హాయ్ ఫ్రెండ్స్ Welcome to FilmyWebstories.com సెప్టెంబర్ 13 2024 లో రిలీజ్ అయినటువంటి కళింగ అనే ఫాంటసీ హారర్ థ్రిల్లర్ మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం.
అది 1922 వ సంవత్సరం ఒక గ్రామంలో అర్ధరాత్రి ఒక వ్యక్తి తన పని ముగించుకొని తన ఇంటికి తిరిగి వెళ్తాడు ఆ వ్యక్తి తన భార్య ని చూసి చాలా ఆకలిగా ఉంది భోజనం పెట్టు అని అంటాడు దాంతో తన భార్య అతనికి భోజనం పెట్టి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు సరిగ్గా అదే సమయంలో ఆమెను ఎవరో పిలుస్తున్నట్లుగాఅనిపిస్తుంది దాంతో తను వెంటనే ఇంటి నుంచి బయటికి వెళుతుంది కానీ చాలా సమయం గడిచిన ఆమె మాత్రం తిరిగి ఇంట్లోకి రాదు దాంతో ఆ వ్యక్తి వెంటనే తన భార్య ని వెతుక్కుంటూ ఇంటి బయటకు వస్తాడు. అయితే ఇంటి బయట కనుచూపు మేర ఎక్కడా కూడా తన భార్య కనిపించదు దాంతో ఆ వ్యక్తి తన భార్య ని వెతుకుతూ ఉండగా తనకి దూరంగా ఉన్నపొలాల్లో నుంచి కొన్ని శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి దాంతో ఆ వ్యక్తి ఆ శబ్దాలు ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయో తెలుసుకోవడం కోసం అక్కడికి బయలుదేరి వెళ్తాడు అక్కడికి వెళ్లి చూడగా విచిత్రంగా ఆ వ్యక్తి భార్య తన చేతిని కట్ చేసుకుని తింటూ ఉంటుంది దాన్ని చూసిన ఆ వ్యక్తి వెంటనే భయపడిపోయి అక్కడి నుంచి పారిపోతాడు.
మరొక వ్యక్తి తన సైకిల్ లో తిరిగి గ్రామానికి అర్ధరాత్రి వస్తూ ఉంటాడు అయితే ఆ వ్యక్తికి కూడా కొన్ని శబ్దాలు వినిపిస్తాయి ఆ ఆ తర్వాత ఆ వ్యక్తి తన తలను ఒక చెట్టుకి కొట్టుకొని తను చనిపోతాడు. కొన్ని రోజుల తర్వాత ఒక వ్యక్తి మరొక వ్యక్తికి షేవింగ్ చేస్తూ ఉండగా సడన్ గా అతని కత్తి కనిపించదు ఎందుకంటే అక్కడే ఉండే ఒక అమ్మాయి ఆ కత్తిని తీసుకుని తన చెవిని తానే కోసుకుని తింటూ ఉంటుంది ఈ సీన్ అయితే చాలా ఘోరంగా ఉంటుంది
ఆ తర్వాత గ్రామంలోని ప్రజలందరూ కలిసి తమ జమీందారు దగ్గరికి వెళ్లి గ్రామంలో జరిగే ఈ సంఘటనల గురించి అన్నీ కూడా చెప్తూ మన గ్రామంలోకి ఏదో ఆత్మ వచ్చి తిరుగుతుంది గ్రామంలోని ప్రజలు సడన్గా చనిపోతున్నారు మన గ్రామానికి ఏదో శాపం తగిలినట్లు ఉంది అని చెప్తారు ఆ మాటలు మొత్తం విన్న జమీందారు వెంటనే ఆ ప్రజలందరినీ చూసి మీరేమీ బాధపడకండి నేనుతొందరగా దీనికి పరిష్కారం కనుక్కుంటాను అని చెప్పి ఆ జమీందారు తన ముసలి అమ్మ దగ్గరికి వెళ్తాడు.
జమీందార్ ముసలి అమ్మ బెడ్ మీద పడుకొని ఉంటుంది నిజానికి ఆమె పరిస్థితి కూడా చాలా దారుణంగా ఉంటుంది అయితే జమీందారు అమ్మ ఈ సమస్యకి ఏదైనా పరిష్కారం చెప్తుందేమో అని తన అమ్మ దగ్గరికి వెళ్లి గ్రామంలో జరిగే ఈ సమస్యల గురించి మొత్తం వివరిస్తాడు.
అప్పుడు జమీందార్ అమ్మ జమీందార్ ని చూసి తన ఫ్యామిలీ హిస్టరీ స్టోరీని చెప్పడం మొదలు పెడుతుంది అసలు ఆ స్టోరీ ఏమిటి అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది ఆ జమీందార్ అమ్మ ఒక పెద్ద బాక్స్ ని చూపించి ఈ గ్రామంలో జరుగుతున్న సమస్యలు అన్నిటికీ సమాదానం దాంట్లో ఉంది అని చెప్తుంది అందువల్ల ఆ జమీందార్ ఆ బాక్స్ తీసుకుని తన ప్రయాణాన్ని మొదలుపెడతాడు. అంటే గ్రామంలో తలెత్తుతున్న సమస్యలకి ఖచ్చితంగా పరిష్కారం వెతికి తీరుతాను అని మాట ఇచ్చాడు కదా అందుకోసమే ఆ పుస్తకాన్ని తీసుకుని దానితో పాటు తాగడానికి తినడానికి కావాల్సినవన్నీ తీసుకుని తన గుర్రంతో కలిసి తన జర్నీని స్టార్ట్ చేస్తాడు ఈ విధంగా జమీందార్ చాలా దూరం ప్రయాణం చేస్తాడు .
ఆ తర్వాత స్టోరీ కొన్ని సంవత్సరాల తర్వాతకి షిఫ్ట్ అవుతుంది ఒకరోజు అదే గ్రామానికి చెందిన ఒక వ్యక్తి చనిపోవడం వల్ల ఆ గ్రామస్థులందరూ కలిసి ఆ వ్యక్తి యొక్క శవాన్ని పూడ్చి పెట్టడం కోసం తన గ్రామం బయటికి తీసుకువెళ్తారు అప్పుడే అక్కడ ఉన్న ఒక ముసలి వ్యక్తి మరొక వ్యక్తిని చూసి ఈ గ్రామంలోని వాళ్ళు ఎవరైనా చనిపోతే వాళ్ళ శవాన్ని ఆ గ్రామంలో పూడ్చి పెట్టరు గ్రామం బయటికి ఆ శవాన్ని తీసుకుని వెళ్లి అక్కడ ఈ ప్రకృతికి అర్పిస్తారు ఈ గ్రామం బయట ఒక బోర్డర్ లైన్ ఉంటుంది అని చెప్తాడు ఆ తర్వాత ఆ ముసలి వ్యక్తి శవాన్ని తీసుకువచ్చిన మిగతా వాళ్ళని చూసి మనం రెండు నిమిషాల్లో బయటికి వెళ్లి మళ్ళీ లోపలికి వెళ్ళాలి ఈ రెండు నిమిషాల లోపల మనం మన పనిని పూర్తి చేసుకుందాం అని చెప్తాడు ఆ తర్వాత వాళ్ళందరూ కూడా తమ గ్రామం బయటికి వెళ్లి ఆ శవంతో ఒక రిచువల్ (క్షుద్ర పూజ) లాంటిది చేసి ఆ తర్వాత వెంటనే తిరిగి మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా వాళ్ళ గ్రామంలోకి వెళ్ళిపోతారు ఆ తర్వాత ఎవరో ఆ శవాన్ని లాక్కుని వెళ్ళిపోతారు.
లింగా మరియు తన ఫ్రెండ్ ఇద్దరూ కలిసి లోకల్ మందుని (సారాయి) ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఈ గ్రామానికి పటేల్ అనే ఒక జమీందారు ఉంటాడు పటేల్ కి ఒక తమ్ముడు కూడా ఉంటాడు అతని పేరు బలి. ఈ బలి గ్రామంలో ఉన్న ప్రతి అమ్మాయిని కూడా బలాత్కరిస్తూ ఉంటాడు బలి మరియు పటేల్ ఇద్దరు కలిసి ఆ గ్రామ ప్రజల మీద దౌర్జన్యం చేస్తూ ఉంటారు.
ఒకరోజు పటేల్ దగ్గరికి వేరే గ్రామంలో ఉండే ఒక వ్యక్తి వచ్చి డబ్బు పటేల్ కి ఇచ్చి తన భూమిని తనకి తిరిగి ఇవ్వమని చెప్తాడు ఎందుకంటే ఆ వ్యక్తి పటేల్ దగ్గర కొంత డబ్బు అప్పు చేసి ఉంటాడు దానికి బదులుగా పటేల్ ఆ వ్యక్తి భూమికి సంబంధించిన పేపర్స్ ని పటేల్ దగ్గర తాకట్టు పెట్టుకొని ఉంటాడు ఆ తర్వాత ఆ పటేల్ ఆ వ్యక్తిని చూసి నువ్వు చాలా దూరం నుంచి వచ్చావు కదా ముందుగా నువ్వు భోజనం చెయ్యి ఆ తర్వాత కూర్చొని మాట్లాడదాం అని చెప్పి పటేల్ ఆ వ్యక్తికి భోజనం పెడతాడు ఆ భోజనం తిన్న తర్వాత ఆ వ్యక్తి మళ్ళీ పటేల్ ని చూసి తన భూమికి సంబంధించిన పేపర్స్ ని ఇవ్వమని అడుగుతాడు పటేల్ వెంటనే ఆ వ్యక్తిని చూసి నీ దగ్గర డబ్బు ఉంది. కాని నీ భూమిని నేను తిరిగి ఇవ్వలేను అని చెప్పి ఆ వ్యక్తిని చంపేస్తాడు.
ఆ తర్వాత గ్రామంలో ఒక దండోర వేస్తూ ఉంటారు ప్రతి అమావాస్య రోజు రాత్రి గ్రామంలోని వాళ్ళు తమ గ్రామంలో ఉన్న బోర్డర్ పక్కన జంతుబలి ఇస్తూ ఉంటారు ఎందుకంటే చెడు శక్తి గ్రామంలోకి ఎంటర్ అవ్వకూడదు అని ఆ గ్రామంలోని వాళ్ళు అలా చేస్తూ ఉంటారు ఈరోజు రాత్రి కూడా ఎవరు తమ ఇంటి నుంచి బయటికి రాకూడదు అని అక్కడ దండోరా వేస్తారు. అదే రోజు ఆ గ్రామంలో ఒక పెద్ద పండుగ కూడా జరుగుతుంది గ్రామంలో ఉన్నవాళ్ళు గుడికి వెళ్లి అమ్మవారికి పూజలు చేస్తారు. రాత్రి అయ్యాక ఆ గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఆ గ్రామం అంతా తిరుగుతూ ఆ గ్రామాన్ని శుద్ధి చేస్తూ ఉంటారు. అంటే ఒక వ్యక్తి తన నోట్లో మాంసం ముక్కను పెట్టుకుని గ్రామం అంతా కూడా బ్లడ్ ని చల్లుతూ ఉంటాడు మరో పక్క లింగా ఒక అనాధ వ్యక్తి లింగా చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడే లింగా పేరెంట్స్ చనిపోయి ఉంటారు ఆ గ్రామంలో ఉండే ఒక వ్యక్తినే లింగాని పెంచి పెద్దవాడిని చేసి ఉంటాడు ఒకరోజు లింగా పద్దుకి ప్రపోజ్ చేస్తాడు పద్దు కూడా లింగాని లవ్ చేస్తూ ఉంటుంది కానీ తన ముందు మాత్రం పోజు కొడుతూ ఉంటుంది అప్పుడప్పుడు లింగాకి విచిత్రమైన కలలు వస్తూ ఉంటాయి ఆ కలలో లింగా రాజుని ఒక పిల్లవాడిని అలాగే ఒక సైతాన్ చూస్తాడు కానీ తనకు వచ్చే కలల గురించి ఎవరితోనూ చెప్పుకోడు.
ఒకరోజు ఒక గర్బిణి స్త్రీ తన కూతురితో కలిసి అడవి ద్వారా ఎక్కడికో వెళుతూ ఉంటుంది. ఆ గర్భిణీ స్త్రీ నడుస్తూ చాలా అలసిపోయి ఉంటుంది ఆ గర్బిణి స్త్రీ తన కూతుర్ని చూసి అంత వేగంగా పరిగెత్తకు కింద పడిపోతావు అని అంటుంది అయితే ఆ పాప మాత్రం వేగంగా పరిగెడుతూ పరిగెడుతూ తప్పిపోతుంది దాంతో ఆ గర్బిణి స్త్రీ తన కూతుర్ని వెతుకుతూ తనని పిలుస్తూ ఉంటుంది అప్పుడే ఆ స్త్రీ దగ్గరికి అడవిలో నుంచి ఒక ముసలి వ్యక్తి వచ్చి నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు దానికి ఆ స్త్రీ నేను మా అమ్మ ఇంటికి వెళుతున్నాను ఆ సమయంలోనే నా కూతురు తప్పిపోయింది తనని వెతకడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది దానికి ఆ ముసలి వ్యక్తి ఆ లేడీని చూసి ఈ ప్రదేశానికి కి రాకూడదు అని నీకు తెలియదా అని తిడతాడు నిజానికి ఆ లేడీ ఆ గ్రామం బోర్డర్ లైన్ దగ్గరికి వచ్చేసి ఉంటుంది ఆ గర్బిణి స్త్రీ వెంటనే ఆ ముసలి వ్యక్తిని చూసి తెలుసు స్వామి నేను ఇప్పుడే నా కూతుర్ని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి తన కూతుర్ని వెతుక్కుంటూ గ్రామం బోర్డర్ లైన్ కూడా క్రాస్ చేసి అటువైపుకి వెళ్ళిపోతుంది మరోవైపు ఆ ముసలి వ్యక్తికి ఆ పాప కనిపిస్తుంది దాంతో ఆ వ్యక్తి నువ్వు ఇక్కడ ఉంటే మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని ఆలోచిస్తాడు అయితే అప్పటికే ఆ ఊరి బోర్డర్ ని దాటిన ఆ గర్బిణి స్త్రీ చనిపోయి ఉంటుంది ఆమెకు గర్భస్రావం అయి ఉంటుంది అదే విధంగా ఆ గర్బిణి స్త్రీ శవాన్ని కూడా ఏదో లాక్కొని వెళ్ళిపోతుంది.
ఒకరోజు బలి ఎక్కడికో వెళుతూ ఉండగా ఒక ముసలాయన తన మనవరాలతో తన గ్రామానికి వెళుతూ కనిపిస్తాడు ఆ చిన్న పాపను చూసిన బలి వెంటనే తన మనసులతో ఆ అమ్మాయిని తన వెహికల్ లో కూర్చోబెట్టడం కోసం ట్రై చేస్తాడు సరిగ్గా అదే సమయంలో అక్కడికి పద్దు వచ్చి బలి గొంతు మీద కత్తిని గురి పెట్టి నిన్ను చంపేస్తా అని బెదిరిస్తుంది దాంతో బలి భయపడి పోయి ఆ అమ్మాయిని వదిలేస్తాడు అయితే ఇదే విషయాన్ని బలి తన అన్న పటేల్ దగ్గరి కి వచ్చి చెప్తాడు అప్పుడు పటేల్ ఈరోజు ఒక అమ్మాయి మనల్ని భయపెట్టింది రేపు గ్రామం మొత్తం మన దగ్గర భయపెట్టడానికి వస్తారు.
బలి దీన్ని ఇక్కడితో నే అంతం చేయాలి ఎవరైనా పేదలు మనల్ని అవమానిస్తే వాళ్లని అంత తేలిగ్గా వదిలేయకూడదు. అవమానించింది మగవాడైతే చంపేయాలి. అదే అమ్మాయి అయితే తన మానాన్ని దొంగలించాలి తన గౌరవాన్ని పాడు చేయాలి ఇక నువ్వు ఏం చేయాలో నీ ఇష్టం నువ్వే ఆలోచించుకో అని అంటాడు పటేల్.
అందువల్ల అదే రోజు రాత్రి బలి తన మనుషులతో కలిసి వెళ్లి పద్దుని కిడ్నాప్ చేసి తన ప్లేస్ కి తీసుకువచ్చి ఆమెని బలవంతం చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు సరిగ్గా అదే టైం లో అక్కడికి లింగా వచ్చి బలిని తన మనుషులతో ఫైట్ చేసి వాళ్ళని అక్కడి నుంచి పారిపోయేలాగా చేస్తాడు ఈ ఫైట్ సీన్ ని చూసిన పద్దు వెంటనే లింగాని హగ్ చేసుకుని లింగాకి ప్రపోజ్ చేస్తుంది ఈ విధంగా వాళ్ళిద్దరి లవ్ జర్నీ కూడా మొదలవుతుంది మరో పక్క ఒక తాంత్రికురాలు గ్రామం మంచి కోసం పని చేస్తూ ఉంటుంది అంటే చెడు ఆత్మలు ఆవహిస్తే వాటిని వదిలించడం ఎవరి మీద అయినా బ్లాక్ మ్యాజిక్ ప్రయోగిస్తే దాన్ని తీసేయడం అలాంటి పనులన్నీ చేస్తూ ఉంటుంది.
ఒకరోజు లింగా, లింగా ఫ్రెండ్ అదేవిధంగా లింగాని పెంచిన తండ్రి అందరూ కలిసి పద్దు ఇంటి దగ్గరికి వచ్చి పద్దుని లింగాకి ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతారు ఆ మాటలు విన్న పద్దు తండ్రి అసలు నీ దగ్గర ఏముంది నువ్వు ఒక సారా కొట్టు నడుపుతావు అది కూడా ఒక పనేనా ఇలాంటి వాడికి నా కూతుర్ని ఇచ్చి నేను పెళ్లి చేయలేను. ఎవరి దగ్గర అయితే భూమి ఉంటుందో అతనికే నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను అని అంటాడు ఆ మాటలు విన్న లింగా నా దగ్గర కూడా భూమి ఉంది కదా రెండు ఎకరాలు ఉంది అని చెప్తాడు దానికి పద్దు తండ్రి ఆ భూమి పటేల్ దగ్గర తాకట్లో ఉంది అది కూడా మీ తాతల కాలం నాటి నుంచి అక్కడే ఉంది అని అంటాడు దాంతో లింగా వెంటనే తనని చూసి సరే అయితే నా భూమిని నేను తిరిగి తీసుకుంటాను అప్పుడైనా మీరు పద్దుతో నా పెళ్లి చేస్తారు కదా అని అడుగుతాడు దానికి పద్దు తండ్రి సరే అయితే ముందు నువ్వైతే నీ భూమిని వెనక్కి తీసుకో అప్పుడు చూద్దాం అని అంటాడు.
ఆ రోజు రాత్రి లింగా మరియు తన ఫ్రెండ్స్ ఎలా తన పొలాన్ని తిరిగి తీసుకోవాలి పటేల్ అయితే అంత ఈజీగాపొలాన్ని తిరిగి ఇవ్వడు పద్దు కోసమైనా పటేల్ దగ్గరికి వెళ్లి పొలం పేపర్స్ ని తిరిగి ఇవ్వమని అడగాలి అని ఆలోచిస్తూ ఉంటారు ఆ తర్వాత రోజు లింగా మరియు కొంతమంది కలిసి పటేల్ దగ్గర దగ్గరికి వెళ్లి లింగా పొలం పేపర్స్ ని తిరిగి ఇవ్వమని అడుగుతారు అప్పుడు పటేల్ ఆ లింగాని చూసి మీ తాత ఆ పొలాన్ని నా దగ్గర తాకట్టు పెట్టాడు మీ తాత మనీ తిరిగి ఇవ్వలేదు మీ నాన్న కూడా తిరిగి ఇవ్వలేదు ఆఖరికి నువ్వు కూడా మనీ తిరిగి ఇవ్వలేదు అలా ఎలా పేపర్స్ ని ఇవ్వాలి అని చెప్తాడు ఆ మాటలు విన్న లింగా కోపంతో ఇలా చూడండి పటేల్ గారు మీకు ఇవ్వవలసిన డబ్బు ఎప్పుడో తిరిగి ఇచ్చేసామని నాకు తెలుసు కానీ మీరు బలవంతంగా మా నుంచి భూమిని లాక్కుంటున్నారు అని అంటాడు.
దానికి పటేల్ సరే అయితే లింగా నేను నీకు ఒక మంచి ఆఫర్ ఇస్తాను నీ రెండు ఎకరాలకు బదులుగా నేను నాలుగు ఎకరాల భూమిని ఇస్తాను అది కూడా మన గ్రామం బయట ఉంది అని చెప్తాడు ఆ మాటలు విన్న లింగా సరే అయితే ఇవ్వండి అని అంటాడు దాంతో పటేల్ వెంటనే ఆ నాలుగు ఎకరాల భూమికి సంబంధించిన పేపర్స్ ని తెప్పించి వాటి మీద సైన్ చేసి లింగాకి ఇస్తాడు లింగా మరియు ఆ ఊరి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత బలి వెంటనే తన అన్న పటేల్ ని చూసి అన్న మీరేం చేశారు వాడిని మీరు చంపాలి అని అంటాడు దానికి పటేల్ వాడిని శక్తితో కాదు బుద్ధితో ఓడించాలి ఆ అడవిలోకి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఈ రోజు వరకు తిరిగి రాలేదు మనం అతన్ని చంపవలసిన అవసరం లేదు వాడే చనిపోతాడు అని అంటాడు తర్వాత ఆ గ్రామానికి చెందిన ఒక వ్యక్తి ఒక పని మీద అడవులోకి వెళుతూ ఉంటాడు ఆ సమయంలో ఒక శక్తి ఆ వ్యక్తి దగ్గరికే వస్తూ ఉంటుంది సడన్ గా
ఆ శక్తి ఆ వ్యక్తి మీద పడుతుంది వెంటనే ఆ వ్యక్తి తల తెగి కింద పడిపోతుంది ఆ తర్వాత ఆ విచిత్రమైన సైతాన్ ఆ వ్యక్తి మాంసం తింటూ ఉంటుంది స్టోరీ గతానికి వెళ్తుంది లింగా చిన్నతనంలో ఒకరోజు లింగా తన తాత ఇద్దరు కలిసి అడవి దగ్గర దారి నుంచి ఎక్కడికో వెళుతూ ఉండగా సడన్ గా ఆ సైతాన్ అక్కడికి వచ్చి లింగా తాతయ్యని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోతుంది లింగా మాత్రం తన తాతని పిలుస్తూ తన తాత కోసం వెతుకుతూ ఉంటాడు లింగా చాలా భయంతో అరుస్తూ ఉంటాడు అప్పుడే లింగా ఒక చెట్టు మీద తన తాత శవం వేలాడుతూ ఉండడాన్ని చూస్తాడు ఈ కలనే ఇప్పటికీ లింగా చూస్తూ ఉంటాడు.
స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది లింగా దగ్గర పొలం ఉండడం వల్ల లింగా మరియు పద్దుల పెళ్లి జరుగుతుంది ఆ తర్వాత లింగా తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్లి పటేల్ నా పేరు మీద పొలం రాశాడు కదా ఆ పొలాన్ని చూడ్డానికి వెళ్ళాలి అని చెప్తాడు ఆ మాటలు విన్న లింగా ఫ్రెండ్ లేదు లేదు నేను అక్కడికి రాను అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ కూడా ఇప్పటివరకు తిరిగి రాలేదు అని రిజెక్ట్
చేస్తాడు కానీ లింగా తన ఫ్రెండ్ కి మందు ఇస్తా అని ప్రామిస్ చేసి తన ఫ్రెండ్ ని తనతో తీసుకుని వెళ్తాడు మరో పక్క పద్దు గుడికి వెళ్లి బయటికి తిరిగి వస్తూ ఉండగా ఆ గుడి దగ్గర ఆ తాంత్రికురాలు కూర్చొని పద్దుని చూసి నీ భర్త ప్రాణాలకి ప్రమాదం ఉంది అని వార్నింగ్ ఇస్తుంది.
ఆ తర్వాత రోజు లింగా తన ఫ్రెండ్ కలిసి ఆ పొలం దగ్గరికి వెళుతూ ఉంటారు ఆ పొలం గ్రామానికి చాలా దూరంగా ఉంటుంది నాలుగు వైపులా భయంకరమైన అడవి ఉంటుంది అలా కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లింగా మరియు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా కొన్ని అస్తి పంజరాలను చూస్తారు వాటిని చూసిన లింగా ఫ్రెండ్ లింగా తో మనం తొందరగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోదామని అంటాడు కానీ లింగా మాత్రం తన ఫ్రెండ్ ని చూసి ఎలాగో అలా తనని ఒప్పించి ఫైనల్ గా ఆ పొలం దగ్గరికి తీసుకుని వెళ్తాడు అది పేరుకి మాత్రమే పొలం కానీ నాలుగు వైపులా భయంకరమైన అడవి ఉంటుంది అప్పుడు లింగా ఫ్రెండ్ లింగాని చూసి ఇదే నీ నాలుగు ఎకరాల పొలం ఇక్కడ ఏం చేయాలో చేసుకో అని చెప్తాడు దానికి లింగా సరే అయితే ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాను అని అంటాడు ఆ రోజు రాత్రి అయిన తర్వాత లింగా మరియు తన ఫ్రెండ్ ఇద్దరు కూడా దగ్గరలో ఉన్న వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్లి క్యాంప్ ఫైర్ వేసుకుని ఆ పొలాన్ని ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటాడు.
కట్ చేస్తే ఆ తర్వాత రోజు మార్నింగ్ లింగా ఫ్రెండ్ నిద్ర లేవగానే తన పక్కన లింగా కనిపించడు దాంతో లింగా ఫ్రెండ్ లింగా కోసం అరుస్తూ ఉంటాడు కానీ తను ఎక్కడా కనిపించడు ఫైనల్ గా లింగా తన ఫ్రెండ్ కి కనిపిస్తాడు మరో పక్క బలి తన అన్న పటేల్ దగ్గరికి వెళ్లి ఆ లింగా వెళ్లి రెండు రోజులు అయ్యింది అతని గురించి ఎటువంటి కబురూ లేదు అప్పుడే వాడిని చంపేయమని నేను చెప్పాను అని అంటాడు ఆ మాటలు విన్న పటేల్ నువ్వు తొందర పడకు వాడు అసలు తిరిగి రానే రాడు అని బలికి చెప్తాడు.
అదే రోజు రాత్రి బలి పద్దు దగ్గరికి వెళ్లి తనని బలవంతం చేయడానికి ట్రై చేస్తాడు నీ మొగుడు ఇక రాడు కానీ నువ్వేమీ బాధపడకు నీ దగ్గరికి నేను ప్రతి రోజు రాత్రి వచ్చి వెళుతూ ఉంటాను అని అంటాడు పద్దు బలిని తిట్టి అక్కడి నుంచి పంపించేస్తుంది మరో పక్క లింగా రాత్రి పడుకొని నిద్రపోతూ ఉండగా సడన్ గా లింగా దగ్గరికి పద్దు వచ్చి లింగాని నిద్ర లేపుతూ అది వస్తుంది లింగా మనం ఇక్కడి నుంచి పారిపోదాం అది అందరిని చంపేస్తుంది అని అంటుంది లింగాకి అసలు ఏమీ అర్థం కాదు పద్దు నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావ్ నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్తున్నావు అని అడుగుతూ ఉంటాడు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత లింగాకి అసలు పద్దు కనిపించదు దాంతో లింగా ఇదంతా నా భ్రమనా లేక ఏదైనా మాయనా అని అనుకుంటూ ఉంటాడు.
ఆ తర్వాత రోజు మార్నింగ్ లింగా ఫ్రెండ్ నిద్ర లేచి చూడగా అక్కడ లింగా కనిపించడు ఫైనల్ గా లింగా ఫ్రెండ్ కి లింగా ఒకచోట కనిపిస్తాడు అప్పుడు లింగా ఫ్రెండ్ వెంటనే లింగాని చూసి అసలు నువ్వు ప్రతి రోజు రాత్రి నువ్వు ఎక్కడికి వెళుతున్నావు అని అడుగుతాడు అప్పుడు లింగా తన ఫ్రెండ్
కి కొన్ని విషయాలు చెప్పడం మొదలు పెడతాడు లింగా చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు తన తాత చనిపోయి ఉంటాడు నిజానికి లింగా తాత దగ్గర ఒక బాక్స్ ఉంటుంది లింగా తాత లింగాని చూసి లింగా నీకు ఎప్పుడైనా ఏదైనా సమస్య వస్తే దానికి పరిష్కారం ఈ బాక్స్ లో ఉంటుంది అని చెప్పి ఉంటాడు తన తాతయ్య చనిపోయాక లింగా పెరిగి పెద్దయ్యి ఆ అడవులోకి వెళ్లి వస్తూ
ఉంటాడు ఆ బాక్స్ ని వెతకడానికి వెళుతూ ఉంటాడు ఎందుకంటే తన తాతతో పాటు ఆ బాక్స్ కూడా కనబడకుండా పోయి ఉంటుంది ఫైనల్ గా ఒకరోజు లింగాకి ఆ బాక్స్ కనిపిస్తుంది లింగా ఆ బాక్స్ ని తన ఇంటికి తీసుకువచ్చి ఆ బాక్స్ ని ఓపెన్ చేయగా అందులో కొన్ని బట్టలు ఒక పుస్తకం ఉంటుంది.
అప్పుడు లింగా ఆ పుస్తకాన్ని చదవడం స్టార్ట్ చేస్తాడు ఆ పుస్తకం ద్వారా లింగాకి కొన్ని విషయాలు తెలుస్తాయి 18 వ శతాబ్దంలో రుద్రగిరి రాజ్యాన్ని మాచి రాజు అనే పేరు గల ఒక రాజు పరిపాలిస్తూ ఉంటాడు కానీ ఆ రాజు ప్రజల కోసం పని చేయకుండా ధనం కోసం పోరాడుతూ ఉంటాడు చాలా రాజ్యాల మీద దండెత్తి ఆ రాజ్యాలని దోచుకుంటూ ఉంటాడు అదే టైం లో ఆ
రాజు చూపు కళింగ రాజ్యం మీద పడుతుంది ఆ కళింగ రాజ్యాన్ని రణసింహ అనే ఒక వ్యక్తి పరిపాలిస్తూ ఉంటాడు కానీ ఆ మాచిరాజు రణసింహ మీద గెలవలేకపోతాడు ఈ ఓటమిని తట్టుకోలేక మాచిరాజు అవమాన భారంతో ఒకరోజు తను చనిపోతాడు.
ఆ తర్వాత ఆ మాచిరాజు కొడుకు రాజు అయిన తర్వాత రణ సింహ మీద పగ తీర్చుకోవాలి అని డిసైడ్ అయ్యి తన మంత్రులతో కూర్చొని ఆ కళింగ రాజుని ఎలా అయినా ఓడించాలి అని ప్లాన్ చేయడం స్టార్ట్ చేస్తాడు కానీ ఈ మాచిరాజు కొడుకు కూడా రణసింహాన్ని ఓడించలేకపోతాడు ఆ తర్వాత ఈ మాచిరాజు కొడుకు బ్లాక్ మ్యాజిక్ సహాయం తీసుకుని తాంగ అనే పేరు గల ఒక తాంత్రికుడిని కలిసి అసుర దక్షిణి అనే పేరు గల ఒక సైతాన్ని భూమి మీదకి వచ్చేలాగా చేస్తాడు ఆ అసుర దక్షిణి సహాయంతోనే మాచిరాజు కొడుకు కళింగ రాజ్యం మీద గెలుస్తాడు కళింగ రాజ్యంలో ఒక అమ్మవారి విగ్రహం కూడా ఉంటుంది ఆ విగ్రహాన్ని కూడా వాళ్ళు సొంతం చేసుకుంటారు ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ రాక్షసుడు ఆ రాజ్యాన్ని అంటే మాచిరాజు రాజ్యంలోని ప్రజల్ని చంపి తినడం మొదలు పెడతాడు చెడు శక్తుల ప్రభావం ఎక్కువగా అవుతుంది.
మాచిరాజు కొడుకు అదే తాంత్రికుడు దగ్గరికి వెళ్లి సహాయం అడుగుతాడు కానీ ఆ తాంత్రికుడు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాడు ఫైనల్ గా ఆ మాచిరాజు కోడలైనటువంటి శకుంతల ఒక మహర్షి దగ్గరికి వెళ్లి దానికి సొల్యూషన్ అడుగుతుంది ముందుగా ఆ మహర్షి శకుంతలని చూసి ఒకవేళ నీ
భర్త ధర్మ యుద్ధం చేసి ఉంటే ఈ ఇబ్బంది వచ్చి ఉండేది కాదు ఆ పాపమే మీ రాజ్యం మీద వచ్చి పడింది ఇప్పుడు ఆ పాపాన్ని అనుభవించి తీరాల్సిందే అని అంటాడు శకుంతల మాత్రం ఆ మహర్షిని బాగా రిక్వెస్ట్ చేసి తెలిసి తెలియని తనంతో నా భర్త తప్పుచేశాడు. కానీ అమాయకమైన ప్రజలు కూడాచనిపోతున్నారు దయచేసి దీనికి తగిన పరిష్కారాన్ని చెప్పండి అని అడుగుతుందిఅప్పుడు ఆ మహర్షి వెంటనే శకుంతలని చూసి మీరు మీ రాజ్యం బయట ప్రత్యంగిరా దేవి ఆలయాన్ని నిర్మించాలి పురాణాల ప్రకారం మాత ప్రత్యంగిరా రూపంలో నరసింహ స్వామి క్రోధాన్ని శాంతింప చేసింది ఆ అమ్మవారే చెడు శక్తుల్ని గ్రామంలోకి రాకుండా ఆపుతుంది అదేవిధంగా మీ వంశానికి చెందిన ఒక వ్యక్తి పాతాళ గంగ దగ్గర ఉన్న ఒక గుహ దగ్గరకు వెళ్లి అక్కడ అమ్మవారిని తలుచుకుని ఆత్మార్పణ చేసుకోవాలి అని చెప్తాడు కానీ ఈ విషయం శకుంతల ఎవరితోనూ చెప్పుకోదు.
బలి ఇవ్వాలి అంటే తన భర్తనే ఇవ్వాల్సి ఉంటుంది లేదా తన కొడుకుల్ని బలి ఇవ్వాల్సి ఉంటుంది ఇలా చాలా సంవత్సరాలు గడిచిన తర్వాత ఆ గ్రామంలో అలానే చావులు సంభవిస్తూ ఉంటాయి ఈ సీన్ నే మనకు మూవీ స్టార్టింగ్ లో చూపించడం జరిగింది అలా ఒకరోజు ఆ గ్రామంలోని వాళ్ళు తమంతట తాముగా చనిపోతూ ఉంటారు దీని గురించి ఆ గ్రామం ప్రజలందరూ కూడా జమీందార్ ని పరిష్కారం అడుగుతారు ఆ సమస్యకు పరిష్కారం కోసమే ఆ జమీందారు వెళ్లి తన అమ్మని అడుగుతాడు నిజానికి ఆ జమీందార్ అమ్మ ముసలావిడి ఎవరో కాదు తనే శకుంతల ఈ సమస్యకు పరిష్కారం కోసమే శకుంతల కొడుకు గ్రామం కోసమని ఆ గుహ దగ్గరికి వెళ్లి అక్కడ తనని తాను ఆత్మార్పణ చేసుకుంటాడు.
స్టోరీ ప్రెజెంట్ కి వస్తుంది ఈ విషయాలన్నీ కూడా లింగా తన ఫ్రెండ్ కి చెప్తూ ఉంటాడు అదేవిధంగా లింగా కూడా ఆ రాజ వంశానికి చెందిన వాడే అయి ఉంటాడు లింగా ప్లాన్ చేసి ఆ నాలుగు ఎకరాల భూమిని తన పేరు మీదకి రాయించుకుని ఉంటాడు ఆ అడవిలోకి వెళ్లి ఆ గుహను కనిపెట్టి అమ్మవారి విగ్రహాన్ని పొందాలి అని లింగా అనుకుంటూ ఉంటాడు అలాగే ఖజానాన్ని కూడా పొందాలి అనుకుంటూ ఉంటాడు అందువల్ల లింగా ప్రతి రోజు రాత్రి లింగా ఆ గుహను వెతుకుతూ ఉంటాడు ఫైనల్ గా ఆ గుహను వెతికి లింగా మరియు అతని ఫ్రెండ్ దాని లోపలికి వెళ్తారు.
ఆ గుహ లోపల ఈ విషయాలన్నీ కూడా శకుంతల కొడుకు స్కెచ్ రూపంలో రాసి ఉంటాడు అలా చాలా లోపలికి వెళ్ళిన తర్వాత లింగా మరియు తన ఫ్రెండ్ కి శకుంతల కొడుకు ఆత్మార్పణ చేసుకున్న ఆ ప్రదేశం అలాగే అతని అస్థిపంజరం కూడా కనిపిస్తుంది అక్కడ చాలా సామాన్లు కత్తులు ఖజానాలు దేవి విగ్రహం కూడా కనిపిస్తుంది లింగా మరియు తన ఫ్రెండ్ ఇవన్నీ చూసి చాలా సంతోషిస్తారు. సరిగ్గా అదే సమయంలో ఆ గుహ లోపలికి బలి ఇంకా అతని మనుషులు కూడా వస్తారు అప్పుడు బలి ఈ అడవిలోకి ఎవరు వస్తారో వాళ్ళు తిరిగి వెళ్ళలేరు అని నేను విన్నాను కానీ ఇప్పటివరకు నువ్వు ఎలా బ్రతికి ఉన్నావు అని అడుగుతాడు.
ఆ తర్వాత లింగా మరియు బలికి మధ్య చాలా పెద్ద ఫైట్ జరుగుతుంది ఆ ఫైట్ వల్ల వచ్చే అరుపులువిని ఆ రాక్షసుడు అక్కడికి వస్తాడు. ఆ రాక్షసుడు గ్రామంలోని వాళ్ళందరినీ కూడా తింటూ ఉంటాడు అక్కడికి వచ్చిన ఆ రాక్షసుడు బలి గ్యాంగ్ లోని మనుషులందరినీ కూడా చంపుతూ ఉంటాడు అలాగే బలిని కూడా చంపేస్తాడు ఫైనల్ గా లింగా అక్కడ ఉన్న కత్తిని తీసుకుని ఆ రాక్షసున్ని చంపేస్తాడు ఆ తర్వాత లింగా మరియు అతని ఫ్రెండ్ ఖజానా మొత్తం తీసుకుని తమ గ్రామానికి వెళ్తారు నిజానికి ఆ తాంత్రికురాలు పద్దుకి లింగా సేఫ్టీ కోసమని తాయత్తులు కట్టి ఉంటుంది ఆ తాయిత్తుల వల్లనే రాక్షసుడు లింగా దగ్గరికి వచ్చి ఉండడు నిజానికి లింగా ఒక గొప్ప నక్షత్రంలో పుట్టిన వ్యక్తి అయి ఉంటాడు ఆ నక్షత్రంలో పుట్టిన వ్యక్తి ఆ రాక్షసున్ని చంపగలడు అలా లింగా ఆ రాక్షసున్ని చంపేస్తాడు.
:::::శుభం :::::
FOR MORE MOVIE STORIES WEBSERIES STORIES Please visit our Website: Filmywebstories.com