు కూడా ఫోన్ ఇవ్వు నేను మాట్లాడతా అని చెప్పి ఫోన్ తీసుకొని మాట్లాడుతూ హాయ్ అక్క బాగున్నారా నేను ఎవరో మీకు తెలియదు కానీ నేను బావకి బాగా తెలుసు నా గురించి బావని అడిగి తెలుసుకోండి సరేనా అని చాలా విషయాలు మాట్లాడుతాడు మనోడు సోది మాట్లాడడం చూసి రేయ్ బస్సు కి టైం అవుతుంది రా త్వరగా వెళ్ళాలి ఫోన్ కట్ చేయమని చెప్తాడు సరే అని చెప్పి కట్ చేసి సత్యాన్ని బండి మీద బస్ స్టాప్ కి తీసుకెళ్తూ ఉంటాడు దారి మధ్యలో ఒక టీ స్టాల్ దగ్గర ఆపి బావ ఇక్కడ టీ చాలా బాగుంటుంది ఒకసారి తాగుదాం అని చెప్పి తీసుకెళ్తాడు టీ తాగుతున్నప్పుడు ఒక బస్సు వెళ్ళిపోతుంది ఆ బస్సు వెళ్ళిపోయాక సత్యని బస్ స్టాప్ దగ్గరికి తీసుకెళ్తాడు కానీ అక్కడ ఒక్క బస్సు కూడా ఉండదు లాస్ట్ బస్సు కూడా వెళ్ళిపోతుంది

 ఈ విషయం సత్య కి తెలిసి సుందర్ పై చాలా కోపం వచ్చి రేయ్ ఇప్పుడు ఎలాగో బస్సు లేదు కదా నన్ను ఏదైనా లాడ్జి లో డ్రాప్ చెయ్ ఈరోజు రాత్రి  అక్కడే స్టే చేస్తా అంటాడు లాడ్జ్ ఎందుకు బావ మన ఇల్లు ఉంది కదా మన ఇంట్లో ఉండమని అడుగుతాడు లేదు నేను మార్నింగ్ బస్ కి వెళ్ళిపోవాలి నాకు లాడ్జ్ ఎక్కడ ఉందో చెప్పు నేనే వెళ్ళిపోతానని చెప్తాడు లేదు బావ నేను చెప్పను నువ్వు మా ఇంట్లోనే

ఉండాలని అడుగుతాడు రేయ్ నువ్వు చెప్తే చెప్పు లేకపోతే నేనే ఊరంతా తిరిగి వెతుక్కుంటా అని చెప్పగానే వద్దు బావ అంత శ్రమ నీకెందుకు నేనే చూపిస్తాను పదా అని చెప్పి తీసుకెళ్తాడు అలా వెళ్తున్నప్పుడు సత్య సుందర్ ని చాలా తిడతాడు రేయ్ నేను టీ కావాలని అడిగానారా నీ వల్ల నా బస్సు మిస్ అయిపోయింది కదరా అని చెప్పి చాలా బాధపడతాడు ఇక సుందర్ అతన్ని లాడ్జ్ కి తీసుకెళ్లి వదిలేస్తాడు కానీ అక్కడ ఉన్న లాడ్జీలు చాలా దారుణంగా ఉంటాయి అసలు ఉండడానికి నీట్ గా ఉండవు ఇక వేరే దారి లేక సుందర్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు సత్య వాళ్ళ ఇంటికి రాగానే సుందర్ అలాగే అతని వైఫ్ చాలా మర్యాదలు చేస్తారు బావ మీకు ఏం కావాలన్నా చెప్పండి నా వైఫ్ అదే నీ చెల్లి

అన్నీ చేసి పెడుతుంది సరేనా ఏదైనా అడగండి అని చెప్తాడు పర్లేదురా ఇందాక తినేసి వచ్చాం కదా పొట్ట చాలా టైట్ గా ఉంది ఇప్పుడేం వద్దులే సరేనా అని చెప్పి స్నానం చేయడానికి బాత్రూమ్ లోకి వెళ్తాడు సుందర్ సత్య దగ్గరికి వెళ్లి ఏంటి బావ నీతో పాటు నీ బ్యాగ్ కి కూడా స్నానం చేపిస్తావా బ్యాగ్ ఎందుకు తీసుకెళ్ళావు అని అడిగితే రేయ్ బ్యాగ్ లోనే టవల్ డ్రెస్సులు ఉన్నాయిరా అందుకే తీసుకొచ్చానంటే ఏంటి బావ మా ఇంట్లో ఉన్న టవల్ వాడరా ఏంటి మీరు ఇక్కడే ఉండండి నేను ఒక కొత్త టవల్ తీసుకొస్తాను వస్తా అని చెప్పి వెళ్తాడు సుందర్ ని చూసి సత్యకి పిచ్చి లేస్తుంది మరి ఇలా తగులుకున్నాడు ఏంటిరా బాబు అనుకుంటాడు. 

 సత్య స్నానం చేశాక ఆ ఇల్లు మొత్తం తిరిగి చూస్తాడు అక్కడే వాళ్ళ స్కూల్ ఎన్ సిసి ఫోటో కనిపిస్తుంది దాన్ని చూడగానే ఏదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది ఆ తర్వాత సుందర్ దగ్గరికి వెళ్తాడు సుందర్ సత్య కోసం బీర్ రెడీ చేసి పెడతాడు ఇక ఇద్దరు కలిసి బీర్ తాగుతూ మాట్లాడుకుంటూ ఉంటారు రేయ్ మీ ఇల్లు చాలా బాగుంది నువ్వు ఇక్కడే పుట్టావా అని సత్య అడిగితే లేదు బావ నేను పుట్టిన ఇల్లు నువ్వు చూస్తే అటు నుంచి అటే వెళ్ళిపోతావు అలా ఉంటుంది ఇది నా భార్య ఇల్లు నేనే చాలా చాలా కష్టపడి తన పేరు మీద రాయించాను ఈ ఇల్లు మొదట  మా మామ పేరు మీద ఉండేది  ఇప్పుడు తన పేరు మీదకి వచ్చింది అదే సంతోషం ఇక్కడికి రాగానే మాకు అంత మంచే జరిగింది.  ఇప్పుడు తను ప్రెగ్నెంట్ తో ఉందని చెప్తాడు అవునా అరే నాకు తెలియదురా తెలిసి ఉంటే విష్ చేసేవాడిని అని చెప్తాడు పర్లేదు బావ తను ప్రెగ్నెంట్ అయ్యి మూడు నెలలు  అవుతుంది కదా అందుకే పొట్ట ఇంకా పెరగలేదని చెప్తూ అలా మందేస్తూ పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తారు. 

 ఆ తర్వాత సత్యకి ఒక ఎద్దుని పరిచయం చేస్తాడు చూడు బావ వీడిని నేను ఒక సంతలో చూసి తెచ్చుకున్నాను వీడు చాలా బక్కగా ఉండేవాడు నేనే తిండి పెట్టి ఇలా చేశాను అలాగే వీడికి కోపం కూడా చాలా ఎక్కువే ఎప్పుడూ ఎవరినో ఒకరిని పొడుస్తూ ఉండేవాడు వెంటనే వీడిని మన పెద్ద నాన్నకి చూపించాను ఆయనే వీడికి చాలా ట్రైనింగ్ ఇచ్చి షార్ప్ గా రెడీ చేశాడు ఒకరోజు ఎద్దుల పోటీలు ఉంటే వీడిని తీసుకెళ్లాం వీడు మామూలుగా ఫైట్ చేయలేదు వీడి కొమ్ములతో ఒక్కొక్కడిని విసిరి పడేశాడు అలా చాలా పోటీలకి వీడిని తీసుకెళ్లాను ఎక్కడికి వెళ్ళినా వీడే గెలిచేసేవాడు వీడితో పాటే వీడి ఓనర్ నైన నాకు కూడా మంచి పేరు ఇంకా చాలా ప్రైసెస్ వచ్చాయని చెప్తాడు అప్పుడే సుందర్ వైఫ్ కాల్ చేసి సత్యతో మాట్లాడుతూ అన్న మీరు ఉంటున్న ప్లేస్ అంత సేఫ్ కాదు అక్కడ చాలా పాములు  ఉన్నాయని చెప్తుంది అది వినగానే సత్య చాలా భయపడిపోతూ ఒరేయ్ ఎదవ ఇక్కడ పాములు ఉన్నాయని ముందే చెప్పొచ్చు కదరా ఎందుకు చెప్పలేదురా అని అడిగితే ఊరుకోండి బావ అవి మన పాములే నేనే పెంచుకుంటున్నా రీసెంట్ గా వాడికి పిల్లలు కూడా పుట్టాయని చెప్తాడు ఒరేయ్ ఎవడైనా పిల్లల్ని కుక్కల్ని పెంచుకుంటాడు నువ్వేంట్రా పాముల్ని పెంచుకుంటున్నావ్ అని అడిగితే అదేంటి బావ అలా అంటావ్ నేను నా భార్య ఈ ఇంట్లో ఎలా ఉంటున్నామో అవి కూడా అలాగే ఉంటున్నాయి నిజం చెప్పాలంటే ఆ పాములు మాకంటే సీనియర్ ఎప్పటి నుంచో ఇక్కడే ఉంటున్నాయి అయినా ఈ టైం లో పాముల గురించి ఎందుకులే బావ ఈ సైకిల్ గురించి మాట్లాడుకుందాం. 

 మీకు మీ సైకిల్ గుర్తుందా అది ఇప్పుడు ఎక్కడ ఉందో తెలుసా ఆ రోజు మీరు సైకిల్ ని ఎవరికో ఒకరికి ఇవ్వమని చెప్పారు కదా మీ పుణ్యమా అని ఆ సైకిల్ నా దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఆ సైకిల్ నా దగ్గరే ఉందని చెప్పి ఆ సైకిల్ ఫ్లాష్ బ్యాక్ ని సత్యతో చెప్తాడు అలా ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే సత్య ఆ సైకిల్ ని వదిలేసి వెళ్ళిపోయాక సుందర్ వాళ్ళ నాన్న ఆ సైకిల్ ని తీసుకొని వస్తాడు సైకిల్ వస్తుందని తెలిసి సుందర్ చాలా వెయిట్ చేస్తూ ఉంటాడు వాళ్ళ నాన్న సైకిల్ తీసుకురాగానే సైకిల్ ఎక్కేసి వాళ్ళ నాన్నతో కలిసి చాలా తిరుగుతాడు ఆ తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఆ సైకిల్ ఎక్కేసి ఊరంతా తిరుగుతారు అయినా కూడా మనోడికి సైకిల్ తొక్కడం రాదు అలా ఒక రోజు సైకిల్ తొక్కాలని సీటు మీద కూర్చొని తొక్కడానికి ట్రై చేస్తాడు కానీ మనోడి కాళ్ళు చిన్నగా ఉండడం వల్ల తొక్కడానికి రాదు అప్పుడే ఒక వ్యక్తి వచ్చి సైకిల్ పట్టుకొని తొక్కిపిస్తూ మధ్యలో వదిలేస్తాడు సైకిల్ వదిలేసినా కూడా సుందర్ తొక్కుతూనే వెళ్తాడు అలా చాలా దూరం వెళ్ళాక కింద పడిపోతాడు ఆ రోజే సుందర్ సైకిల్ తొక్కడం నేర్చుకుంటాడు వారంలో ఆరు  రోజులు సైకిల్ సుందర్ దగ్గర ఉంటే సండే రోజు మాత్రం వాళ్ళ నాన్న తీసుకెళ్తాడు వాళ్ళ నాన్న సండే రోజు ఊరంతా తిరిగి అదే సైకిల్ మీద చీరలు అమ్ముకుంటాడు దాంతో అతనికి చాలా డబ్బులు వస్తాయి డబ్బులు రాగానే పిల్లలిద్దరిని పెద్ద స్కూల్ లో జాయిన్ చేపిస్తాడు. 

 స్కూల్ చాలా దూరంగా ఉండడంతో రోజు అదే సైకిల్ మీద వాళ్ళ తమ్ముడిని తీసుకొని స్కూల్ కి వెళ్తాడు అలా ధైర్యంగా స్కూల్ కి వెళ్లడం చూసి వాళ్ళ నాన్న  సుందర్ ని చాలా మెచ్చుకుంటాడు ఇక ఈ సైకిల్ గురించి సత్యతో చెప్తూ చాలా ఎమోషనల్ అయిపోతాడు బావ నీ సైకిల్ లేకపోయి ఉంటే మా లైఫ్ ఎలా ఉండేదో ఊహించుకుంటేనే భయమేస్తుంది నీ సైకిల్ వల్లనే నేను బాగా చదవగలిగాను మా నాన్న ఊరంతా తిరిగి చీరలు అమ్మగలిగాడు అంతెందుకు నా పెళ్లికి కూడా అదే సైకిల్ మీద వెళ్ళాను సో మొత్తానికి నీ సైకిల్ మా జీవితాల్ని మార్చేసింది అని చెప్పుకుంటూ చాలా ఏడుస్తాడు సుందర్ అలా ఏడవడం చూసి రేయ్ ఎందుకురా ఏడుస్తున్నావ్ నా సైకిల్ వల్ల ఇంత మంచి జరిగిందా అని షాక్ అవుతాడు. 

అప్పుడే సుందర్ ఆ సైకిల్ ని చూపిస్తాడు సైకిల్ ని చూసి సత్య రేయ్ ఇది చిన్నప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది అసలేం  మారలేదు ఒకసారి రైడ్ చేయొచ్చా అని అడిగితే ఇది నీ సైకిల్ బావ నీ ఇష్టం అని చెప్తాడు ఇక సత్య సుందర్ ని తీసుకొని అలా బయటికి వెళ్తాడు మళ్ళీ ఒక చోటికి వెళ్లి

మందేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు చూడు బావ నాకు కూతురు పుడితే ఏం పేరు పెడతానో చెప్పుకోండి చూద్దాం రేయ్ నాకెలా తెలుస్తుందిరా నీకు అమ్మాయి పుడుతుందో అబ్బాయి పుడతాడో అయినా ఇప్పుడు నేను రెండు పేర్లు చెప్పాలా అంటే లేదు బావ అమ్మాయి అయినా అబ్బాయి అయినా ఒకే పేరు వస్తుంది ఆ పేరు ఏంటో చెప్పండి కనీసం గెస్ చేయండి అని చెప్తాడు సరే అని చెప్పి నందు అలాగే మధు పేర్లు చెప్తాడు లేదు బావ అవి రెండు కాదు రాంగ్ ఆన్సర్ సరేలే నేనే చెప్తానని చెప్పి సత్య అని అతని పేరే చెప్తాడు సత్య కి కూడా ఆ పేరు బాగా నచ్చుతుంది అయినా కూడా సత్య డల్ గా ఉండడం చూసి ఏంటి బావ ఇంకా మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారా వదిలేయ్ బావ ఇది జరిగి 20 సంవత్సరాలు అవుతుంది కదా ఇంకా కోపంతోనే ఉంటే ఎలా బావ జరిగినవన్నీ మర్చిపోండి అని చెప్తాడు ఎలా మర్చిపోవాలిరా వాళ్ళు మాకు చాలా ద్రోహం చేశారు ఆ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం రా నా డ్రీమ్ ఏంటో తెలుసా చివరి వరకు అదే ఇంట్లో ఉండి చనిపోవడం కానీ నా తలరాత ఏం చేస్తాం ఇలా జరిగింది అందుకే జరిగినవన్నీ మర్చిపోలేకపోతున్నాను అయినా నీకు ఇలా చెప్తే అర్థం కాదురా నీ జీవితంలో నీకు ఆ సైకిల్ ఎలాగో నాకు కూడా నాకు ఆ ఇల్లు అలాగే అని చెప్తాడు. 

 సత్య అలా అనగానే సుందర్ ఏమి మాట్లాడలేకపోతాడు ఆ తర్వాత ఇద్దరు కలిసి అలా డాన్స్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోతారు ఇంట్లోకి వెళ్ళగానే సుందర్ సత్యతో బావ నేను ఒకటి అడుగుతాను నా మీద కోప్పడకండి మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళని నా కోసం క్షమించండి మీకు వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడల్లా వాళ్ళకి ఏదో ఒకటి అవుతుంది ఆ పాపం మనకెందుకు చెప్పు బావ సో నా కోసం వాళ్ళని క్షమించమని అడుగుతాడు సరే రా నీ కోసం వాళ్ళని క్షమించేశా ఇప్పుడు హ్యాపీయే కదా అయినా నువ్వు ఇంత మంచోడివి ఏంటిరా బాబు ఎప్పుడూ ఇలాగే మంచిగా ఉండాలని చెప్తాడు సరే బావ అని చెప్పి పడుకొని మత్తులో మాట్లాడుతాడు చూడండి బావ మీరు వచ్చిన దగ్గర నుండి నన్ను పేరు పెట్టి ఒక్కసారి కూడా పిలవలేదు మీరు ఎవరితోనో మాట్లాడుతున్నట్టుగా నాతో మాట్లాడుతున్నారు మీరు రేపు పొద్దున

వెళ్ళేటప్పుడు మా ముగ్గురి పేర్లు పిలిచివెళ్ళాలి సరేనా అని చెప్పి పడుకుంటాడు. 

సుందర్ అలా అనగానే సత్య చాలా టెన్షన్ పడుతూ ఇప్పుడు వీడి పేరు తెలియదు కదా ఏం చేయాలిరా బాబు అని ఆలోచిస్తూ ఉంటాడు వెంటనే ఆ ఇల్లు మొత్తం వెతుకుతూ వాడి పేరు ఎక్కడైనా ఉందేమో అని చూస్తాడు కానీ ఎక్కడ కనిపించకపోయేసరికి చాలా ఏడుస్తాడు వెంటనే అతని బ్యాగ్ ని ప్యాక్ చేసుకొని ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్తూ వెళ్తూ ఒక గుడి దగ్గరికి వస్తాడు అక్కడే పూలు అమ్ముకునే ఆవిడ కనిపిస్తుంది తన దగ్గరికి వెళ్లి సుందర్ పేరు మీద అర్చన చేపించాలనుకుంటాడు కానీ సుందర్ పేరు తెలియదు కదా కాబట్టి దేవుడి పేరు మీద అర్చన చేయించండి అని చెప్పేసి వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు ఇంటికి వెళ్ళగానే సుందర్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు రోజు ఏ పని చేసినా సుందరే గుర్తొస్తూ ఉంటాడు అలా ఒక రోజు తన వైఫ్ కి డౌట్ వచ్చి ఏంటండీ రోజు చూస్తున్నాను అలా డల్ గా ఉంటున్నారు ఏంటి అక్కడ ఏమైనా జరిగిందా అని అడిగితే సుందర్ గురించి చెప్తాడు చూడవే వాడు ఎవడో అనుకోని అతన్ని దూరం పెట్టాను కానీ వాడు చాలా మంచివాడు వాడు నాతోనే కాదు అందరితోని ఒకేలా మంచిగా ఉంటాడు వాడు పాముల్ని కూడా పెట్స్ లాగా వాళ్ళ ఇంట్లోనే పెంచుకుంటున్నాడు నాతో చిన్నప్పుడు గడిపిన విషయాలన్నీ చెప్తున్నాడు అంతేకాదు వాడికి పుట్టబోయే బిడ్డకి నా పేరే పెడతాడంట అని తన వైఫ్ తో చెప్తాడు అవునా ఒక్క రోజులో

ఇన్ని విషయాలు జరిగాయా సరే వాడికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడండి అని చెప్తుంది ఎలా మాట్లాడాలి వాడికి ఫోన్ చేసి మాట్లాడాలంటేనే ఏదోలా ఉందని చెప్తాడు వీళ్ళు మాట్లాడుకుంది మొత్తం సత్య కూతురు వినేస్తుంది తరువాతి రోజు సత్య ఇల్లు కొనడానికి డబ్బులు రెడీ చేస్తూ ఉంటాడు అతనికి 25 లాక్స్ అవసరం ఉంటుంది వెంటనే తెలిసిన వ్యక్తులకి కాల్ చేసి అడుగుతూ ఉంటాడు ఒక అతను ఇస్తానని చెప్తాడు దాంతో సత్య చాలా హ్యాపీగా ఉంటాడు అప్పుడే అక్కడికి అతని కూతురు వచ్చింది సుందర్ నెంబర్ చూస్తుంది. 

వాళ్ళ నాన్న దగ్గర నుండి ఫోన్ తీసుకొని సుందర్ కి కాల్ చేసి ఇచ్చి మాట్లాడమని చెప్తుంది సత్య చాలా టెన్షన్ పడుతూ మాట్లాడుతూ రేయ్ నేను సత్యని మాట్లాడుతున్నా అని చెప్తాడు బావ నువ్వా ఆ రోజు చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయారు మీరు వెళ్ళిపోయాక నేను మీరు ఇచ్చిన నెంబర్ కి చాలా సార్లు కాల్ చేశాను కానీ ఎవరెవరో లిఫ్ట్ చేసి మాట్లాడారు ఈ నెంబర్ ఎవరిదని అడిగితే ఇది నా నెంబరే కానీ నువ్వు బాగున్నావా అని అడుగుతాడు నాకేంటి బావ బాగున్నాను మీరు ఆ రోజు నాకు ఇచ్చిన నెంబర్ ఎవరిదని అడిగితే అది నా నెంబర్ కాదురా నేనే మార్చి ఇచ్చానని చెప్తాడు జోకులు వేయకండి బావ మీరెలా మార్చి చెప్తారు నేనే కంగారులో తప్పు రాసుకున్నట్టు ఉన్నాలే ఇంకేంటి విశేషాలు అనగానే సత్య సుందర్ కి నిజం చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే సుందర్ మళ్ళీ ఒక విషయం చెప్తాడు చూడండి బావ మీకు డబ్బులు అవసరం ఉందని విన్నాను నా దగ్గర 15 లక్షలు ఉన్నాయి ఇంకా మీ చెల్లి దగ్గర ఉన్న నగలు బ్యాంకులో పెడితే ఐదు లక్షలు ఇస్తారు మరో ఐదు లక్షలు చీటి డబ్బులు తీసుకొని వస్తా సరిపోతాయి కదా అని చెప్తాడు రేయ్ నేను మనీ అరేంజ్ చేసుకున్నా ఇప్పుడు డబ్బులు వద్దులే కానీ నేను చెప్పేది వినరా అంటే మనోడు వినడు నేను ఇచ్చే డబ్బులు తీసుకుంటేనే నువ్వు చెప్పేది వింటానని చెప్తాడు సరే రా తీసుకుంటాను ఇప్పుడు విను అని నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు రేయ్ ఇప్పుడు నేను చెప్పేదంతా నిజం ఆ రోజు నేనే కావాలని ఫోన్ నెంబర్ ని మార్చి ఇచ్చాను

ఎందుకంటే నువ్వు ఎవరో నాకు తెలియదు నీ పేరేంటో నాకు తెలియదు అందుకే ముక్కు మొహం తెలియని వాడికి నెంబర్ ఇవ్వడం ఎందుకని నేనే తప్పుగా చెప్పాను ఇప్పటికి కూడా నీ పేరేంటో నాకు తెలియదు నువ్వు ప్రేమగా బావ బావ అని పిలుస్తుంటే నాకు అడగాలనిపించలేదునువ్వు ఆ రోజు మొత్తం నా పక్కనే ఉన్నావు కాబట్టి నేను కూడా నీ గురించి వేరే వాళ్ళని అడగలేకపోయా అయినా నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ రోజు నువ్వు నీకు పుట్టబోయే బిడ్డకి నా పేరు పెడతాను అన్నావు అలాగే మీ ముగ్గురిని పేరు పెట్టి పిలవమన్నావ్ నాకేం చేయాలో అర్థం కాలేదు అందుకే ఇంట్లో నుంచి పారిపోయా అని చెప్తాడు అయితే నిజంగానే నేను ఎవరో నా పేరేంటో తెలియదా బావ అని చాలా బాధపడతాడు

రేయ్ నీ పేరేంటో తెలియకపోవచ్చు కానీ నువ్వేంటో నీ మనసు ఏంటో నాకు తెలుసు నీ వల్లే నేనేంటో కూడా నాకు తెలిసిందని చెప్తాడు అది వినగానే సుందర్ చాలా ఏడుస్తాడు సుందర్ ఏడవడం గమనించి రేయ్ ఏడవకురా నేను చేసిన తప్పుకు నన్ను క్షమించు అని అడుగుతాడు ఊరుకోండి బావ నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి అయినా ఇప్పటికైనా నా గురించి తెలుసుకోవాలని లేదా అని అడిగితే చెప్పరా వింటాను చూడండి బావ నేను మిమ్మల్ని క్షమించడం కాదు మీరే నన్ను క్షమించాలి ఆ రోజు బస్సు నేనే కావాలని మిస్ చేయించాను మీరు నాతో ఒక్క రోజైనా ఉంటే బాగుంటుందని అలా చేశాను మీరు నాకు ఫోన్ నెంబర్ ని తప్పుగా చెప్పారు నేను కూడా బస్సు ని మిస్ చేయించాను సో ఇద్దరం తప్పు చేసినట్టే ఇక నా గురించి వినండి యాక్చువల్ గా నేను కూడా మీ ఫ్యామిలీలో ఒక భాగమే అని వాళ్ళ తాతల ముత్తాతల స్టోరీ చెప్తాడు. 

 ఆ తర్వాత అతని చిన్ననాటి కథని చెప్తాడు చూడండి మీరు టెన్త్ అయిపోయాక ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు నేను మీ ఇంటికి వచ్చాను మీరు నాతో చాలా ఆడుకునే వాళ్ళు నన్ను ప్రతి రోజు బయటకు తీసుకెళ్లే వాళ్ళు నాతో పాటు చాలా మంది పిల్లలు ఉండేవాళ్ళు వాళ్ళందరూ గుర్తున్నారా అని అడిగితే అవును గుర్తొస్తున్నారు అని వాళ్ళ పేర్లు చెప్తాడు కానీ మనోడి పేరు మాత్రం గుర్తుకు రాదు అప్పుడే సుందర్ నేను బావ నీ బంగాళదుంపని అని గుర్తు చేస్తాడు బంగాళదుంప పేరు వినగానే సత్యకి ఆ పిల్లాడు గుర్తొస్తాడు ఆ పిల్లోడే సుందర్ అని తెలిసాక చాలా ఎమోషనల్ అయిపోయి రేయ్ నా పొటాటో ఎలా ఉన్నావురా అని ఇప్పుడు అడుగుతాడు చూడు బావ ఎప్పుడో కలుసుకొని ఇప్పుడు అడుగుతున్నారు చూడు నిజంగా తోపు బావ మీరు సరే గాని ఇప్పుడైనా నా పేరు ఏంటో చెప్పండి అని అడుగుతాడు నీ పేరు గుర్తొచ్చి చాలా సేపు అయింది లేరా తర్వాత ఎప్పుడైనా చెప్తానని చెప్పి ఫోన్ కట్ చేసి వెంటనే సుందర్ ఊరికి స్టార్ట్ అవుతాడు వాళ్ళ ఊరికి వెళ్ళగానే ఈసారి ఆ పూలమ్మ దగ్గరికి వెళ్లి అతని పేరు చెప్పి మరి అర్చన చేపించమంటాడు ఆ తర్వాత మనోడి ఇంటికి వెళ్లి రేయ్ పొటాటో డోర్ తీయరా అని డోర్ కొడుతూ ఉంటాడు అయినా కూడా సుందర్ డోర్ ఓపెన్ చేయడు చివరికి డోర్ ఓపెన్ చేయరా సుందరం అని పేరు పెట్టి పిలుస్తాడు అది వినగానే సుందర్ డోర్ ఓపెన్ చేసి గట్టిగా బావ అని పిలుస్తాడు ఇక్కడితో మూవీ అయిపోతుంది

                                                                                                    :::::శుభం :::::

FOR MORE MOVIE STORIES WEBSERIES STORIES Please visit our Website: Filmywebstories.com

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

teTelugu
Scroll to Top