SWAG (స్వాగ్ ) Full Movie Explanation

1334938 Swag

హాయ్ ఫ్రెండ్స్ Welcome to Filmywebstories.com అక్టోబర్ 04th 2024 లో Release అయినటువంటి  (SWAG) స్వాగ్ అనే కామిడీ థ్రిల్లర్ మూవీ స్టోరీ గురించి తెలుసుకుందాం. 

Movie Begining Story:

మూవీ స్టార్ట్ అవ్వగానే మనకి ఎస్ఐ భవభూతిని చూపిస్తారు అతను ఎన్నోసంవత్సరాలుగా పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసినందుకు తనకైతే సన్మానం జరుగుతూ ఉంటుంది. కానీ భవభూతికి ఆడవాళ్ళు అంటే చులకన భావం ఎక్కువ, ఈ కారణం చేత భవభూతికి రావాల్సినటువంటి ఫండ్స్ అండ్ పెన్షన్ ని డిఎస్పి ధనలక్ష్మి క్యాన్సిల్ చేస్తారు. అదంతా చూసి భవభూతి కోపంతో ఊగిపోతాడు తరువాతి సీన్ లో భూతికి ఎవరో తెలియని వ్యక్తి నుంచి ఒక లెటర్ వస్తుంది ఆ లెటర్ లో స్వాగనిక వంశానికి సంబంధించిన ఆస్తులకి వారసులు మీరే, ఆస్తి మీకు సొంతం కావాలి అంటే వంశవృక్ష నిలయం అనే చోటుకి వెళ్లి మీ వివరాలను నమోదు చేయించుకోవాలని చెప్పి ఆ లెటర్ లో రాసి ఉంటుంది. అదంతా కూడా తన కానిస్టేబుల్స్ తో చెప్పి వాళ్ళతో కలిసి వంశ వృక్ష నిలయానికి బయలుదేరుతాడు. ఈ వంశ వృక్ష నిలయం అనే చోటుని మహర్షి అనే వ్యక్తి తన అమ్మతో కలిసి రక్షిస్తూ ఉంటాడు. నిజానికి మహర్షి వాళ్ళ తరతరాలుగా స్వాగనిక వంశానికి బంధించిన నిధిని కాపాడుతూ ఉంటారు. ఈ తరంలో స్వాగనిక వంశానికి సంబంధించిన వాళ్ళకి వాళ్ళ వంశ నిధిని అప్పగించడమే వీళ్ళ పని అయితే మహర్షి వాళ్ళ నాన్న స్వాగనిక వంశానికి సంబంధించిన వ్యక్తి యొక్క వివరాలు నమోదు చేసి ఉండడు. వంశవృక్ష నిలయం అనే సంస్థని ముందుకు తీసుకువెళ్ళాలి అంటే డబ్బు అవసరం, ఆ డబ్బుని తమ వంశానికి సంబంధించిన ఆస్తిని ఎన్ని సంవత్సరాలు కాపాడి తమకి అందజేసినందుకు స్వాగనిక వంశానికి సంబంధించిన వారసుడు మహర్షి వాళ్ళకి కానుకగా ఇస్తూ ఉంటారు. అయితే వాళ్ళ నాన్నగారు ఆ వంశంలో పుట్టినటువంటి యయాతి అనే వ్యక్తి యొక్క పిల్లల వివరాలు నమోదు చేయకపోవడంతో కేవలం యయాతి పేరుని నమోదు చేసినప్పుడు వచ్చిన డబ్బుతోనే ఇంతకాలం నడుపుకుంటూ వస్తారు.

అయితే అలా వచ్చిన డబ్బు కూడా అయిపోవడంతో మళ్ళీ డబ్బు కావాలంటే స్వాగనిక వంశానికి సంబంధించినటువంటి వారసుల పేర్లను నమోదు చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఒక చిన్న చిక్కు ఉంటుంది అదేమిటంటే స్వాగనిక వంశ వారసులకు ఎప్పుడైతే అమ్మాయి పుడుతుందో అప్పటినుంచి వాళ్ళకి స్వాగనిక వంశానికి సంబంధించిన ఆ నిధి మీద ఎలాంటి అధికారం ఉండదు పైగా ఆ నిధి మీద ఇప్పటివరకు దానిని కాపాడుతూ వస్తున్నటువంటి మహర్షి వాళ్ళకి పూర్తి అధికారం వస్తుంది అందుకే మహర్షి ఈ వంశంలో పుట్టింది అమ్మాయి అని చెప్పి నమోదు చేద్దాం అమ్మ దానితో ఈ ఆస్తి అంతా మనదవుతుంది అని అడుగుతాడు వాళ్ళ అమ్మని. ఆ మాటలకి వాళ్ళ అమ్మ నువ్వు అలా నమోదు చేయాలన్నా సరే ముందు మనకి ఆ వంశానికి సంబంధించిన ఆడపిల్ల దొరకాలి కదా ముందు ఆ అమ్మాయిని కనిపెట్టు అని చెప్తుంది. నిజానికి మహర్షి వాళ్ళ అమ్మకి మాత్రం ఆ స్వాగనిక వంశం వారికే ఇవ్వాలి అని చెప్పి ఉంటుంది మహర్షి మాత్రం ఎలాగైనా సరే ఆస్తిని తీసుకోవాలి అని ఆ వంశంలో ఆఖరిగా అమ్మాయే పుట్టింది అని నిరూపించాలి అనుకుంటాడు అందుకోసమే ఆ స్వాగనిక వంశానికి సంబంధించిన వాళ్ళని వెతకమని చెప్పి తన టీం ని పంపిస్తాడ. మరోవైపు మహర్షికి కూడా వరుసగా ఆడపిల్లలే పుడుతూ ఉంటారు నిజానికి స్వాగనిక వంశానికి సంబంధించిన ఆ నిధి మహర్షికి సొంతం కావాలంటే మహర్షికి తప్పకుండా వారసుడు కలిగి ఉండాలి. అందుచేత మహర్షి కూడా తన వారసుడి కోసం ప్రయత్నిస్తూ ఉంటాడు. 

 నెక్స్ట్ సీన్ లో భవభూతి అక్కడికి వచ్చి స్వాగనిక వంశానికి సంబంధించిన వారసుడిని నేనే అని చెప్పి ఆస్తిని తనకి ఇవ్వమంటాడు అప్పుడే కన్ఫర్మేషన్ కోసం మహర్షి భవభూతిని ఆధార్ కార్డు ఇవ్వమంటాడు అయితే ఆధార్ కార్డులో భవభూతి యొక్క ఇంటి పేరు అలాగే తండ్రి పేరు వేరుగా ఉంటాయి. ఇక ఇంటి పేరు తండ్రి పేరు వేరుగా ఉండడంతో మహర్షి మీరు వారసులు కాదు అని చెప్పి భవభూతిని అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఇక భవభూతి కూడా తనే వారసుడిని అని చెప్పి నిరూపించుకోవడానికి ఏం చేయాలి అని అడుగుతాడు. మీరు ఈ వంశానికి చెందిన వాళ్ళు అని చెప్పి నిన్ను నమ్మాలి అంటే మీ వంశ పారంపరంగా మీ వంశ చిహ్నం కలిగినటువంటి ఆ రాగి పలక నాకు కావాలి అని అడుగుతాడ. అయితే నిజానికి ఆ రాగి పలక భవభూతి దగ్గర ఉండదు ఆస్తిని ఎలాగైనా సరే చేక్కించుకోవాలి అని చెప్పి ఆ పలకని తీసుకువస్తాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. 

 మహర్షి మాత్రం భవభూతికి ఆ వంశానికి సంబంధించిన పోలికలు ఉన్నా సరే ఆస్తి మీద మక్కువతో భవభూతిని వారసుడిగా ఒప్పుకోడు మరోవైపు మనకి స్టేషన్ లో ఉన్నటువంటి భవభూతిని చూపిస్తారు నిజానికి ఈ స్వాగనిక వంశానికి సంబంధించినటువంటి ఎలాంటి విషయాలు కూడా భవభూతికి తెలిసి ఉండవు తనకి వచ్చినటువంటి ఉత్తరంలో భవభూతి పోలికలతో ఉన్నటువంటి యతి ఫోటో ఉండడంతో కచ్చితంగా తనే వంశానికి సంబంధించిన వారసుడిని అని చెప్పి అక్కడికి వెళితే తీరా తను పలక అడిగేటప్పటికి ఏం చేయాలో అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు భవభూతి.  తరువాత  మనకి అనుభూతి (Rithu Varma) అనే ఒక అమ్మాయిని చూపిస్తారు. దానికి అనుభూతి ఒక ఇండిపెండెంట్ ఉమెన్. ఆమెకి మగాళ్ళు అంటే చెడ్డ చిరాకు.  ఆడవాళ్ళని మగవాళ్ళ కంటే తక్కువ చేసి చూడడాన్ని అనుభూతి భరించలేకపోతుంది అయినా సరే ఈ అలవాటుని మార్చాలి అని చెప్పి ఫిక్స్ అవుతుంది అనుభూతి ఈ కారణం మీదే అనుభూతి తన బాయ్ ఫ్రెండ్ తో కూడా బ్రేకప్ చేసుకుంటుంది అయితే అనుభూతి వాళ్ళ మదర్ కి ఒంట్లోకి బాగోకపోవడంతో తనని హాస్పిటల్ లో అడ్మిట్ చేసి ఉంటారు అయితే అనుభూతి వర్క్ ప్లేస్ లో ఎవరో తనతో మిస్ బిహేవ్ చేస్తారు ఇదే విషయాన్ని ఓనర్ తో చెప్తే ఓనర్ అనుభూతితో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తితో పాటు అనుభూతిని కూడా వర్క్ లో నుంచి తీసేస్తాడు. ఎందుకు కంటే అనుభూతి ఇక్కడ ఉంటే ఇంకొకరు తనతో ఇలా రోజు మిస్ బిహేవ్ చేస్తూ ఉంటారు దాని వల్ల ఎక్కువగా గొడవలు వస్తాయి కాబట్టి అనుభూతిని కూడా వర్క్ లో నుంచి తీసేసి ఉంటాడు ఓనర్. అయితే అనుభూతి డబ్బుల కోసం తన ఇంట్లోని పాత సామాన్లను అమ్మేస్తూ ఉంటుంది. అప్పుడే మనకి స్వాగనిక వంశానికి సంబంధించినటువంటి పలక అక్కడ కనబడుతుంది. మనకి అర్థమవుతుంది స్వాగనిక వంశానికి సంబంధించిన వారసురాలు ఇంకెవరో కాదు అనుభూతి అని అయితే వాళ్ళ వంశం గురించి అనుభూతికి ఏ విషయం తెలిసి ఉండదు అందుకే ఆ పలకని అమ్మేసి ఉంటుంది మరోవైపు భవభూతి ఎలాగైనా సరే తనే వారసుడిని అని చెప్పి నిరూపించుకోవాలి అని రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇక్కడే మనకి భవభూతికి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. 

FLASH BACK STORY:

భవభూతికి రేవతి అనే మహిళతో మ్యారేజ్ అయి ఉంటుంది అయితే రేవతి సెవెంత్ మంత్ ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు భవభూతికి తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటుంది అప్పటి నుంచి భవభూతి తన భార్యని గుర్తు చేసుకుంటూ ఎంతో బాధపడుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ లో అచ్చం భవభూతికి వచ్చినట్లే ఇంకొక లెటర్ అచ్చు భవభూతి పోలికలతో ఉన్నటువంటి సింగరేణి అనే వ్యక్తి దగ్గరికి వెళ్తుంది నిజానికి సింగరేణి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లూయన్సర్ సింగా ఎంత కష్టపడినా సరే తన వీడియోస్ అయితే సోషల్ మీడియాలో వైరల్  అవ్వవు.  అలా తన వీడియోలు ఎలాగైనా సరే వైరల్ కావాలి అని చెప్పి ఏకాంబరం అనే ఒక జ్యోతిష్యుడి దగ్గరికి వెళ్లి సింగా తన యొక్క ప్రాబ్లం ని చెప్తాడు అలా ఏకాంబరం చెప్పినట్లు చేసిన వెంటనే సింగా యొక్క వీడియో వైరల్ అవుతుంది అదంతా చూసినటువంటి సింగా ఏకాంబరాన్ని బాగా నమ్మడం స్టార్ట్ చేస్తాడు. సింగాకి మౌని అనే ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది.  నెక్స్ట్ సీన్ లో అనుభూతి అమ్మేసినటువంటి రాగి పలక మహర్షి శిష్యుల్లో ఒకడికి దొరుకుతుంది వెంటనే ఆ పలక ఉన్నటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి దీన్ని నీకు ఎవరు అమ్మారు అని అడిగితే ఆ వ్యక్తి అనుభూతి యొక్క అడ్రస్ ని ఆ శిష్యులకు చూపిస్తాడు ఆ పలకని తీసుకొని ఒక శిష్యుడు అనుభూతి దగ్గరికి వెళ్లి ఈ పలక ఎవరిది అని అడుగుతాడు అప్పుడే అనుభూతి ఈ పలక మా అమ్మది అని చెప్తుంది ప్రాసెస్ లోనే చిన్న అనే శిష్యుడు అనుభూతి వాళ్ళ మదర్ హెల్త్ బాగోలేదు అని తెలుసుకొని అనుభూతిని కన్విన్స్ చేసి మహర్షి దగ్గరికి తీసుకువెళ్లి ఈ అమ్మాయి పేరుని నమోదు చేయిస్తే ఆస్తి మొత్తం మహర్షికే చెందుతుంది ఆ ఆస్తిలో కొంత వాటాని ఆ అమ్మాయికి ఇస్తే ఏమి మాట్లాడకుండా వెళ్ళిపోతుంది అని చెప్పి అతను ప్లాన్ వేసి అనుభూతిని వంశవృక్ష నిలయానికి వచ్చి తమ ఆస్తిని తీసుకోమని చెప్తాడు. 

 మరోవైపు భవభూతి ఆస్తిని పొందడానికి తనకి చిన్నప్పుడు ఒక చెల్లి ఉండేదని అయితే తను చిన్నప్పుడే చనిపోయిందని ఒక కథని అల్లుతాడు కానీ మహర్షి మాత్రం ఎవరైతే నాకు ఆ పలకని తీసుకువచ్చి ఇస్తారో వాళ్ళనే ఈ ఆస్తికి వారసులుగా నేను నమోదు చేస్తాను అని చెప్తాడు మరోవైపు సింగా ఎలాగైనా సరే తను ఫేమస్ అవ్వాలి అని చెప్పి తన జాతకాన్ని ఏకాంబరానికి చూపిస్తాడు ఆ జాతకాన్ని చూసినటువంటి ఏకాంబరం నీకు రాజయోగం పట్టాలి అంటే నీకు మగపిల్లాడు పుట్టాలి ఆ మగపిల్లాడు పుట్టేటటువంటి జాతకం ఉన్న అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటే నీకు రాజయోగం వస్తుంది అని చెప్తాడు అయితే ఆల్రెడీ ఇంకా మౌనిని ప్రేమిస్తూ ఉండడంతో మౌని యొక్క జాతకాన్ని చూపిద్దామని చెప్పి మౌనిని తీసుకొని ఏకాంబరం దగ్గరికి వస్తాడు సింగా అక్కడే అదిరిపోయే ట్విస్ట్ మౌని ఇంకెవరో కాదు ఏకాంబరం కూతురు అది చూసినటువంటి ఏకాంబరం కోపంతో నీలాంటి వాడికి నా కూతుర్ని ఇవ్వను అని చెప్పి సింగాని అవమానిస్తాడు అసలు మీ అమ్మాయిని నాకు ఇవ్వడానికి మీకున్న ప్రాబ్లం ఏంటి సార్ అని చెప్పి సింగా అడిగినప్పుడు ప్రాబ్లం ఏమిటా అసలు మీ నాన్న ఎవరో నీకు తెలుసా మీ అమ్మ రేవతి పాఠాలు బాగానే చెప్పేది కానీ తన భర్త  ఎవరు అన్న విషయాన్ని మాకు చెప్పలేదు. నీలాంటి వాడిని అసలు ఏమంటారో తెలుసా అని చెప్పి సింగాని అందరి ముందు అవమానిస్తాడు ఆ అవమానాన్ని భరించలేక సింగా ఇంకెప్పుడు మీకు కనిపించను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు బాధతో ఇంటికి వచ్చినటువంటి సింగాకి ఒక లెటర్ కనిపిస్తుంది లెటర్ లో అసలు రేవతి ఎందుకు భవభూతి దగ్గర నుంచి వెళ్ళిపోయింది అని ఉంటుంది. 

 దానికి భవభూతి రేవతిని మంచిగా చూసుకున్నా సరే ఆడవాళ్ళు అంటే చులకన భావన ఉన్న భవభూతి తన కడుపున ఆడపిల్ల పుట్టడాన్ని భరించలేక భార్య కడుపులో ఉన్నది ఆడపిల్ల అని తెలిసిన వెంటనే ఏదో విధంగా గర్భం పోయేలా చేస్తూ ఉంటాడు. అయితే రేవతి మాత్రం ఆడ, మగ అనే తేడా ఏమి లేకుండా ఇద్దరు సమాన హక్కులతో ఉండాలి అనే భావనతో ఉంటుంది అయితే రేవతి తనకి వరుసగా గర్బం పోతుండడంతో  చాలా  బాధపడుతూ ఉంటుంది. అయితే బాధపడుతున్న రేవతిని భవభూతి ఓదారు వస్తున్నట్లు నటిస్తూ ఉంటాడు అయితే ఈసారి మళ్ళీ రేవతికి  ప్రెగ్నెంసీ నిలబడుతుంది. అయితే ఈసారి తన కడుపులో ఉన్నది అబ్బాయి అని తెలుసుకున్నటువంటి భవభూతి ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు అప్పుడే రేవతి డాక్టర్  ద్వారా తనకి వరుసగా  ప్రెగ్నెంసీ పోవడానికి కారణం భవభూతి అని తెలుసుకొని ఎంతో బాధపడుతుంది అందుకే తను ప్రెగ్నెంట్ గా ఉన్నా సరే ఎవరికీ తెలియకుండా భవభూతి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోయి ఉంటుంది రేవతి అలా దూరంగా వచ్చేసిన రేవతి సింగరేణికి జన్మనిస్తుంది. 

 అలా ఆ స్టోరీ ప్రెసెంట్ కి వస్తుంది లో ఈ స్టోరీ తో పాటు యతి యొక్క ఫోటో కూడా ఉంటుంది అచ్చం తనలాగే ఉన్నటువంటి ఆ వ్యక్తిని చూసినటువంటి సింగరేణి వంశవృక్ష నిలయానికి వెళ్ళడానికి ఫిక్స్ అవుతాడు మరోవైపు అనుభూతి యతికి వారసురాలిగా మారడానికి వంశవృక్ష నిలయానికి వస్తుంది అనుభూతిని చూసినటువంటి మహర్షి తప్పకుండా ఈసారి తనకి అబ్బాయే పుడతారు ఈ ఆస్తి అంతా తన సొంతమే అవుతుందని ఎంతో ఆనందపడుతూ శాస్త్రోత్రంగా అనుభూతిని వారసులాలిగా ప్రకటించే ప్రక్రియని ప్రారంభిస్తాడు. అప్పుడే అక్కడికి భవభూతి వచ్చి ఈ ఆస్తికి నేనే అసలైన వారసుడిని అని చెప్పి గొడవడుతూ ఉంటాడు. అప్పుడే మహర్షికి తనకి అమ్మాయి పుట్టినట్లు ఫోన్ వస్తుంది అయితే నిజానికి మహర్షి వాళ్ళ వంశానికి ఉన్న శాపం ప్రకారం స్వాగనిక  వంశంలో వారసురాలుగా ఎప్పుడైతే అమ్మాయి పుడుతుందో అప్పుడే మహర్షి వాళ్ళ వంశంలో అబ్బాయి పుడతాడు కానీ మహర్షికి మళ్ళీ అమ్మాయి పుట్టడంతో కచ్చితంగా స్వాగనిక  వంశానికి సంబంధించిన నిజమైన వారసుడు ఎక్కడో ఉన్నాడు అని చెప్పి అందరికీ అర్థమవుతుంది. మహర్షి శిష్యుల్లో ఒకడు ఈ శాపానికి నేను విరుగుడు కనిపెట్టాను అని చెప్పి ఒక విషయాన్ని చెప్తాడు.

అది ఏమిటంటే మహర్షి గారు ఎప్పుడైతే యతికి పిల్లలు పుట్టారో అదే సమయంలో మీరు కూడా జన్మించారు అంటే మీ వంశానికి ఉన్న శాపం ప్రకారం యతికి పుట్టింది అబ్బాయి అయితే మీ నాన్నగారికి అమ్మాయి జన్మించి ఉండాలి కానీ మీరు పుట్టారు అంటే యతికి అమ్మాయి పుట్టి ఉండాలి కానీ యతికి అమ్మాయి పుడితే అక్కడ ఆ వంశం ఆగిపోయి ఉంటుంది ఆ లెక్క ప్రకారం మీకు ఇప్పుడు అబ్బాయి పుట్టి ఉండాలి కానీ మీకు అమ్మాయి జన్మించింది అంటే కచ్చితంగా యతికి పుట్టింది అమ్మాయి లక్షణాలు ఉన్న అబ్బాయి అయి ఉండాలి అని చెప్తాడు. అప్పుడే డౌట్ వచ్చినటువంటి మహర్షి అసలు ఆ పలక నీకు ఎక్కడ దొరికింది మీ అమ్మ పేరేంటి అని చెప్పి అనుభూతిని అడుగుతాడు ఇప్పుడే అనుభూతి ఆ రోజు మహర్షి శిష్యుడికి చూపించింది వాళ్ళ అమ్మ కాదు అని నిజానికి అనుభూతి వాళ్ళ అమ్మ ఒక ట్రాన్స్ జెండర్ అన్న విషయాన్ని అందరికీ చెప్తుంది. మరోవైపు వంశవృక్ష నిలయానికి వస్తున్నటువంటి సింగరేణిని వాళ్ళ అమ్మ విభూతి వస్తున్నటువంటి ఆటో గుద్దేయడంతో సింగరేణి కింద పడిపోతాడు అదే టైం లో అటుగా వెళ్తున్న భవభూతికి అక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగిందని అక్కడికి వచ్చి చూస్తాడు ఇప్పుడే మనకి ఆటోలో నుంచి కిందకి దిగుతున్న భవభూతి సింగరేణి పోలికలతో ఉన్న విభూతిని చూపిస్తారు అలా భవభూతి సింగరేణి విభూతి ఒకరినొకరు చూసుకుని చూడడానికి ముగ్గురం ఒకేలా ఉన్నామని చెప్పి షాక్ అవుతారు. 

History of the Swaganik Family:

అసలు ఈ స్వాగనిక వంశం ఎలా ప్రారంభమైంది అన్న విషయాన్ని మనకి చూపిస్తారు 1551వ సంవత్సరంలో జామర అనే మాతృస్వామ్య వంశంలో పుట్టినటువంటి రుక్మిణి అనే మహారాణి తమ రాజ్యంలో ఉన్న పురుషులకి ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం మహిళా పరిపాలన మాత్రమే కొనసాగిస్తూ ఉంటుంది తమ మీద జరుగుతున్నటువంటి అణచివేతని భరించలేక రాజ్యంలోని పురుషులందరూ కోపంతో ఊగిపోతూ ఉంటారు వాళ్ళలో ఒకడైనటువంటి రుక్మిణి దేవి భర్త స్వాగనిక వంశానికి మూల పురుషుడైనటువంటి మహారాజ భవభూతి తెలివిగా సమయం చూసుకుని ఈ రాజ్యపాలన మొత్తం చేజెక్కించుకోవాలి అని చెప్పి వేచి చూస్తూ ఉంటాడు. నిజానికి రుక్మిణి దేవికి అప్పటికే ఏడుగురు పుట్టి చనిపోయి ఉంటారు ఈసారి రుక్మిణి దేవి ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. అయితే అప్పటికే ఈ ఏడుగురు బిడ్డలు పుట్టి చనిపోవడంతో ఈసారి పుట్టిన ఆ మగబిడ్డకి ఏమీ కాకూడదు అని చెప్పి రుక్మిణి దేవి ఆలోచిస్తూ ఉంటుంది.

ఈ సమయాన్ని అవకాశంగా తీసుకున్న భవభూతి రుక్మిణి దేవి యొక్క వంశం పేరుని కొడుకుకి పెడితే తన కొడుకుకి ప్రాణగండం ఉందని రుక్మిణి దేవిని నమ్మించి భవభూతి తన స్వాగనిక వంశానికి తన కొడుకుని వారసుడిగా ప్రకటిస్తాడు. అప్పటి నుంచే రాజ్యంలో పితృస్వామ్య పాలనం ప్రారంభమైనట్లు చూపిస్తారు అలా పింజామర వంశానికి సంబంధించిన ఆస్తి మొత్తాన్ని స్వాగనిక వంశానికి దక్కేటట్లు చేస్తాడు భవభూతిభూతి.  చేస్తుంది తప్పు అని చెప్పడానికి ప్రయత్నించిన మహర్షి వాళ్ళ ముత్తాతకి భవభూతి ఇప్పటి నుంచి తన స్వాగనిక వంశంలో జన్మించిన వారసుల యొక్క వివరాలు ప్రతి తరంలోనూ మీ వంశం వాళ్లే నోట్ చేసి స్వాగనిక వంశానికి సంబంధించిన నిధి నిక్షేపాలు  తరతరాలుగా మా వారసులకు అందుచేయాలి లేదంటే ఎప్పుడైతే ఈ వివరాలను నమోదు చేయడం మానేస్తారో అప్పటితో మీ వంశం అంతరించిపోతుంది అని చెప్పి భవదీయుడు మహర్షి వాళ్ళ ముత్తాతని శపిస్తాడు. వెంటనే మహర్షి వాళ్ళ ముత్తాత అలాగే మహారాజా ఎప్పుడైతే మీ వంశంలో ఆడపిల్ల పుడుతుందో అప్పటితో మీ వంశానికి ఆ నిధి మీద ఉక్కుపోయి ఇప్పటివరకు కాపాడుతున్న నా వంశానికి ఆ నిధి మొత్తం చెందుతుంది అని అంటాడు అలాగే ఈ స్వాగనిక వంశానికి సంబంధించిన ఆస్తి మీ వంశం వాళ్ళకి చెందాలి అంటే నేను దగ్గరుండి చేయించిన ఈ స్వాగనిక వంశ చిహ్నం ఉన్న రాగి పలక ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళనే స్వాగనిక వంశానిధికి వారసులుగా ప్రకటిస్తాను అని చెప్తాడు. ఆ  మాటలకి రాజు అయిన భవదీయుడు కూడా అంగీకరిస్తాడు.. 

 స్టోరీ ప్రెసెంట్ కి వస్తుంది ఎస్ఐ భవభూతి విభూది అండ్ సింగరేణిని సెల్ లో బంధిస్తాడు ఎందుకంటే ఒకవేళ ఆస్తి తనకి కాకుండా వీళ్ళిద్దరికీ చెందుతుందన్న భయంతో అప్పుడే సెల్ లో ఉన్నటువంటి సింగరేణి విభూతిని అసలు మీరెందుకు నాలా ఉన్నారు అని చెప్పి అడుగుతాడు అప్పుడే విభూతి ఈ లెటర్లన్నీ మీకు రాసింది నేనే అని చెప్పి అసలు ఏం జరిగిందో చెప్పడం స్టార్ట్ చేస్తుంది. నిజానికి స్వాగనిక  వంశానికి చెందిన యయాతి ఇల్లరికానికి వెళ్లి ఉంటాడు అందువల్ల తనకి రావాల్సినటువంటి ఆస్తి తనకి వచ్చి ఉండదు అయితే తన వంశ పారంపర్య ఆస్తి తనకి రావాలి అంటే తనకి ఖచ్చితంగా మగబిడ్డ పుట్టి ఉండాలి అందుకోసమే మగపిల్లాడి కోసం యయాతి ప్రయత్నిస్తూ ఉంటాడు ఈ ప్రయత్నంలోనే యయాతికి ఏడుగురు ఆడపిల్లలు పుడతారు అప్పుడే యయాతితో వాళ్ళ బావ  ఈసారి కూడా అమ్మాయి పుడితే మాత్రం నీ పని చాలా కష్టం బావ,  ఇంత మంది ఆడపిల్లలకు ఎలా పెళ్ళిళ్ళు చేస్తావు అని చెప్పి అడుగుతాడు మరోవైపు యయాతికి అబ్బాయి పుట్టకపోవడంతో తనకి రావాల్సిన ఆస్తిని మొత్తం మహర్షి వాళ్ళ నాన్న అనుభవిస్తూ ఉంటాడు. యయాతికి మగపిల్లాడు పుట్టకూడదు అని కోరుకుంటూ ఉంటాడు. 

 నెక్స్ట్ సీన్ లో యయాతి వాళ్ళ భార్య ఇద్దరు మగ కవల పిల్లలు పిల్లలకి జన్మనిస్తుంది తనకి మగపిల్లలు పుట్టారు అన్న విషయం తెలుసుకున్న యయాతి మొత్తానికి తన వంశపార్యంపర  ఆస్తి తనకి రాబోతుంది అని చెప్పి ఎంతో ఆనందంగా ఉంటాడు. మరోవైపు యయాతి వాళ్ళ బావకి  మాత్రం మళ్ళీ ఆడపిల్ల పుట్టినందుకు ఎంతో బాధపడుతూ ఉంటాడు అప్పుడే యయాతి తనకు పుట్టిన ఇద్దరు మగపిల్లల్లో ఒకళ్ళని తన బావకి దత్తతని ఇస్తాడు మిగిలిన ఆ ఒక్క వాడి పేరుని నమోదు చేయడానికి మహర్షి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి ఉంటాడు. యయాతి అయితే తన వంశానికి ఉన్న శాపం ప్రకారం యయాతి కి అబ్బాయిలు పుట్టారు కాబట్టి తనకి అమ్మాయి పుడుతుంది అని చెప్పి మహర్షి వాళ్ళ నాన్న ఎంతో బాధపడుతూ ఉంటాడు అయితే నిజానికి దత్తత ఇచ్చినా సరే తనకి పుట్టిన ఇద్దరు పిల్లల పేర్లు నమోదు చేయాల్సి ఉంటుంది అందుకే ఆ పిల్లాడి పేరు నమోదు చేయడానికి యయాతి వాళ్ళ బావ ఇంటికి వెళ్తాడు అయితే వాళ్ళ బావ దత్తత  తీసుకున్న తర్వాత పిల్లాడితో సహా రాత్రికి రాత్రి ఊరి విలిచి పారిపోతాడు. వంశంలో పుట్టిన ఇద్దరు పిల్లల పేర్లు నమోదు చేయకపోవడంతో యయాతికి తన వంశ పారంపర్య ఆస్తి అయితే రాదు మరోవైపు యయాతికి పుట్టింది ఇద్దరు మగపిల్లలే అయినా సరే విచిత్రంగా మహర్షి వాళ్ళ నాన్నకి అబ్బాయి పుడతాడు. ఇది చూసినటువంటి మహర్షి వాళ్ళ నాన్న శాపం కట్ట ఏమీ లేదు అని చెప్పి అప్పటినుంచి స్వాగనిక వంశానికి సంబంధించినటువంటి వాళ్ళ పేర్లు నమోదు చేయడాన్ని మానేస్తాడు మరోవైపు యయాతి ఆస్తి పోవడంతో ఇంకా చేసేదేమీ లేక తన పిల్లలని బాగా పెంచుకుంటూ ఉంటాడు మరోవైపు భవభూతిని తీసుకుని యయాతి వాళ్ళ బావ కలకత్తాకి వచ్చేసి ఉంటాడు. 

అయితే భవభూతి మాత్రం చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళ మీద ద్వేషాన్ని పెంచుకుంటూ పెరుగుతాడు ఒకానొక టైం లో వాళ్ళ అక్కల పెళ్లిలు చేసే బాధ్యత భవభూతి మీదే పడడంతో పోలీస్ ట్రైనింగ్ కోసం వేరే ఊరు వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ ఇంట్లో అబద్ధం చెప్పి ఎవరికీ తెలియకుండా పారిపోతాడు మరోవైపు యయాతి వాళ్ళ కొడుకు మాత్రం చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళ లక్షణాలతో పెరుగుతూ ఉంటాడు వయసు పెరిగే కొద్ది ఎక్కువ కావడంతో యయాతి కోపంతో తన కొడుకుని కొట్టిన సరే తను ఏమాత్రం మారడు తన కొడుకు పరిస్థితి అర్థం చేసుకున్న యయాతి  తనని ఏమీ అనలేక తన కొడుకుకి నచ్చినటువంటి డాన్స్ నేర్చుకోవడానికి ఒక స్కూల్లో జాయిన్ చేస్తాడు.  విభూతి క్లాసెస్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటికి తాళం వేసి ఉంటుంది దానికి తన కొడుకు అలా ఉండడంతో అందరూ తనని చూసి నవ్వుతారు అని చెప్పి యయాతి తన కొడుకు ఇంటికి వచ్చేలోగా తన ఫ్యామిలీని తీసుకుని ఆ ఊరి నుంచి వెళ్ళిపోతాడు. తన ఫ్యామిలీ తనని వదిలేసి వెళ్ళినందుకు విభూతి ఎంతో బాధపడుతూ ఉంటాడు తలుపు దగ్గర విభూతికి వాళ్ళ వంశ పారంపరంగా వస్తున్నటువంటి ఆ పలక కనిపిస్తుంది. మరోవైపు దారిలో ఆ పలక కోసం వెతుకుతున్నటువంటి యయాతికి ఆ పలక కనపడదు. అప్పుడే తన భార్య ఆ పలకని కావాలనే  విభూతికి ఇచ్చిందని అర్థమవుతుంది యయాతికి మరోవైపు విభూతి కూడా తన ఫ్యామిలీ తనని వదిలేసి వెళ్ళిపోవడంతో తనకు నచ్చినట్లే పూర్తిగా అమ్మాయిగా మారి తన కొత్త జీవితాన్ని జీవిస్తూ ఉంటాడు. అయితే విభూతి సమాజంలో తనకి ఎదురవుతున్న కష్టాలను తట్టుకోలేక చనిపోవాలి అనుకుంటాడు. అలా బస్సు నుంచి దూకేద్దాం అనుకున్న విభూతికి బస్సులో పురిటి నొప్పులతో బాధపడుతున్న రేవతి కనిపిస్తుంది రేవతి కూడా అచ్చం తన భర్త పోలికలతో ఉన్న విభూతిని చూసి షాక్ అవుతుంది. అలా విభూది హెల్ప్ తో రేవతి సింగాకి జన్మనిస్తుంది కొన్ని రోజులకి విభూతి దగ్గర నుంచి వెళ్ళిపోతూ రేవతి తన భర్త కి ఈ లెటర్ ని ఇవ్వమని చెప్పి ఒక లెటర్ ని విభూతికి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రేవతి. 

 స్టోరీ ప్రెసెంట్ కి వస్తుంది ఇది చెప్పిందంతా విని సింగా ఎంతో బాధపడతాడు ఇప్పుడే విభూతి రేవతి తనకి ఇచ్చిన లెటర్ ని మీ నాన్నకి ఇవ్వమని చెప్పి సింగాకి ఇస్తుంది మరోవైపు మౌని చెప్పడంతో ఏకాంబరం తను చేసింది తప్పు అని తెలుసుకొని మౌనిని సింగాకి ఇచ్చి పెళ్లి చేయడానికి సింగా యొక్క ఫ్రెండ్ మైకెల్ హెల్ప్ ద్వారా తను వెళ్ళినటువంటి వంశ వృక్షం నిలయానికి వస్తారు. మరోవైపు భవభూతికి పంపినట్టే విభూతి అలాంటి లెటర్ ని రాసి వాళ్ళ నానైనటువంటి యయాతికి కూడా పంపిస్తుంది. ఆ లెటర్ సహాయంతో యయాతి వంశవృక్ష నిలయానికి వచ్చి తన కొడుకు గురించి అడుగుతాడు అప్పుడే ఆ ప్లేస్ కి వచ్చినటువంటి భవభూతి యయాతి తన కొడుకు భవబూతి అని ఒప్పుకునేలా చేస్తాడు ఇక యయాతి కూడా తన కొడుకు భవభూతి అని ఒప్పుకోవడంతో ఆ ఆస్తి మొత్తం యయాతికి వెళ్తుంది అది చూసి భవభూతి  షాక్ అవుతాడు అప్పుడే భవభూతి మహర్షి శిష్యుల్లో ఒకళ్ళని ఏంటి ఆస్తి నాకు రావాలి కదా వాడికి వెళ్తుంది ఏంటి అని అడుగుతాడు. అప్పుడే మహర్షి శిష్యుల్లో ఒకళ్ళు ఒకవేళ ఆస్తి మీకు రావాలంటే నీకు కొడుకు ఉండాలి అని చెప్తాడు అప్పుడే అక్కడికి వచ్చిన సింగరేణిని చూసి భవభూతి కొంతసేపు నువ్వు నా కొడుకుగా యాక్ట్ చెయ్యి అని చెప్పి అడుగుతాడు. అప్పుడే అక్కడికి విభూతి కూడా వస్తుంది విభూతిని చూసినటువంటి యయాతి విభూతినే తన కొడుకు అని చెప్తాడు. అది విన్నటువంటి భవభూతి ఆస్తి ఒకరి పేరు మీదకి వెళ్ళాలి అంటే అతను అబ్బాయి అయ్యి ఉండాలి అని చెప్పి విభూతిని అవమానిస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న విభూతి దత్తత  వెళ్ళిపోయిన వాడివి నువ్వు వారసుడివి ఏంట్రా నేనే వారసుడిని అని వాళ్ళ నాన్న పక్కన హోమంలో కూర్చుంటుంది.

అప్పుడే సింగా  కూడా భవభూతితో ఒక భార్య పురిటి నొప్పులతో బాధపడుతుంటే తన పక్కన అండగా ఉండేవాడే భర్త మా అమ్మని ఒంటరిగా వదిలేసినటువంటి నీచుడివి నువ్వు ఆ సమయంలో మా అమ్మకి తోడుగా ఉన్న విభూదియే నాకు నాన్న లాంటి వాడు అని చెప్పి విభూది సింగాకి ఇచ్చిన లెటర్ ని భవభూతికి ఇచ్చి విభూది సైడ్ వెళ్ళిపోతాడు సింగా.   అదంతా చూసినటువంటి భవభూతి ఇక ఆస్తి తనకి దక్కకుండా వెళ్ళిపోతుంది అనే భయంతో ఇప్పటివరకు తను హేళన చేస్తూ మాట్లాడినటువంటి విభూతి దగ్గరికి వెళ్లి అక్క మనమిద్దరం కలిసి పుట్టాం కదా అలాగే ఆస్తిలో వాటాన్ని కూడా సమానంగా పంచుకుందామని అడుగుతాడు ఇది విన్న విభూది నవ్వుతూ ఇప్పటివరకు నీలో లేని సమానత్వం ఆస్తి దగ్గరికి వచ్చేటప్పటికి గుర్తుకు వచ్చిందా అయినా నువ్వు ప్రతి విషయంలో సమానత్వాన్ని పాటించి ఉంటే ఆ సమానత్వాన్ని గౌరవించే నీ భార్య రేవతి నిన్ను వదిలేసి దూరంగా అనాధగా చనిపోయి ఉండదు అయినా భార్యనే సమానంగా చూడలేని వాడివి బయట వాళ్ళని ఎలా చూస్తావ్ అయినా ఆ సమానత్వం అనే విషయాన్ని నువ్వు పాటించకపోయినా నేను ఎప్పుడూ పాటిస్తూనే ఉంటాను.  ఈ సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అయినా నాకు ఈ ఆస్తి మీద ఎలాంటి ఆశ లేదు నువ్వే కూర్చో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది విభూతి.

ఇలా చూస్తున్నటువంటి యయాతి నాకు పుట్టింది కూతురే నా వారసురాలు నా కూతురు విభూతి అని చెప్తాడు యయాతి అది విన్నటువంటి విభూతి ఎంతో ఆనందంగా ఫీల్ అవుతుంది మరోవైపు వాళ్ళ అమ్మ స్టోరీ విని, ఇప్పటివరకు వాళ్ళ అమ్మని సరిగ్గా అర్థం చేసుకోనందుకు అనుభూతి కూడా ఎంతో బాధపడి  వాళ్ళ అమ్మకి సారీ చెప్తుంది. తనకి అనుభూతి తనని అర్థం చేసుకున్నందుకు విభూతి ఎంతో ఆనందపడుతుంది. మరోవైపు సింగా ఇచ్చిన లెటర్ లో రేవతి నేను నీ దగ్గర నుంచి చెప్పకుండా వెళ్ళిపోవడానికి కారణం అందరికీ సమానత్వం గురించి బోధించే నా ఇంట్లోనే ఆ సమానత్వం లేకపోవడం నా గర్బస్రావానికి కారణం నువ్వే అని తెలుసుకొని తట్టుకోలేక వెళ్ళిపోతున్నాను తనకి అబ్బాయి పుట్టాడు ఇప్పటికైనా అందరికీ సమానత్వంతో చూస్తావని అనుకుంటున్నాను అని చెప్పి ఆ లెటర్ లో రాస్తుంది.  అది చదివినటువంటి భవభూతి ఎంతో ఎమోషన్ కి గురవుతాడు అలా తన భార్య కోరిక మేరకే తనకు వచ్చినటువంటి ఆస్తిలో అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు సమానంగా చదువుకోవాలి అని ఎక్కువ భాగాన్ని ఉపయోగించి కో ఎడ్యుకేషన్ కాలేజెస్ ని కట్టిస్తాడు. మరోవైపు సింగా వాళ్ళ వైఫ్ మౌనికి డెలివరీ అయినట్టు చూపించి ఈ మూవీ ఎండ అవుతుంది. 

Conclusion:

ఈ సమాజంలో ఆడ మగ అనే ఎలాంటి తేడా లేదు ఇద్దరు సమానమే అనే మంచి మెసేజ్ ని ఈ మూవీ ద్వారా ఎంతో అద్భుతంగా చూపించారు.  

::::: THE END :::::

For More Movie Reviews, Web Series Reviews Please Visit our Website: www.Filmywebstories.com

Leave a Comment

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

teTelugu
Scroll to Top